ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారులకు మరో వెసులుబాటు కల్పించింది
కేంద్ర ప్రభుత్వం. తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఎదురయినప్పుడు సెల్ఫ్
అటెస్టెడ్ డాక్యుమెంట్స్ సమర్పించి పీఎఫ్ ఖాతా నుంచి సొమ్ము తీసుకోవచ్చు.
ఇప్పటి వరకు ఆస్పత్రుల బిల్లులు చెల్లించాలంటే డాక్టర్లు ఇచ్చే ధ్రువీకరణ
పత్రాలుగానీ, కార్మిక బీమా కింద వైద్య సేవలు పొందడం లేదంటూ యజమాని ఇచ్చే
డాక్యుమెంట్స్ అవసరమయ్యేవి. మూడు రకాల ఫారాలను నింపాల్సి వచ్చేది. ఇప్పుడు
వాటి అవసరం లేకుండా నేరుగా అడ్వాన్సు తీసుకొనే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు
జారీ చేసింది. కనీసం నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి వస్తే
ఆరు నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని పీఎఫ్ ఖాతా నుంచి తీసుకోవచ్చు.
ఇందుకోసం పీఎఫ్ సంస్థ రూపొందించిన ఉమ్మడి క్లెయిమ్ ఫారాన్ని నింపితే
సరిపోతుంది. పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నా, కుష్టు, క్షయ, పక్షవాతం,
క్యాన్సర్, గుండెకు సంబంధించిన వ్యాదులోతో బాధపడుతున్నా ఈ సౌకర్యాన్ని
ఉపయోగించుకోవచ్చు. అవసరమైన పరికరాల కొనుగోలు కోసం దివ్యాంగులు కూడా ఎటువంటి
పత్రాలు సమర్పించకుండానే సొమ్ము విత్‌డ్రా చేసుకోవచ్చు. కర్మాగారం
మూతపడినా, వివాహాలు, పిల్లల చదువులు కోసం కూడా ఎలాంటి ఆధారాలు జత
చేయకుండానే సొమ్ము తీసుకునే అవకాశాన్ని ఈ ఉత్తర్వుల ద్వారా కల్పించింది
కేంద్ర సర్కారు.
ఈపీఎఫ్ డిపాజిట్లపై 2016-17 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిని చందాదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.
ఈపీఎఫ్ డిపాజిట్లపై 2016-17 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిని చందాదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.

No comments:
Post a Comment