శవాలను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా కార్ప్స్ అనే హోటల్‌ను ఏర్పాటు చేశాడు. దాంట్లో ఒక్కరోజుకు ఒక్క శవాన్ని ఉంచడానికి 5800 రూపాయలు తీసుకుంటారు. స్థలాభావం వల్లనో, ఇబ్బందులు ఎందుకనో బంధువులు ఉండటానికి మాత్రం అక్కడ వీలులేదు. కావాలంటే రోజుకు రెండుసార్లు వచ్చి తమవారి శవాలను చూసుకోవచ్చు. ఆసుపత్రుల్లో శవాలను భద్రపరచడానికి ఎలా ఏసీ గదులు ఉంటాయో.. అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. టీఆర్టీ వరల్డ్ సౌజన్యంతో ఆ హోటల్ వీడియోను మీరూ చూడండి..
Saturday, 30 April 2016
ఆ హోటల్లో శవాలు మాత్రమే ఉంటాయి..!
శవాలను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా కార్ప్స్ అనే హోటల్‌ను ఏర్పాటు చేశాడు. దాంట్లో ఒక్కరోజుకు ఒక్క శవాన్ని ఉంచడానికి 5800 రూపాయలు తీసుకుంటారు. స్థలాభావం వల్లనో, ఇబ్బందులు ఎందుకనో బంధువులు ఉండటానికి మాత్రం అక్కడ వీలులేదు. కావాలంటే రోజుకు రెండుసార్లు వచ్చి తమవారి శవాలను చూసుకోవచ్చు. ఆసుపత్రుల్లో శవాలను భద్రపరచడానికి ఎలా ఏసీ గదులు ఉంటాయో.. అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. టీఆర్టీ వరల్డ్ సౌజన్యంతో ఆ హోటల్ వీడియోను మీరూ చూడండి..
Friday, 29 April 2016
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!
సరిగ్గా తిన్నా, తినకపోయినా, అసలు ఎంత తిన్నా అజీర్ణం, కడుపులో మంట,
గ్యాస్ సమస్యలు నేడు ఎక్కువ శాతం మందిని బాధిస్తున్నాయి. వీటికి కారణాలు
అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా మనలో అధిక శాతం మంది
గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడమో, అంటాసిడ్ టానిక్లు తాగడమో చేస్తారు.
అప్పటికప్పుడు ఇవి ఉపశమనాన్ని కలిగించినా దీర్ఘకాలికంగా వీటిని వాడితే ఇతర
అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా
ఉంటుంది. ఈ క్రమంలో మనకు లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి పైన
పేర్కొన్న సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
నీరు…
అవును, నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. జీర్ణాశయంలో అధికంగా ఉత్పన్నమయ్యే గ్యాస్ కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు జీర్ణం కాకుండా ఉన్న పదార్థాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి.
లవంగాలు…
భోజనం చేసిన తరువాత గ్యాస్ అధికంగా వస్తుంటే అందుకు లవంగాలు ఉత్తమమైన పరిష్కారం చూపుతాయి. 2, 3 లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు గ్యాస్ సమస్య ఇట్టే తొలగిపోతుంది. అసిడిటీ నుంచి కూడా బయట పడవచ్చు.
తులసి ఆకులు…
జీర్ణాశయంలో వచ్చే సమస్యలను తొలగించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని బాగా నలిపి, దానికి కొంత తేనెను జతచేసి ఉదయాన్నే పరగడుపున తాగితే అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి.
సోంపు…
బెల్లం…
అసిడిటీ సమస్య బాధిస్తుంటే చిన్న బెల్లం ముక్కను భోజనం చేసిన ప్రతిసారీ నోట్లో వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది. దీంతో తిన్న ఆహారం కూడా సరిగ్గా, త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య తొలగిపోతుంది.
అసిడిటీ సమస్య బాధిస్తుంటే చిన్న బెల్లం ముక్కను భోజనం చేసిన ప్రతిసారీ నోట్లో వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది. దీంతో తిన్న ఆహారం కూడా సరిగ్గా, త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య తొలగిపోతుంది.
నీరు…
అవును, నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. జీర్ణాశయంలో అధికంగా ఉత్పన్నమయ్యే గ్యాస్ కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు జీర్ణం కాకుండా ఉన్న పదార్థాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి.
లవంగాలు…
భోజనం చేసిన తరువాత గ్యాస్ అధికంగా వస్తుంటే అందుకు లవంగాలు ఉత్తమమైన పరిష్కారం చూపుతాయి. 2, 3 లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు గ్యాస్ సమస్య ఇట్టే తొలగిపోతుంది. అసిడిటీ నుంచి కూడా బయట పడవచ్చు.
తులసి ఆకులు…
జీర్ణాశయంలో వచ్చే సమస్యలను తొలగించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని బాగా నలిపి, దానికి కొంత తేనెను జతచేసి ఉదయాన్నే పరగడుపున తాగితే అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి.
సోంపు…
అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సోంపు
బాగా ఉపయోగపడుతుంది. 1 టీస్పూన్ సోంపును భోజనం చేసిన ప్రతిసారీ వేసుకుంటే
అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ కూడా తగ్గుతుంది. ఆహారం త్వరగా,
సులభంగా జీర్ణమవుతుంది.
పెరుగు…
కొద్దిగా పెరుగును తీసుకుని అందులో కీరదోస ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన తరువాత సేవిస్తే అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, అసిడిటీ కూడా తగ్గుతాయి. కడుపులో ఏర్పడే మంటను ఇది తొలగిస్తుంది.
పెరుగు…
కొద్దిగా పెరుగును తీసుకుని అందులో కీరదోస ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన తరువాత సేవిస్తే అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, అసిడిటీ కూడా తగ్గుతాయి. కడుపులో ఏర్పడే మంటను ఇది తొలగిస్తుంది.
మీ స్మార్ట్‌ఫోన్ గురించి మీకు తెలియని ఐదు విషయాలు..!
మొబైల్
రంగంలో అత్యాధునిక సాంకేతికతను పరిచయం చేయడంలో యాపిల్ ఐ ఫోన్ ఎప్పుడూ
ముందుంటుంది. అలాంటి ఐ ఫోన్ సాంకేతికతను అనుసరించడంలో మిగిలిన కంపెనీలు
కూడా అంతే ముందుంటాయి. దాదాపు ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ ఐదు ఫీచర్లు ఐ ఫోన్
నుంచి కాపీ కొట్టినవేనని టెక్ పరిశోధకులు చెబుతున్నారు. అందులో మొదటిది
మెటల్ గ్లాస్ డిజైన్. ఇప్పుడొచ్చే ప్రతీ స్మార్ట్‌ఫోన్ దాదాపుగా మెటల్
గ్లాస్‌తో వస్తున్నదే. ఐ ఫోన్ 4 కోసం మొట్టమొదట ఈ మెటల్ డిజైన్‌ను
రూపొందించారు. ఆ తరువాత అన్ని కంపెనీలు ఈ డిజైన్‌నే అనుసరిస్తుండటం విశేషం.
మరో ఫీచర్ డ్యుయల్ ఫ్లాష్ కెమెరా.
ఐ ఫోన్ 5ఎస్
ద్వారా ఈ డ్యుయల్ ఫ్లాష్ కెమెరా పరిచయమైంది. ప్రస్తుతం ఈ డ్యుయల్ ఫ్లాష్
అనేది ఆండ్రాయిడ్ ఫోన్లలో కామన్ ఫీచర్‌గా మారింది. మోషన్ కో ప్రాసెసర్ కూడా
ఈ కోవలోకే వస్తుంది. బ్యాటరీ లైఫ్‌ను సేవ్ చేయడంలో ఈ ప్రాసెసర్ కీలక పాత్ర
పోషిస్తోంది. ఈ ఫీచర్‌ను కూడా కాలానుగుణంగా మార్చుకుని ఇతర కంపెనీలు
ప్రవేశపెట్టాయి. ఐఫోన్ 6ఎస్ ప్రవేశపెట్టిన మరో కొత్త ఫీచర్ 3డి టచ్. ఈ
ఆప్షన్‌ను కూడా తమ ఫోన్లలో ప్రవేశపెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పుడొస్తున్న స్టైలిష్ ఎడ్జెస్ కూడా ఆపిల్ కంపెనీ
నుంచే వచ్చాయి. ఆపిల్ ఫోన్‌కు వన్నె తెచ్చి అందంగా కనిపించేలా చేసింది కూడా
ఈ స్టైలిష్ ఎడ్జెసే కారణం.
