ప్రభాస్ కోరిక తీరేదెప్పుడు?
'బాహుబలి' సినిమాతో హీరోగా ప్రపంచ ఖ్యాతి వచ్చింది ప్రభాస్‌కి. కెరీర్‌కి
సరిపడా సినిమా చేసేశాడు ప్రభాస్. కానీ ఎప్పటికీ 'బాహుబలి'నే స్మరించుకుంటూ
కూర్చోలేడు కదా ! కొంచెం కొత్త గెటప్‌లో కనిపించాలనీ, ఇదివరకటిలా అమ్మాయిల
మనసు దోచుకునే మిస్టర్ ఫర్‌ఫెక్ట్ గెటప్‌లో ఎప్పటికి కనిపిస్తానా? అని
కొంచెం బాధపడుతున్నాడట రెబల్ స్టార్. కానీ ఇంతగా స్టార్‌డమ్ వచ్చేసిన
తరువాత ప్రభాస్ ఒక రేంజ్ సినిమాలనే చేయాలి. ఒక మాదిరి కథలను ఓకే
చెయ్యాలంటే చాలా దూరం ఆలోచించాల్సి వస్తుంది.
ప్రస్తుతానికి 'బాహుబలి' ఇచ్చే కిక్ బాగానే ఉంది. కానీ ఎప్పటికీ 'బాహుబలి'
ప్రభాస్‌గానే ఉండిపోవాలా? కత్తి యుద్ధాలు, రాజు గెటప్‌లతో బోర్
కొట్టేసిందంటున్నాడు. హాయిగా కాలేజ్ బాయ్‌గా అమ్మాయిలకు సైట్ కొట్టుకునే
లవర్ బాయ్‌లాగా కనిపించేదెప్పుడా? అని ఎదురు చూస్తున్నాడట మన టాలీవుడ్
కండలవీరుడు ప్రభాస్. దాదాపుగా మూడు, నాలుగేళ్లుగా తన టైం అంతా ఒకే సినిమా
కోసం కేటాయించిన ప్రభాస్ కొత్తదనం కోరుకుంటున్నాడట. కానీ తన కోరిక
తీరాలంటే ఇంకొంతకాలం వేచి చూడక తప్పదంటున్నారు 'బాహుబలి' టీం.
ప్రస్తుతానికి 'బాహుబలి ది కన్‌క్లూజన్' షూటింగ్ కోసం మళ్లీ కసరత్తుల్లో
మునిగిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
'బాహుబలి' సినిమాతో హీరోగా ప్రపంచ ఖ్యాతి వచ్చింది ప్రభాస్‌కి. కెరీర్‌కి
సరిపడా సినిమా చేసేశాడు ప్రభాస్. కానీ ఎప్పటికీ 'బాహుబలి'నే స్మరించుకుంటూ
కూర్చోలేడు కదా ! కొంచెం కొత్త గెటప్‌లో కనిపించాలనీ, ఇదివరకటిలా అమ్మాయిల
మనసు దోచుకునే మిస్టర్ ఫర్‌ఫెక్ట్ గెటప్‌లో ఎప్పటికి కనిపిస్తానా? అని
కొంచెం బాధపడుతున్నాడట రెబల్ స్టార్. కానీ ఇంతగా స్టార్‌డమ్ వచ్చేసిన
తరువాత ప్రభాస్ ఒక రేంజ్ సినిమాలనే చేయాలి. ఒక మాదిరి కథలను ఓకే
చెయ్యాలంటే చాలా దూరం ఆలోచించాల్సి వస్తుంది.
No comments:
Post a Comment