హైదరాబాద్ : తెలంగాణలో
టెట్, ఎంసెంట్ వాయిదా పడ్డాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం
నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్‌కు అనుగుణంగా మే1న టెట్, మే2న ఎంసెట్
జరగాల్సి ఉంది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పోలీసుల తనిఖీలకు నిరసనగా బంద్
నిర్వహిస్తున్న ప్రైవేటు కాలేజీల జేఏసీ.. ఈ పరీక్షలకు కేంద్రాలను
ఇచ్చేదిలేదని స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ
పరీక్షలను మే20వ తేదీలోపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఉపముఖ్యమంత్రి
కడియం శ్రీహరిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రైవేటు కాలేజీల సహాయనిరాకరణ
నేపథ్యంలో పరీక్షలను పూర్తిగా ప్రభుత్వ కాలేజీల్లో, ప్రభుత్వ ఉద్యోగులతో
నిర్వహించాలని ఆదేశించారు. ప్రైవేటు కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి
తీరుతామని స్పష్టం చేశారు. ఇదిలావుండగా.. అంతకుముందు ప్రైవేటు విద్యాసంస్థల
జేఏసీ ప్రతినిధులు జి రమణారెడ్డి, విజయభాస్కర్, సిద్ధేశ్వర్, రాందా్‌సతో
కడియం చర్చలు జరిపారు. విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీ అంశాన్ని సీఎం
దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. పూర్తిస్థాయి హామీ
లభించలేదని, అందుకే టెట్, ఎంసెట్‌కు పరీక్ష కేంద్రాలను ఇచ్చేదిలేదని భేటీ
అనంతరం జేఏసీ ప్రతినిధులు విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

No comments:
Post a Comment