మతిమరుపుతో బాధపడుతున్నారా? పుదీనా టీ తాగండి చాలు...
లండన్:
మతిమరుపుతో బాధపడుతున్నవారికి పుదీనా టీ అద్భుతంగా పనిచేస్తుందని బ్రిటీష్
వైద్యులు చెబుతున్నారు. 180 మందిపై ఈ ప్రయోగం చేశారు. చాలా కాలం క్రితం
సంఘటనలకు సంబంధించిన విషయాలు కూడా గుర్తుండిపోతాయట. అంతే కాదు బద్దకం పోయి
అప్రమత్తత కూడా అలవరుతుందట. నాటింగ్‌హమ్‌లో జరిగిన బ్రిటీష్ సైకలాజికల్
సొసైటీ సదస్సులో ఈ ఫలితాలను ప్రస్తావించారు.
తెలంగాణ ఎంసెట్, టెట్ వాయిదా
హైదరాబాద్ : తెలంగాణలో
టెట్, ఎంసెంట్ వాయిదా పడ్డాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం
నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్‌కు అనుగుణంగా మే1న టెట్, మే2న ఎంసెట్
జరగాల్సి ఉంది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పోలీసుల తనిఖీలకు నిరసనగా బంద్
నిర్వహిస్తున్న ప్రైవేటు కాలేజీల జేఏసీ.. ఈ పరీక్షలకు కేంద్రాలను
ఇచ్చేదిలేదని స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ
పరీక్షలను మే20వ తేదీలోపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఉపముఖ్యమంత్రి
కడియం శ్రీహరిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రైవేటు కాలేజీల సహాయనిరాకరణ
నేపథ్యంలో పరీక్షలను పూర్తిగా ప్రభుత్వ కాలేజీల్లో, ప్రభుత్వ ఉద్యోగులతో
నిర్వహించాలని ఆదేశించారు. ప్రైవేటు కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి
తీరుతామని స్పష్టం చేశారు. ఇదిలావుండగా.. అంతకుముందు ప్రైవేటు విద్యాసంస్థల
జేఏసీ ప్రతినిధులు జి రమణారెడ్డి, విజయభాస్కర్, సిద్ధేశ్వర్, రాందా్‌సతో
కడియం చర్చలు జరిపారు. విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీ అంశాన్ని సీఎం
దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. పూర్తిస్థాయి హామీ
లభించలేదని, అందుకే టెట్, ఎంసెట్‌కు పరీక్ష కేంద్రాలను ఇచ్చేదిలేదని భేటీ
అనంతరం జేఏసీ ప్రతినిధులు విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
ఉద్యోగులకు శుభవార్త.. పీఎఫ్ వడ్డీ రేటు పెంచిన కేంద్రం..
న్యూఢిల్లీ: ఉద్యోగ
భవిష్య నిధి విషయంలో కేంద్రంపై మరోసారి వెనక్కి తగ్గింది. పీఎఫ్‌పై
వడ్డీని 8.8 శాతానికి పెంచింది. కమిటీ సూచనలను పక్కన పెట్టిన ఆర్థిక శాఖ
పీఎఫ్‌పై వడ్డీని 8.7 శాతంగా ఇటీవల ప్రకటించింది. కార్మిక సంఘాలతో పాటు
ప్రతిపక్షాల నుంచి దీనిపై విమర్శలు రావడంతో దీన్ని కాస్త పెంచింది. అలాగే
ఉద్యోగ భవిష్య నిధిని 58 ఏళ్ళ వయసు వరకు మొత్తం విత్ డ్రా చేయకూడదన్న
ప్రతిపాదనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ నిర్ణయంపైనా
కేంద్రం వెనక్కి తగ్గింది. ఆరు నెలల పాటు పాత విధానమే అమలులో ఉంటుందని
ఇటీవల ప్రకటించింది.
మాంసం ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త!
మాంసం ఎక్కువగా తింటే ముసలోళ్లలాగా కనిపిస్తారట !
ఆహారంలో
భాగంగా ఎక్కువ శాతం మాంసం (చికెన్, మటన్, బీఫ్) తీసుకుంటున్నారా? అయితే
మీకు కొంచెం ఇబ్బందే. కూరగాయలు, పండ్లు వంటి సాత్వికాహారం కాకుండా మాంసం
ఎక్కువగా తినేవారు ఎక్కువ వయసున్నట్టు కనిపిస్తారట. అంతేకాకుండా త్వరగా
వృద్ధాప్య ఛాయలు ముంచుకురావడానికి మాంసాహారం కారణమవుతుందట.
ఈ
విషయం లండన్‌లో గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. మాంసాహారం
ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సీరం ఫాస్పేటు స్థాయిలు అధికమై వయసు
పెరిగనట్టు కనబడతారట. అలాగే మాంసాహారంలో ఉండే ఈ ఫాస్పేటుల వల్ల
మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయట. అందుకే మాంసాహారం తక్కువగాను, శాకాహారం
ఎక్కువగానూ తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
రంగు చూసి కొంటే... రోగం తప్పదు!
మండు
వేసవి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఆహార పదార్థల విషయంలో జాగ్రత్తలు
తీసుకోకపోతే ఆరోగ్యానికి చేటే. ముఖ్యంగా ఈ సీజన్‌లో లభించే పండ్ల విషయంలో
చాలా అవగాహన అవసరం. ఎర్రగా చూడగానే నోరూరేలా కనిపిస్తున్నాయి కదా అని...
కొనుగోలు చేసి తింటే రోగం తప్పదు. అమ్మకాలు పెంచుకునేందుకు పక్వానికి
రాకుండానే రసాయనాలతో మగ్గబెట్టి ప్రజలకు కొంతమంది వ్యాపారులు
అంటగడుతున్నారు. పండ్లు కొనుగోలు చేసినప్పుడు అవి పక్వానికి వచ్చాయా?
లేకుంటే రసాయనాలు వాడారా? అన్న విషయాన్ని గమనించి కొనుగోలు చేయాలని
నిపుణులు సూచిస్తున్నారు.
మామిడి పండు ఎర్రగా
ఉందని ఆశపడి కొనుగోలు చేస్తే రోగం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పండును రంగు చూసి కొనుగోలు చేయకుండా... అసలు పండు పక్వానికి వచ్చిందో లేదో
పరిశీలించి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ను
మామిడిపండ్లు ముంచెత్తుతున్నాయి. మార్కెట్‌లో లభ్యమవుతున్న మామిడిపండ్లు
మేడి పండు చందంగానే కనిపిస్తున్నాయి. వీటి రంగును చూస్తే నోరూరిస్తున్నాయి.
