Thursday, 24 November 2016

ప‌డిపోయిన రూపాయి

డాల‌ర్‌తో రూపాయి మారుక విలువ ఎప్పుడూ లేనంద‌గా ప‌త‌నం అయ్యింది. డాల‌రుతో రూపాయి మార‌కం విలువ రూ.68.87గా ఉంది. ఇది రాబోయే రోజుల్లో 70 మార్కును తాకే అవ‌కాశ‌మున్న‌ట్లు బిజినెస్ అన‌లిస్ట్‌లు చెబుతున్నారు.విదేశీ ఇన్వెస్ట‌ర్లు భార‌త స్టాక్స్‌ను అమ్మ‌డంతో ఒక్క‌సారిగా రూపీ వాల్యూ ప‌డిపోవ‌డానికి కార‌ణ‌మైంద‌న్నారు వాణిజ్య నిపుణులు. డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న విజ‌యం కూడా రూపాయి ప‌త‌నానికి కార‌ణంగా విశ్లేషిస్తున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత అంటే న‌వంబ‌ర్ 9 నుంచి రూపాయి విలువ 3శాతం మేరా ప‌త‌న‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు విదేశీ ఇన్వెస్ట‌ర్లు రూ.13వేల కోట్ల మేరా భార‌త స్టాక్స్‌ను అమ్మారు. చివరిసారిగా 2013, ఆగష్టు 28 68.80కు పడిపోయింది.

ఈ నెల 28న మెడికల్ షాపుల బంద్

మెడికల్ షాపు యాజమాన్యాలు ఈ నెల 28న బంద్ కు పిలుపునిచ్చాయి. డ్రగ్స్ కంట్రోల్ శాఖ దాడులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. మెడికల్ షాపులతో పాటు … ఆస్పత్రుల్లో ఉన్న షాపులు బంద్ లో పాల్గొనాలని  … కెమిస్ట్ర్ ఎండ్  డ్రగ్గిస్ట్  అసోసియేషన్ నిర్ణయించింది. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తీరును తప్పుబడుతున్నారు మెడికల్ షాప్ ఓనర్స్. అధికారులు టార్గెట్స్ పేరుతో ఇష్టానుసారంగా దాడులు చేసి.. కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా.. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్ పాటించి నిరసన తెలపాలని… రాష్ట్ర కెమిస్ట్ ఎండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ డిసైడ్ చేసింది. జలుబు, తలనొప్పి, జ్వరం వాటికి  కూడా ప్రిస్కిప్షన్ అంటూ డ్రగ్ కంట్రోల్ అధికారులు కేసులు పెడుతున్నారన్నారని … కెమిస్ట్ర్ అండ్ డ్రగ్గిస్ట్ అసిసోయేషన్ ప్రెసిడెంట్ వెంకటపతి ఆరోపించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెయ్యికి పైగా కేసులు నమోదు చేశారన్నారు. లైసెన్స్, ఫార్మసిస్ట్, నాసిరకం డ్రగ్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 28న రాష్ట్రంలో ఉన్న 25వేల మెడికల్ షాప్స్ తో పాటు.. ఆస్పత్రుల్లో ఉన్న షాపులు కూడా బంద్ లో పాల్గొంటాయన్నారు. H, H1 మెడిసిన్ అమ్మకాలపై సడలింపు ఇవ్వాలని కోరుతున్నారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తామని తేల్చి చెప్పారు.

Thursday, 10 November 2016

నోట్ల రద్దు నేపథ్యంలో రెండున్నర లక్షల డిపాజిట్ మించితే ఏమౌతుందో తెలుసా?

ఈ నెల 10నుంచి డిసెంబర్ 30 మధ్యలో చేసే డిపాజిట్లలో పూర్తి పారదర్శకత ఉండాలని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తెలిపారు. చిరు వ్యాపారులు, కార్మికులు చేసే డిపాజిట్లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ పన్ను పరిధిలోకి రాదని చెప్పారు. రెండున్నర లక్షల రూపాయలను మించి డిపాజిట్ చేయాలనుకుంటే ఆ మొత్తం ఆదాయ రిటర్న్స్‌లో గతంలో వెల్లడించిన దానికి సరిపోవాలని చెప్పారు. లేకపోతే రెండు వందల శాతం టాక్స్ పెనాల్టీ పడుతుందని రెవిన్యూ కార్యదర్శి స్పష్టం చేశారు.

