సాయిధరమ్‌తేజ్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సుప్రీమ్’. ఈ చిత్రం
ఆడియో విడుదల వేడుకను ఏప్రిల్ 14న నిర్వహించనున్నట్లు కథానాయకుడు
సాయిధరమ్‌తేజ్ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా
అభిమానులతో సరికొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ వేసవిలో చిత్రాన్ని
ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు పోస్టర్లో పేర్కొన్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి కిషన్, సాయి కుమార్, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్ రెడ్డి తదితరులు చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
No comments:
Post a Comment