దీంతో వినియోగదారులు వెనుకాముందు చూడకుండా వీటి కొనుగోలుకు ప్రాధాన్యం
ఇస్తున్నారు. మామిడికాయ పక్వానికి రావాలంటే సుమారు 100 నుంచి 120 రోజులు
వరకూ పడుతుంది. అయితే ఈదురుగాలులకు నేల రాలిన మామిడికాయలను రసాయనాలను
ఉపయోగించి వ్యాపారులు కృత్రిమంగా పండిస్తుంటారు. అలాగే ముందస్తుగా
మార్కెట్‌లోకి పక్వానికి రాని కాయలను కోసి రసాయనాలను వినియోగించి అమ్మకాలకు
సిద్ధం చేస్తారు. ఈ పళ్లను తినడంతో అనారోగ్యాలు చోటు చేసుకుంటున్నాయని
వైద్యులు పేర్కొంటున్నారు. ఏటా జనవరి మొదటివారం నుంచి మామిడిపూత
మొదలవుతుంది. ఈ ఏడాది కూడా సమయానికి మామిడిపూత వచ్చినప్పటికీ... అనావృష్టి,
మంచు దెబ్బతో పూత పాడైంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పువ్వు, పిందె
కనిపించింది. అంటే కాయ పక్వానికి రావాలంటే మే నెల చివరకు గానీ రైతుల
దరిచేరదు. అయితే పక్వ దశకు చేరకుండానే మామిడిపళ్లను రసాయనాలు ఉపయోగించి
వ్యాపారులు పండిస్తున్నారు.
రంగు కోసం రసాయనాలు
మామిడి
పండ్లను మంచి రంగులోకి మార్చి అధిక లాభాలను ఆర్జించాలనే ఉద్దేశ్యంతో
వ్యాపారులు పక్వానికి రాని మామిడికాయలపై వివిధ రసాయనాలను
ప్రయోగిస్తున్నారు. అయితే ఆ పళ్లను కొనుగోలు చేసి వినియోగదారులు అనారోగాలకు
గురవుతున్నారు. మామిడి పళ్లకు చూడముచ్చటైన రంగు కోసం కాల్షి యంను, కాయ
పక్వానికి వచ్చేందుకు ఈథిలిన్ రసాయాన్ని వినియోగిస్తున్నారు. దీంతో అవి
పూర్తి పక్వ దశకు వచ్చిన మామిడిపండ్లు లాగానే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా
సపోట, బొప్పాయి, అరటి వంటి పళ్లను పండించేందుకు కూడా వ్యాపారులు ఈ
రసాయనాలను వినియోగిస్తున్నారు.
ప్రజారోగ్యంపై ప్రభావం
కాల్షియం,
ఈథిలిన్ వంటి రసాయనాలను వినియోగించడంతో ఉదరకోశ వ్యాధులు, అజీర్ణం వంటి
సమస్య లు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
పండ్లను ఎక్కువుగా తీసుకోవడంతో అవి మానవ శరీరానికి విటమిన్లు, పోషక విలువలు
పెంపొందించుకోవచ్చు అనే మాట ఎలా ఉన్నా నేటి రోజుల్లో మాత్రం ఇటువంటి
రసాయనాలు వినియోగించే పండ్లను తినడంతో అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు
మెండుగా ఉన్నాయని వైద్యులు, శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
హైకోర్టు ఆదేశాలు అమలయ్యేనా?
మామిడికాయలను
కృత్రిమ పద్దతిలో మాగబెట్టేందుకు వినియోగిస్తున్న ప్రమాదకరమైన రసాయనాలను
వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా వినియోగిస్తున్నారని, వీటిని నియంత్రించాలని
హైకోర్టు ఆదేశించింది. పండ్లు పక్వానికి రాకుండా రసాయనాలను వినియోగించి
కృత్రిమంగా పండిస్తున్న వ్యాపారులపై కొరడా ఝులిపించాలని ఆదేశించింది. గతంలో
కూడా హైకోర్టు చొరవ తీసుకోవడంతో ఆయావిభాగాల అధికారులు హడావుడి చేసి చేతులు
దులుపుకున్నారు. యథావిధిగానే వ్యాపారులు తమ కార్యకలాపాలను
కొనసాగిస్తున్నారు. ఒక్క మామిడికాయపైనే కాకుండా వివిధ రకాల పండ్ల రకాలను
కృత్రిమంగా పండించేందుకు వ్యాపారులు చేస్తున్న ప్రయత్నాలను పూర్తిస్థాయిలో
అధికార యంత్రాంగం అడ్డుకోవల్సి ఉంది. లేనిపక్షంలో వీటి ప్రభావం మానవాళిపై
తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించనుంది.ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా
నందమూరి తారకరామారావు తెలుగు
దేశం పార్టీని స్థాపిస్తే..
ఇవాళ తెలుగుదేశం నేతలు కాంగ్రెస్‌తో
జత కట్టడం శోచనీయమని తెలంగాణ
రాష్ట్రమంత్రి కేటీఆర్ విమర్శించారు.
తెలుగుదేశం నేతల తీరుతో ఎన్టీఆర్
ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఖమ్మం
జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప
ఎన్నికకు తుమ్మల నాగేశ్వరరావు
నామినేషన్ వేయనున్న సందర్భంగా
నాయుడుపేటలోని పెద్ది ఎల్లారెడ్డి
ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన
కార్యకర్తల సమావేశానికి మంత్రి
కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ... అసాధారణమైన
పరిస్థితుల్లో పాలేరు ఉప ఎన్నిక
వచ్చింది.. తుమ్మల నాగేశ్వరరావును
భారీ మెజార్టీతో గెలిపించాలని
కోరారు. సమావేశంలో మంత్రి తుమ్మల
నాగేశ్వరరావుతో పాటు ఉప ముఖ్యమంత్రి
కడియం శ్రీహరి, పలువురు తెరాస
నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ర్యాలీగా వెళ్లి
తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్
వేయనున్నారు.
మొబైల్‌కు ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ద్వారా చార్జింగ్ పెడుతున్నారా?
మితంగా
చార్జింగ్.. అమితంగా బ్యాటరీ వాడకం.. అస్తమానం మొబైల్ వాడుతూ ఉండటం వల్ల
చార్జింగ్ పెట్టేందుకు సాధారణంగా సమయం దొరకదు. దాని వల్ల రాత్రి మొత్తం
చార్జింగ్ పెట్టి ఉదయమే తీస్తుంటారు. ఈ విధానం వల్ల బ్యాటరీ త్వరగా దాని
సామర్థ్యం కోల్పోతూ ఉంటుంది.
బ్యాటరీ నిర్వహణలో చిట్కాలు...
1. బ్యాటరీ 90 శాతం నిండే లోపే చార్జింగ్ తీసే యాలి. అంతకన్నా ఎక్కువగా చార్జింగ్ ఉంచితే క్రమేణా దాని సామర్థ్యం కోల్పోతుంది.
2.
సాధారణంగా 20 నుంచి 80 శాతం మధ్యలోనే చార్జింగ్ వాడకం ఉండాలి. 20 శాతం
కన్నా తక్కువ చార్జింగ్ వాడుతున్నప్పుడు రేడియేషన్ కూడా ఎక్కు వగా
ఉంటుందని నిపుణులు హెచ్చరిసున్నారు.
కంప్యూటర్ ద్వారా చార్జింగ్ మంచిదా..?
- మామూలు చార్జర్‌తో 5 వోల్ట్స్, 1 యాంప్స్ విద్యుత్తు వస్తుంది. అదే కంప్యూటర్ యూఎస్‌బీ నుంచి 5 వోల్డ్స్, 0.5 యాంప్స్ వస్తుంది.
- యాంప్స్ తేడా వల్ల చార్జింగ్ అయ్యే వేగం తగ్గుతుంది తప్పా వేరే ఇబ్బంది ఉండదు. సాధారణ చార్జర్‌తో వేగంగా అవుతుంది ఫోన్ కొంత మేర వేడెక్కుతుంది. అదే యూఎస్‌బీ నుంచి అయితే వేగం తక్కువైనా వేడి ఎక్కడం తక్కువగా ఉంటుంది.
- యూఎస్‌బీ 3.0 నుంచి మాత్రం 0.900 యాంప్స్ రావడం వల్ల సాధారణ చార్జర్‌కి దానికి పెద్దగా తేడా ఉండదు. పైగా నష్టం కూడా లేదు.