క్యాష్‌ ఆన్‌ డెలివరీ బంద్‌...

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పలు ఈ-కామర్స్‌ సంస్థలు క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సీవోడీ) సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. మరికొన్ని సంస్థలు సీవోడీ ఆర్డర్లపై పరిమితులు విధించాయి. అమెజాన్‌ సంస్థ క్యాష్‌ ఆన్‌ డెలివరీ సేవలను పూర్తిగా నిలిపివేసింది. 8వ తేదీ వరకు సీవోడీ ద్వారా ఆర్డరు చేసిన వినియోగదారులను సైతం డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు జరపాలని సూచించింది. అవి అందుబాటులో లేని పక్షంలో చెల్లుబడి అయ్యే నోట్లను ఇచ్చి వస్తువులను డెలివరీ తీసుకోవాలని కోరింది. స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు సీవోడీ ఆర్డర్లపై పరిమితులు విధించాయి. రూ.2 వేలు లోపు కొనుగోళ్లకే సీవోడీ ఆర్డర్లను అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ-కామర్స్‌ సంస్థలు జరిపే లావాదేవీల్లో 60 శాతం సీవోడీ ద్వారానే జరుగుతుంటాయి. త్వరలోనే సీవోడీ ఆర్డర్లను పునరుద్ధరిస్తామని ఈ-కామర్స్‌ సంస్థలు ప్రకటించాయి.

రేపటి నుంచి ఏటీఎంల్లో కొత్త నోట్లు...

దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలు 11వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తాయని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి అశోక్‌ లావాసా తెలిపారు. అదే రోజు నుంచి కొత్తగా ముద్రించిన రూ.500, రూ.2 వేల నోట్లు ఏటీఎంల్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అయితే కొద్దిరోజుల పాటు వినియోగదారులు రోజుకి రూ.2 వేలు మాత్రమే ఏటీఎం నుంచి డ్రా చేసుకొనే వెసులుబాటు ఉంటుందని, వారానికి గరిష్ఠంగా రూ.20వేలు వితడ్రా చేసుకోవచ్చని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంల్లో పాత నోట్లను మార్చేందుకు వీలుగా బుధ, గురువారాల్లో ఏటీఎంలను మూసివేసిన విషయం విదితమే. కొద్ది రోజులపాటు ఏటీఎంల నుంచి నగదు వితడ్రాయిల్స్‌ భారీగా పెరుగుతాయని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. దీనికి అనుగుణంగా తరచూ ఏటీఎంల్లో నగదు నింపేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. వంద నోట్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా అన్ని ఎస్‌బీఐ బ్రాంచీలు, ఏటీఎంల్లో రానున్న రెండు రోజుల్లో రూ.100 నోట్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచనున్నట్లు ఎస్‌బీఐ ఎండీ రజనీష్‌ కుమార్‌ ప్రకటించారు.

Tuesday, 8 November 2016

రూ.2000 నోటు త్వరలో...

రూ.2000 నోటును జారీ చేయడానికి భారతీయ రిజర్వు బ్యాంకు అంగీకరించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 
 
రూ.2000 నోటు ఇదే.

రెండు రోజులు ఏటీఎంలు బంద్


అవినీతిపై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అవినీతిని దేశం నుంచి సమూలంగా నిర్మూలించేందుకు ఇప్పటి వరకు దేశంలో చలామణిలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను నిషేధిస్తున్నట్ట ప్రకటించారు. అంతేకాక రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు ఏటీఎంలు పనిచేయవని పేర్కొన్నారు.

నేటి అర్ధరాత్రి నుంచి 500, వెయ్యినోట్లు చెలామణిలో ఉండవు: ప్రధాని మోదీ

నల్లధనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధం ప్రకటించారు. నేటి అర్ధరాత్రి నుంచి అంటే నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి 500, వెయ్యిరూపాయల నోట్లు చెలామణిలో ఉండవని ప్రధానమంత్రి ప్రకటించారు. అయితే ప్రజలు తమ వద్ద ఉన్న 500, వెయ్యి నోట్లు మార్చుకునేందుకు 50 రోజుల గడువిచ్చారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకూ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో పాత 500, వెయ్యినోట్లు మార్చుకునే వీలిచ్చారు. నల్లధనాన్ని నియంత్రించేందుకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు.