ఇదేదో హారర్ సినిమా
పేరనుకుంటే పప్పులో కాలేసినట్టే! చెన్నైలో వాస్తవంగా జరిగిందని
చెప్పుకుంటున్న సంఘటన. వివరాల్లోకి వెలితే... నయనతార చెన్నైలో ఓ అపార్ట్
మెంట్‌లో ఉంటోంది. మొన్నీమధ్య అర్థరాత్రి సమయంలో ఆమె ఫ్లాట్‌లోకి ఓ వ్యక్తి
ప్రవే శించాడు. అతగాడిని చూసి నయనతార కేకలు వేసింది. దాంతో అతడు
పారిపోయాడు. ఇదీ కథ. ఇంత పక్కాగా అల్లిన కథలో చిన్న ట్విస్ట్ట్ ఏమిటంటే...
గత కొన్ని రోజులుగా నయనతార చెన్నైలో ఉండడంలేదు. తెలుగు సినిమా షూటింగ్
కోసం హైదరాబాద్‌లో ఉంటోందట! నయనతార ఇక్కడ ఉంటే ఆ వ్యక్తి అపార్ట్
మెంట్‌లోకి ఎలా ప్రవేశించాడు? ఇక్కడున్న నయనతార అక్కడ ఎలా అరవగలిగింది? ఈ
ప్రశ్నలన్నీ ఇలా ఉంటే...అర్థరాత్రి ఓ వ్యక్తి ఫ్లాట్‌లోకి ప్రవేశించాడన్న
విషయం మీద ఇప్పటి వరకూ ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెన్నై
పోలీసులు చెబుతున్నారు. ఈ గజిబిజి మీద నయనతార నోరు విప్పితే తప్ప అసలు
విషయాలు బయటికి రావు అంటున్నారు తమిళ తంబిలు.

No comments:
Post a Comment