- యూఎస్‌బీ ద్వారా చార్జింగ్ చేసుకోవాలంటే సిస్టమ్ నుంచి నేరుగా పెట్టుకోవాలి తప్పా యూఎస్‌బీ హబ్ ద్వారా పెట్టుకోకూడదు. దానికి కనెక్ట్ చేసిన వేరు డివైస్‌ల వల్ల కొంత ఇబ్బంది కలిగి చార్జింగ్ అయ్యే విధానంలో వ్యత్యాసాలు ఏర్పాడతాయి.
‘కత్తిలాంటోడు’ మొదలు
మెగా అభిమానులకు పండుగ మొదలైంది.
చిరంజీవి రీ ఎంట్రీ కోసం ఎంతో
కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు
మండే ఎండాకాలంలో చల్లని ఐస్‌క్రీం
లాంటి వార్త. వి.వి.వినాయక్
దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా
తెరకెక్కుతున్న చిత్రం ‘కత్తిలాంటోడు’(వర్కింగ్
టైటిల్). శుక్రవారం ఈ చిత్రాన్ని
లాంఛనంగా ప్రారంభించారు. చిరు
తనయుడు రామ్‌చరణ్ తన ఫేస్‌బుక్
ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ...
ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో
మెగా ఫ్యామిలీ పాల్గొని సందడి
చేశారు.
పరుచూరి
వెంకటేశ్వరరావు చిరంజీవి నూతన
చిత్రానికి క్లాప్ కొట్టారు.
అల్లు అరవింద్ కెమెరా స్విచాన్
చేశారు. కొణిదెల ప్రొడక్షన్
కంపెనీ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు.
మరిన్ని వివరాలను త్వరలోనే
వెల్లడిస్తామని చిత్ర బృందం
తెలిపింది. చిరంజీవి 150వ చిత్రం
కావడం, చాలా కాలం తరువాత ఆయన
ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో
మెగా అభిమానులు ‘కత్తిలాంటోడు’
కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ
ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేల్.
పరుచూరి
వెంకటేశ్వరరావు చిరంజీవి నూతన
చిత్రానికి క్లాప్ కొట్టారు.
అల్లు అరవింద్ కెమెరా స్విచాన్
చేశారు. కొణిదెల ప్రొడక్షన్
కంపెనీ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు.
మరిన్ని వివరాలను త్వరలోనే
వెల్లడిస్తామని చిత్ర బృందం
తెలిపింది. చిరంజీవి 150వ చిత్రం
కావడం, చాలా కాలం తరువాత ఆయన
ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో
మెగా అభిమానులు ‘కత్తిలాంటోడు’
కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ
ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేల్.Sunday, 24 April 2016
కళ్లులేని ఈ చిన్నారి ఈత కొట్టడంలో దిట్ట
లండన్: బ్రిటన్‌లో ఉండే
డేనియల్‌కు 13 నెలల క్రితం ఈ చిన్నారి పుట్టింది. అయితే పుట్టుకతోటే ఈ
పసిపాప కళ్లులేకుండా పుట్టింది. ప్రెగ్నన్సీ సమయంలో శిశువు మెదడులో
పులిపిరి ఉందని వైద్యులు చెప్పారు. పుట్టాక చూస్తే పాపకు కళ్లులేవు. పదివేల
మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అబార్షన్
చేయించుకోమన్నా డేనియల్ వినలేదు. జన్మనిచ్చాక చిన్నారికి డైసీ స్మిత్ అని
పేరుపెట్టుకున్నారు. తనతో పాటు డైసీ స్మిత్‌ను తల్లి డేనియల్ రోజూ
స్విమ్మింగ్‌పూల్‌కు తీసుకెళ్లేది. నీటిలో ఆడటమంటే, స్విమ్మింగ్ అంటే
డైసీకు చాలా ఇష్టమని ఆమె తల్లి డేనియల్ చెబుతున్నారు. డైసీకి గ్లాస్ కళ్లు
పెట్టించేందుకు డేనియల్ వైద్యులను సంప్రదించారు. సైన్స్ రోజురోజుకీ
అభివృద్ధి చెందుతోన్న తరుణంలో చిన్నారికి భగవంతుడు కళ్లు ప్రసాదించాలని
డైసీ గురించి తెలిసినవారందరూ ప్రార్ధిస్తున్నారు.
క్యాన్సర్‌తో రోజూ 50మంది చిన్నారుల మృతి
న్యూదిల్లీ:
భారత్‌లో నిత్యం 50 మంది చిన్నారులు
క్యాన్సర్ కారణంగా అర్థాంతరంగా
తనువు చాలిస్తున్నారు. వీరంతా
14ఏళ్లలోపు వయస్సు వారే. ఇటీవల
నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం
బయటపడింది. వ్యాధి నిర్ధారణ
కష్టం కావడం, చికిత్సను నిర్లక్ష్యం
చేయడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి
తలెత్తుతోంది.
ఈ సర్వే వివరాలను ది జర్నల్‌ఆఫ్ గ్లోబల్ ఆంకాలజీలో ప్రచురించారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే భారత్‌లాంటి దేశాల్లో క్యాన్సర్ పై అవగాహన లేకపోవడం.. సరైన సమాచారం అందుబాటులో ఉండకపోవడం.. వీటిని ఎదుర్కొనడానికి ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో సరైన వ్యూహాలు అమలు చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ క్యాన్సర్ బారిన పడిన దాదాపు 80శాతం మంది చిన్నారులు చికిత్సతో ఈ మహమ్మారి నుంచి బయటపడుతున్నారు. భారత్‌లో ఒక్క ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం క్యాన్సర్ పేషంట్లకు ఉచిత చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించింది. యూనివర్శిటీ ఆఫ్ టొరంటో, ముంబయి విశ్వవిద్యాలయం, టాటా మెమోరియల్ సెంటర్ తదితర అంతర్జాతీయ సంస్థలు ఈ సర్వేను నిర్వహించాయి. దీనిని బట్టి భారత దేశంలో నిత్యం ప్రతి పదిలక్షల మందిలో 37మంది పీడియాట్రిక్ క్యాన్సర్ కారణంగా మృతి చెందుతున్నారు.
ఈ సర్వే వివరాలను ది జర్నల్‌ఆఫ్ గ్లోబల్ ఆంకాలజీలో ప్రచురించారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే భారత్‌లాంటి దేశాల్లో క్యాన్సర్ పై అవగాహన లేకపోవడం.. సరైన సమాచారం అందుబాటులో ఉండకపోవడం.. వీటిని ఎదుర్కొనడానికి ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో సరైన వ్యూహాలు అమలు చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ క్యాన్సర్ బారిన పడిన దాదాపు 80శాతం మంది చిన్నారులు చికిత్సతో ఈ మహమ్మారి నుంచి బయటపడుతున్నారు. భారత్‌లో ఒక్క ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం క్యాన్సర్ పేషంట్లకు ఉచిత చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించింది. యూనివర్శిటీ ఆఫ్ టొరంటో, ముంబయి విశ్వవిద్యాలయం, టాటా మెమోరియల్ సెంటర్ తదితర అంతర్జాతీయ సంస్థలు ఈ సర్వేను నిర్వహించాయి. దీనిని బట్టి భారత దేశంలో నిత్యం ప్రతి పదిలక్షల మందిలో 37మంది పీడియాట్రిక్ క్యాన్సర్ కారణంగా మృతి చెందుతున్నారు.
వేదికపైనే గాయకుడి మృతి
అబిజాన్ : కాంగోకు చెందిన ప్రముఖ గాయకుడు పాపా వెంబా(66) ఐవరీ కోస్టులోని అబిజాన్‌లో ఓ వేదికపై కుప్పకూలిపోయి మరణించారు. ప్రదర్శన ఇస్తూనే ఆయన వేదికపై పడిపోయారు. కానీ ఏం జరిగిందో గమనించని డ్యాన్సర్లు తమ ప్రదర్శనను కొనసాగించారు. కాసేపటికి కానీ అసలు విషయం తెలియలేదు. ఆయన మృతి వార్తను ఫ్రాన్స్‌కు చెందిన ఓ మీడియా సంస్థ ప్రకటించింది.
‘కోహినూర్’కు ఆ పేరు పెట్టింది ఎవరు!
కోహినూర్..
భారతీయులకు సంబంధించినంత వరకు ఇది చాలా విలువైనది. ఎంతో విలువైనదాని
గురించి సంబోధించేటపుడు దానిని కోహినూర్‌తో పోల్చడం మనకు అలవాటే. ఈ వజ్రం
గురించి ఎప్పట్నుంచో భారత్, బ్రిటన్ ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది.
నిజానికి అందరూ అనుకుంటున్నట్టుగా కోహినూర్‌ను బ్రిటీష్ వారు
కొల్లగొట్టలేదు, దోచుకెళ్లలేదు. ఓ మహారాజు దానిని ఇంగ్లండ్ మహారాణికి
బహుమతిగా ఇచ్చేశాడు. కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లూరులో
దొరికినట్టు కొంతమంది చెబుతున్నారు.
మరికొంత మంది
రాయలసీమ వజ్రాల గనుల్లో దొరకిందని వాదిస్తున్నారు. మొత్తానికి ఇది కాకతీయుల
కాలంలో వెలుగులోనికి వచ్చింది. దీని బరువు 793 కేరెట్స్ (158.6
గ్రాములు). దానిని చాలా కాలంపాటు కాకతీయ రాజులే కాపాడారు. అనంతరం 1310లో
ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ వరంగల్‌ను ముట్టడించి ఆ వజ్రాన్ని
సొంతం చేసుకున్నాడు. అలా అనేకమంది ఢిల్లీ సుల్తానుల చేతులు మారిన ఈ
వజ్రాన్ని 1526లో మొఘల్ చక్రవర్తి బాబర్ దక్కించుకున్నాడు. అతని తదనంతరం ఆ
వంశ రాజు అయిన షాజహాన్ కోహినూర్‌ను తన నెమలి సింహానానికి అలంకరించాడు.
అనంతరం
1739లో మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తిన పర్షియా ప్రభువు నాదిర్ షా దీనిని
వశపర్చుకున్నాడు. ఈయనే ఈ వజ్రానికి ‘కోహ్-ఇ-నూర్ (వెలుగుల కొండ)’ అని
పేరు పెట్టినట్టు తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల అనంతరం నాదిర్ షా హత్యకు
గురయ్యాడు. ఆ సమయంలో ఇది నాదిర్ షా సైన్యంలో కీలకపాత్ర పోషించిన అహ్మద్
షా దుర్రాని చేతుల్లోకి వెళ్లిపోయింది. తర్వాత కాలంలో ఆయన వారుసుడు ఈ
వజ్రాన్ని తన మిత్రుడు అయిన పంజాబ్ మహారాజ్ రంజిత్ సింగ్‌కు బహుమతిగా
ఇచ్చాడు.
ఆయన తన తదనంతరం ఈ వజ్రం పూరీలోని జగన్నాథ
స్వామి ఆలయానికి చెందాలని వీలునామా రాశాడట. ఆయన మరణానంతరం ఆయన కొడుకు
దలీప్ సింగ్ రాజయ్యాడు. అయితే పంజాబ్‌లో ఏర్పడిన అంతర్గత కలహాలను
చక్కదిద్దుతామంటూ రంగ ప్రవేశం చేసిన బ్రిటీష్ ప్రభుత్వం ఈ వజ్రంపై
కన్నేసింది. 1849లో జరిగిన రెండో ఆంగ్లో- సిక్కు యుద్ధంలో పంజాబ్‌ను
ఓడించింది. అప్పుడు వారిద్దరి మధ్య ‘లాహోర్ ఒడంబడిక’ జరిగింది. ఆ
ఒడంబడికలో భాగంగా లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దలీప్ సింగ్ స్వయంగా ఈ
వజ్రాన్ని బ్రిటన్ మహారాణికి బహూకరించాడు. ఇక, అప్పట్నుంచి ఇది భారత్‌కు
తిరగి రాలేదు.
ఫేస్‌బుక్, గూగుల్‌లకు వరద ముప్పు!
లండన్, : సోషల్
నెట్‌వర్కింగ్ దిగ్గజ కంపెనీలు ఫేస్‌బుక్, గూగుల్ గ్లోబల్ వార్మింగ్
ముప్పును ఎదుర్కొంటున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా
సిలికాన్ వ్యాలీలోని ఈ కంపెనీల ప్రధాన కార్యాలయాలు వరద పోటుకు గురయ్యే
ప్రమాదం ఉందని చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రట్టాలు
అంతకంతకూ పెరుగుతుండటమే దీనికి కారణమని శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ ‘ ద
గార్డియన్’ కథనం ప్రచురించింది. మట్టాలు ఇలాగే పెరుగుతూపోతే శాన్
ఫ్రాన్సిస్కో బే ఏరియా పరిధిలోని సిలికాన్ వ్యాలీ సహా అనేక ప్రాంతాల్లోని
చాలా భూభాగం సముద్రంలో కలిసిపోతుందని పేర్కొంది.
పిల్లలున్న తల్లిదండ్రులూ తస్మాత జాగ్రత్త..
సియోల్:
ఇప్పటి పిల్లలకు మాటలు రాకముందే మొబైల్ ఫోన్ వాడటం వచ్చేస్తోంది. రోజూ
గంటలతరబడి ఫోన్ వాడకం సాధారణమైపోయింది. కానీ.. అలాంటి పిల్లలున్న
తల్లిదండ్రులూ తస్మాత జాగ్రత్త అంటున్నారు దక్షిణ కొరియా పరిశోధకులు.
ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోయే పిల్లల్లో మెల్లకన్ను వచ్చే
ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా సరే.. వరుసగా అరగంటకు
మించి పిల్లలను స్మార్ట్‌ఫోన్ చూడనివ్వవద్దని సూచిస్తున్నారు. ఏడేళ్ల
నుంచి 16 ఏళ్ల వయసున్న 12 మంది స్మార్ట్‌ఫోన్ వినియోగపుటలవాటుపై
పరిశోధకులు అధ్యయనం చేశారు. ఆ పిల్లలందరూ రోజుకు 4 నుంచి 8 గంటలపాటు ఫోన్
వాడే అలవాటున్నవారే. అదీ వారు ఫోన్లను తమ కళ్లకు 20-30 సెంటీమీటర్ల దూరంలో
ఉంచి చూస్తారట. ఆ పన్నెండు మందిలో తొమ్మిది మంది మెల్లకన్ను బారిన పడగా..
రెండునెలలపాటు ఫోన్ వినియోగానికి దూరంగా ఉండడంతో కళ్లు సరయ్యాయి. ఈ
నేపథ్యంలో.. తల్లిదండ్రులు పిల్లల ఫోన్ వినియోగం విషయంలో జాగ్రత్తగా
ఉండాలని వారు సూచిస్తున్నారు.
కోరలు చాస్తున్న డ్రాగన్...
- భూ, జల మార్గాల్లో భారత్ అష్టదిగ్బంధానికి యత్నం..
- శ్రీలంక, పాక్, నేపాల్ దేశాల్లో కదలికలు
- కమ్ముకొస్తున్న చైనా.. భూ, జల మార్గాల్లో భారత్ అష్టదిగ్బంధానికి యత్నం
- శ్రీలంక, పాక్, నేపాల్‌లో పాగా.. దక్షిణ చైనా సముద్రంలో అణు మోహరింపు
- అమెరికావైపు భారత్ చూపు.. మసూద్‌పై వీటోకు టిట్ ఫర్ టాట్
చైనా
చేతులు చాస్తోంది. భారత్‌ను అష్ట దిగ్బంధం చేస్తోంది. నేలపై నుంచీ, నీటిలో
నుంచీ భారత్‌పైకి మంటలు చిమ్ముతోంది. భారత శత్రు దేశాలకు తన సహకారం
అందిస్తోంది. భారత మిత్ర దేశాలపైనా కన్నేసి వాటిని తన వైపునకు
తిప్పుకుంటోంది. పసిఫిక్ మహా సముద్రంలో భాగమైన దక్షిణ చైనా సముద్రంలో చైనా
తన ప్రాబల్యాన్ని స్తరించుకుంటోంది. హిందూ మహాసముద్రంపైనా కన్నేసి
భారత్‌ను ఇక్కట్లపాలు చేస్తోంది.
చివరికి భారత వ్యతిరేక ఉగ్రవాదులకు కూడా ఊతమిస్తోంది. ముత్యాల సరం పేరుతో
భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో, సముద్ర జలాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇటీవల పలు పరిణామాలు చాప కింద నీరులాంటి చైనా కదలికల్ని సూచిస్తున్నాయి.
లుక్ అమెరికా..
చైనా
చర్యలు భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో విధిలేని
పరిస్థితుల్లో భారత అమెరికాకు మరింత చేరువగా జరుగుతోంది. భారత-అమెరికా
రక్షణ సహకారం మున్నెన్నడూ లేనంతగా బలపడుతోంది. అమెరికన్ ఎఫ్-16 విమానాలను
భారతలో తయారు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారతతో కలిసి విమానవాహక
యుద్ధనౌకల తయారీకీ అమెరికా సిద్ధపడుతోంది. మన నౌకాదళ, వైమానిక, భూతల
స్థావరాలను అమెరికా వినియోగించుకునేందుకు భారత ఇటీవల అంగీకరించింది. అలీన
దేశంగా ఉన్న భారత ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే దానికి కారణం చైనాయే!
దక్షిణ చైనా సంద్రంలో పాగా
దక్షిణ
చైనా సముద్రం పసిఫిక్ మహా సముద్రంలో ఒక భాగం. ప్రపంచంలో నౌకా
వాణిజ్యానికి ఇది అత్యంత కీలక ప్రాంతం. భారత నౌకా వాణిజ్యంలో సగం దీని
మీదుగానే జరుగుతుంది. ఇక్కడ నీటి అడుగున భారీఎత్తున చమురు, సహజవాయు నిల్వలు
ఉన్నాయి. ఈ ప్రాంతంలోని పలు దీవులు ఎవరివనే విషయంలో చైనా, ఫిలిప్పీన్స్,
తైవాన్, వియత్నాం వంటి దేశాల మధ్య పలు వివాదాలున్నాయి. అలాంటి ఈ సముద్రంలో
చైనా కృత్రిమంగా ఒక దీవిని నిర్మించింది. జబ్బు పడ్డ ఉద్యోగులకు సహాయ
చర్యల పేరిట ఇటీవల తన సైనిక విమానాన్ని ఇక్కడ ల్యాండ్ చేసింది. అంతేకాదు..
అక్కడ తాను ఆక్రమించిన భూముల్లో చేపడుతున్న సైనిక కార్యకలాపాలకు
ఊతమిచ్చేలా తీరం నుంచి అక్కడిదాకా వెళ్లి కావాల్సిన విద్యుత సరఫరా చేసే
మొబైల్ న్యూక్లియర్ పవర్ ప్లాట్‌ఫాంలను రూపొందించే యోచనలో ఉంది.
కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక పీపుల్స్ డైలీ అనుబంధ ప్రచురణ ‘ద
గ్లోబల్ టైమ్స్’ ఈ విషయాన్ని బయటపెట్టింది. కానీ, షరా మామూలుగానే చైనా
సర్కారు మాత్రం అవన్నీ పత్రికల ఊహాగానాలే అని కొట్టిపారేస్తోంది.
మనకు 3 వైపులా.
మహాసముద్రంలో
కీలక నౌకా మార్గాలకు చేరువలో ఎంతో కీలకమైన ప్రదేశంలో శ్రీలంక ఉంది.
శ్రీలంకతో భారతకు అనాదిగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ ఇటీవల శ్రీలంకపై
చైనా కన్నేసింది. శ్రీలంకతో ఆర్థిక సంబంధాలే కాదు, రక్షణ సంబంధాలనూ
పెంచుకుంటోంది. భారత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనా అణు జలాంతర్గాములు
శ్రీలంకను సందర్శించాయి. శ్రీలంకలో యుద్ధ విమానాల నిర్వహణ కేంద్రానికి చైనా
సహాయం అందజేస్తోంది.
పాక్‌కు క్షిపణి పరిజ్ఞానం
పాకిస్థాన్‌తో
చైనాకు ఎప్పటినుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల పాక్, చైనా మధ్య
ఆర్థిక, సైనిక సహకారం బాగా పెరిగింది. పాక్‌కు యుద్ధ విమానాలను, క్షిపణి
పరిజ్ఞానాన్ని చైనా అందజేస్తోంది. అంతేకాదు... భారత్ లో విధ్వంసం
సృష్టిస్తున్న పాక్ ఉగ్రవాదులకూ చైనా అండగా నిలుస్తోంది. గజ ఉగ్రవాది
మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి ద్వారా ‘టెర్రరిస్టు’గా ప్రకటింపజేయాలన్న
భారత ప్రయత్నానికి చైనా ఇటీవల గండికొట్టింది. ఐరాసలో రహస్య వీటో ద్వారా
దానిని అడ్డుకుంది. సీపీఈసీ ప్రాజెక్టు సంగతి చెప్పనే అక్కర్లేదు. చైనాలోని
జిన్‌జియాంగ్ ప్రావిన్స్ నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా
పాకిస్థాన్‌లోని గ్వదర్ రేవు దాకా రూ.3 లక్షల కోట్లతో తలపెట్టిన అభివృద్ధి
ప్రాజెక్టు ఇది. ఈ రేవు ఇరాన్-పాక్ సరిహద్దుల్లో ఉండటం.. దీనికి మరోపక్క
చమురు రవాణాకు కీలక మార్గమైన హెర్ముజ్ జలసంధి కూడా ఉండటం గమనార్హం. ఈ
ప్రాజెక్టు ద్వారా చమురును తక్కువ శ్రమ, ఖర్చుతో రోడ్డు మార్గాన తమ
దేశానికి చేర్చుకోవచ్చన్నది చైనా యోచన.
భారత్- నేపాల్ మధ్య చిచ్చు
శ్రీలంక,
పాకిస్థాన్‌తోనే కాదు.. ప్రపంచంలోనే ఏకైక హిందూ రాజ్యమైన నేపాల్‌తోనూ
సంబంధ బాంధవ్యాలను నెరపడం ద్వారా ఆ దేశంలో తమ పట్టు పెంచుకోవడానికి చైనా
ప్రయత్నిస్తోంది. నిజానికి నేపాల్ భారత్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కల
దేశం. అయితే భారత-నేపాల్‌ల మధ్య కూడా చైనా చిచ్చు పెడుతోంది. నేపాల్‌లో
భారత సంతతి వారైన మాధేసీలకు వ్యతిరేకంగా రాజ్యాంగ రచన జరగడంలో చైనా కీలక
పాత్ర వహించిందనే ఆరోపణలున్నాయి. మాధేసీల డిమాండ్లకు అనుకూలంగా నేపాల్‌పై
భారత అనధికారికంగా ఆంక్షలు విధించినప్పుడు, ఆ ఆంక్షలు నీరుగారిపోయేలా వివిధ
ఉత్పత్తులను చైనా నేపాల్‌కు సరఫరా చేసింది. క్రమేపీ నేపాల్‌పై చైనా పట్టు
బిగుస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ...
హైదరాబాద్ : తెలంగాణ
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్
ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం ఓ లేఖ రాశారు. తెలంగాణ
అభివృద్ధికి పునాదులు వేసింది ఎన్టీఆరేనని, ఎన్టీఆర్ అభినవ అంబేద్కర్ అని
ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్‌కు సముచిత స్థానం ఇవ్వాల్సిన
బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు
ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నకేంద్రం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు
చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు.
Saturday, 23 April 2016
పచ్చిమామిడి కాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు..!
అబ్బా.. సమ్మర్ వచ్చిందంటే.. ఎండ సంగతి ఎలా ఉన్నా.. అందరికీ మామిడిపై
మోజు పెరుగుతుంది. పచ్చిమామిడి చూడగానే.. వావ్ అంటూ నోరూరించేస్తారు.
ఉప్పు, కారం నంజుకుంటూ.. లొట్టలేస్తూ లాంగిస్తేరు. అటు అమ్మలు, అమ్మమ్మలు
పచ్చిమామిడి పచ్చళ్లు పెట్టడంలో బిజీగా ఉండిపోతారు.
నోరూరించే మామిడిపళ్లలో దాగున్న 12 బ్యూటీ సీక్రెట్స్
పసందైన పులుపుతో నోరూరించే పచ్చిమామిడి రుచికరంగానే కాదు.. ఆరోగ్యానికి
ఎంతో మంచిదని స్టడీస్ చెబుతున్నాయి. ఇందులో చాలా పోషకవిలువలు ఉంటాయని
నిపుణులు సూచిస్తున్నారు. దీన్నే గ్రీన్ మ్యాంగో, రా మ్యాంగో అని
పిలుస్తారు. పచ్చిమామిడి కాయ తినడం వల్ల అనేక చర్మ సమస్యలతో పాటు, రకరకాల
ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
సమ్మర్ లో మామిడితో మజా చేయండి..సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి...!
చాలామంది పండుమామిడిపై ఆసక్తి చూపుతారు. అయితే.. ఈ పుల్లపుల్లని
పచ్చిమామిడి తీసుకోవడం కూడా చాలా అవసరమని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.
పచ్చిమామిడి ఆరోగ్యానికి మంచిది అనడానికి అనేక కారణాలున్నాయి. ఇంకా
చెప్పాలంటే.. పండిన మామిడి కంటే.. పచ్చి మామిడి తినడమే ఆరోగ్యకరం
అంటున్నారు. మరి పచ్చిమామిడిలోని పసందైన ఆరోగ్య రహస్యలు తెలుసుకుందామా..
వడదెబ్బ
: పచ్చిమామిడి పవర్ ఫుల్ కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. అలాగే ఫ్లూయిడ్
లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. ఒకవేళ మీలో వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే..
పచ్చిమామిడి తీసుకోండి. లేదా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన ఆమ్ పన్నా తాగండి.
డయాబెటిస్ : డయాబెటిక్ పేషంట్స్ కి పచ్చిమామిడి మంచి ఫ్రూట్. దీన్ని పెరుగు, రైస్ తో తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
బ్లడ్ ప్రెజర్ : పచ్చిమామిడిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే పచ్చిమామిడికాయలు
ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తాయి. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో
ఉంటుంది. అలాగే హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గిస్తుంది.బరువు తగ్గడానికి : పచ్చిమామిడి తినడం వల్ల క్యాలరీలు కరగడానికి సహాయపడుతుంది. పండిన మామిడి కంటే.. పచ్చి మామిడి బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది.
జీర్ణక్రియ : పచ్చిమామిడి కాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కూరల్లో, స్నాక్స్ లో పచ్చిమామిడిని యాడ్ చేసుకుంటే.. పొట్ట సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
ఎసిడిటీ : మీరు ఎసిడిటీతో బాధపడుతుంటే.. పచ్చి మామిడి చక్కటి పరిష్కారం. ఒక ముక్క పచ్చిమామిడిని నములుతూ ఉండటం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది.
వ్యాధినిరోధక వ్యవస్థ
: వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. కాబట్టి.. మీ
డైట్ లో పచ్చిమామిడి చేర్చుకోవడం వల్ల.. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్
అంది వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల రిస్క్ తగ్గిస్తుంది.
కాబట్టి మ్యాంగో చట్నీ, మ్యాంగో రైస్ తీసుకోవడం మంచిది. లివర్ హెల్త్ : కాలేయ సంబంధిత సమస్యలు నివారించడంలో పచ్చిమామిడి పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఒక ముక్క పచ్చిమామిడిని నమలడం వల్ల పేగులను శుభ్రపరిచి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది.
పంటి ఆరోగ్యానికి : పంటి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. కాబట్టి పచ్చి మామిడి తినడం వల్ల చిగుళ్లు బలంగా మారతాయి. అలాగే చిగుళ్ల నుంచి రక్తస్రావాన్ని నివారించి, దుర్వాసనను నివారిస్తుంది.
చర్మానికి : పచ్చిమామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడతాయి. అలాగే ఏజింగ్ లక్షణాలను నివారిస్తాయి. కాబట్టి పచ్చిమామిడి తింటూ ఉండండి.. మీ చర్మాన్ని కాపాడుకోండి.
బ్లడ్ : బ్లడ్ డిజార్డర్స్ నివారించడంలో పచ్చిమామిడి చక్కగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల.. బ్లడ్ వెజెల్స్ ఎలాస్టిసిటీ పెంచుతుంది. కొత్త బ్లడ్ సెల్స్ ఏర్పడటానికి సహాయపడుతుంది.
మార్నింగ్ సిక్ నెస్ : ప్రెగ్నెంట్ మహిళలను వేధించే మార్నింగ్ సిక్ నెస్ నివారించడానికి పచ్చిమామిడి తీసుకోవడం మంచిది.
అధిక చెమట : పచ్చిమామిడి జ్యూస్ తాగడం వల్ల.. అధిక చెమటను నివారించవచ్చు.
Friday, 22 April 2016
ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాల ప్రకారం..ద్వితీయ ఇంటర్‌లో మెరిసింది వీరే...
సీఈసీ
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
ఎంఈసీ
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
హెచ్‌ఈసీ
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
ఆ సీసా 108 ఏళ్లు సముద్రంలో ప్రయాణించింది..!
శివమణి సినిమా బాటిల్‌కు... ఈ బాటిల్‌కు ఆ ఒక్కటే తేడా !
లండన్: మీరు
శివమణి సినిమా చూశారా? అందులో ఓ బాటిల్‌లో సందేశాన్ని ఉంచి హీరోయిన్
సముద్రంలోకి వదులుతుంది. ఇక్కడ కూడా అదే స్టోరీ. కాకపోతే ఆ సందేశాన్ని
రాసింది మెరైన్ బయోలాజికల్ అసోసియేషన్ ప్రతినిధులు.
దాన్ని
108 ఏళ్ల క్రితం అంటే 1906లో బ్రిటన్‌కు చెందిన మెరైన్ బయోలాజియల్
అసోసియేషన్ (ఎమ్‌బీఏ) ప్రతినిధులు సముద్రంలో వదిలారు. అది అలా 108 ఏళ్ల
పాటు సముద్రంపై ప్రయాణించి 2015లో జర్మన్ తీరానికి చేరింది. దాన్ని
మురియన్నే వింక్లర్ అనే మహిళ గుర్తించింది. ఆ బాటిల్ తెరిచి చూసిన ఆమెకు ఓ
పోస్ట్ కార్డు కనిపించింది. ఆ పోస్ట్ కార్డుపై ‘బాటిల్ దొరికిన ప్రాంతం
తదితర వివరాలు నింపి ఎమ్‌బీఏ అడ్రస్‌కు పంపండి’ అనే సూచన ఉంది. ఆ మహిళ ఆ
సూచనను పాటించి అలాగే చేసింది. ఈ విషయం తెలుసుకున్న గిన్నీస్ బుక్ ఆఫ్
రికార్డ్స్ వారు దీనికి ‘బాటిల్‌లో ఎక్కువ కాలం ప్రయాణించిన సందేశం’గా
గుర్తింపునిచ్చారు.
బాబా హుండీలో వజ్రాలు..!
షిర్డీసాయి హుండీలో రూ.85 లక్షల వజ్రాలు
షిర్డీ (మహారాష్ట్ర) : షిర్డీ సాయిబాబా ఆలయంలోని డొనేషన్ల హుండీలో విలువైన వజ్రాలు లభ్యమయ్యాయి. అజ్ఞాత భక్తులు ఎవరో వజ్రాలను ఒక ప్యాకెట్‌లో చుట్టి హుండీలో వేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. సహజంగా ఇంత భారీ విలువల కలిగిన డొనేషన్లను నేరుగా ట్రస్టీలకు అందజేస్తుంటారు. అందుకు భిన్నంగా హుండీలో వజ్రాలు కనిపించడం టెంపుల్ ట్రస్టీలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. వాటి విలువ ఎంతో తెలియకపోవడంతో అధికారులు ముంబై నుంచి ముగ్గురు జ్యువెలరీ డిజైనర్లను రప్పించి ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. వారు ఆ వజ్రాల విలువను లెక్కకట్టి రూ.85 లక్షల వరకూ ఉంటుందని తేల్చారు. మొదట్లో ఈ వజ్రాలను చూసినప్పుడు అంత ఖరీదైనవి కావని అనుకున్నప్పటికీ పరీక్షించి చూశాక అవి విలువైనవని తెలిసినట్టు ప్యానల్ సభ్యులలో ఒకరైన ఆభరణాల వ్యాపారి నరేష్ మెహతా తెలిపారు. వజ్రాల్లో ఒకటి 6.67 క్యారెట్లు (బ్రిలియెంట్ కట్), మరొకటి 2.50 క్యారెట్లు (ఎమరాల్డ్ కట్) కలిగి ఉన్నాయన్నారు. మొత్తంగా వాటి విలువ రూ.85 లక్షల రూపాయలని తెలిపారు. కాగా, ఆ వజ్రాలను ఏం చేయాలనే దానిపై ఆలయ అధికారులు నేరుగా ముంబై హైకోర్టును సంప్రదిస్తున్నారు. షిర్డీ ఆలయంలోని డొనేషన్ బాక్సులను ప్రతిరోజూ లెక్కించి నగదు, నాణేలను ట్రెజరీలో డిపాజిట్ చేస్తుంటారు.
మన దేశంలోనూ రోబో కార్మికులు...
రంగంలోకి ముందుకొస్తున్న అంకుర పరిశ్రమలు
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేదోడు
వెల్డింగ్ చేయడం ప్రమాదంతో కూడుకున్నదని, గ్యాస్ వాసన భరించలేకపోతున్నామంటుంటారు సంబంధిత కార్మికులు. కంట్లో నిప్పురవ్వలు పడతాయన్న భయమూ ఉంటుంది. మార్కెట్‌లో వెల్డింగ్ పనులు చేసే సుశిక్షుతులైన మానవ వనరులు అందుబాటులో లేవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం లభించనుంది. చిన్నచిన్న వెల్డింగ్ పనుల్ని రోబోలు నిర్వహించనున్నాయి. ఇప్పటి వరకు విదేశాలకే పరిమితమైన ఆటోమేషన్ త్వరలో మన దేశంలోనూ విస్తరించనుంది.
షాపింగ్ మాల్‌లో సబ్బులు, ఇతర వస్తువులను ఒక క్రమపద్ధతిలో పెట్టాలా? ఈ పనికి భవిష్యత్తులో మానవ వనరుల అవసరం ఇక ఉండదు. కౌంటర్‌లో యజమాని సీట్లో కూర్చుని ఇచ్చే ఆదేశాలతో ఆయా పనులన్నీ జరిగిపోనున్నాయి. దేశీయంగా తక్కువ ధరలకే రోబోలను ఉత్పత్తి చేసేందుకు ప్రఖ్యాత సంస్థలు నిమగ్నమయ్యాయి. భవిష్యత్తు తరమంతా రోబోలమయం కానుంది.
* గృహాల్లో ఇళ్లు శుభ్రం చేయడం, వస్తువులను అందించడం వంటి చిన్న చిన్న పనులు చేసేందుకు రోబోలు అందుబాటులోకి వచ్చాయి.
* సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో మనుషులు చేసే పనుల్ని రోబోలే పూర్తిచేస్తాయి.
* ప్రస్తుతం సూక్ష్మ పరిశ్రమల్లో బోల్టులు బిగించడం, వెల్డింగ్ చేయడం, బరువులు ఎత్తడం, ఒక క్రమపద్ధతిలో పేర్చడం లాంటి పనులు చేసే రోబోలులు వచ్చాయి.
* రోబోలు చేసే పనుల్లో లోపాలు ఉండవు. కంప్యూటర్‌లో రాసిన ప్రోగ్రామ్ ఆధారంగా రోబోలు పనిచేస్తుంటాయి. దీంతో తయారీరంగంలో లోపాలు ఉండవు.
* వైద్యరంగంలో కొన్ని కీలకమైన ఆపరేషన్లు రోబోల ద్వారానే జరుగుతున్నాయి. భవిష్యత్తులో వీటి వినియోగం మరింత పెరుగుతుంది.
* రక్షణ రంగ అవసరాల కోసం మానవ రహిత విమానాలు, ట్యాంకులు రోబోల సహాయంతో యుద్ధాలు చేయడం లాంటి ఆలోచనలున్నాయి. ఇప్పటికే డీఆర్‌డీవో ఈ దిశగా పరిశోధనలు మొదలుపెట్టింది. అమెరికా లాంటి దేశాలు రోబోలను రక్షణ, భద్రత విభాగాల్లో ప్రవేశపెట్టాయి.
* సగానికి తగ్గనున్న మానవ వినియోగం
* చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో రోబోలు సేవలందిస్తే రానున్న 30 ఏళ్లలో ప్రస్తుతమున్న మానవ వనరుల వినియోగం సగానికి పైగా తగ్గిపోతుందని అంచనా. గోదాముల్లో ఇప్పటికే రోబోలు పనిచేస్తున్నాయి. అమెజాన్ లాంటి సంస్థలు రోబోల సహాయంతో వస్తువుల్ని ఒకచోట నుంచి మరోచోటకు తరలిస్తున్నాయి.
రోబో
గార్డ్స్..
చేతిలో డబ్బు ఉందంటే.. చుట్టూ నలుగురు మనుషులు.. విలాసవంతమైన కార్లు కామనే. షాపింగ్ చేసినా.. ఎక్కడికెళ్లినా ఏ కష్టం లేకుండా చుట్టూ ఉన్న వారే చూసుకుంటారు. అయితే.. చైనాలోని ఓ కోటీశ్వరుడు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాడు. అందరిలా కాకుండా రొటీన్‌కు భిన్నంగా ఉండాలనుకున్నాడో ఏమో కానీ.. చుట్టూ నలుగురు మనుషులను కాకుండా ఎనిమిది రోబోలను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇంతకీ.. ఆ రోబోలు ఎందుకు అనుకుంటున్నారా? కేవలం అతను షాపింగ్ చేసిన వస్తువులను మోసుకెళ్లడానికేనట. వినడానికి విచిత్రంగా ఉన్నా.. రోబోలతో షాపింగ్ చేస్తూ అందరినీ విస్మయపరుస్తున్నాడు.ఇటీవలే రోబోలతో కలిసి బంగారు ఆభరణాలు కొనడానికి వెళ్లిన అతగాడిని చూసి.. జువెలరీ షాప్ సిబ్బంది ఆశ్చర్యపోయారట. అమ్మాయిల దుస్తుల్లో ఉన్న ఆ రోబోలు.. అతను కొన్న వస్తువులను తీసుకొని నడిచి వెళుతుంటే అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టి చూశారట.
చైనాలో షాపింగ్ మాల్స్.. రెస్టారెంట్లు ఇలా ఎక్కడ చూసినా హ్యూమనాయిడ్ రోబోలే కనిపిస్తున్నాయి. కానీ.. ఇలా ఓ వ్యక్తికి సాయం చేయడానికే 8 రోబోలు పనిచేయడాన్ని మాత్రం విచిత్రంగా ఉంది.
Subscribe to:
Posts (Atom)



























