Saturday, 16 April 2016

బీచ్‌లో నడుస్తుంటే...

కోటి రూపాయల రాయి దొరికింది!

         మీరు విన్నది నిజమే. అది సాదాసీదా రాయి కాదు. ప్రపంచంలోనే అత్యంత విలువైన స్పెర్మ్ ఆయిల్‌ను ఉత్పత్తి చేసే స్పెర్మ్ తిమిగళం నుంచి తయారైనది. ఇలాంటి రాళ్లు అసాధారణంగా దొరుకుతాయి. వీటిని పర్‌ఫ్యూమ్ ఇండస్ట్రీలో ఉప యోగిస్తారు.

 

గారీ, ఏంజెలా విలియమ్స్ అనే బ్రిటన్ దంపతులు లాంక్షైర్‌లోని మిడిల్టన్ స్యాండ్స్ బీచ్‌లో గత ఆదివారం విహారానికి వెళ్లారు. చల్లగాలిని ఆస్వాదిస్తూ బీచ్‌లో నడుస్తున్న ఆ దంపతులకు మైనంలా ఉండే ఓ వింత రాయి కనిపించింది. దాని దగ్గరికి వెలితే కుళ్లిపోయిన చేపల వాసన వచ్చింది. దాన్ని ముట్టుకుని చూస్తే అదొక హార్డ్ రబ్బర్ బాల్‌లా అనిపించింది. అంతేకాకుండా చేతులకు మైనం అంటుకున్నట్టు అనిపించిందట.
అంబర్గిస్ అనే ఈ పదార్థం స్పెర్మ్ తిమింగళాల నుంచి ఉత్పత్తి అవుతుంది. స్పెర్మ్ తిమింగళాలకు అజీర్తిగా అనిపించినప్పుడు కానీ, గొంతు సమస్య వచ్చినప్పుడు కాని.. ఓ వికృత పదార్థాన్ని ఉమ్మేస్తాయట. ఆ పదార్థం అలా చాలా సంవత్సరాల తరబడి సముద్రంలో ఉండడం వల్ల బాగా గట్టిపడి అంబర్గిస్‌గా మారుతుందట. అలల కారణంగా తీరానికి కొట్టుకొస్తుంటాయి.


సరదాగా బీచ్‌కు వెలితే ఇంత భారీ విలువ కలిగిన రాయి దొరకడంతో గారీ, ఏంజెలా తెగ సంబరపడిపోతున్నారు. ఫ్రాన్స్‌, న్యూజిలాండ్ దేశాలకు చెందిన కొనుగోలుదారులతో బేరాలు మాట్లాడుతున్నారు. 2103లో కూడా ఇలాంటి రాయికి దాదాపు లక్షా 20 వేల(సుమారు కోటీ 20 లక్షల రూపాయలు) పౌండ్లు పలికాయట. మీరు కూడా ఎప్పుడైనా బీచ్‌లో నడిస్తే... పక్కన కనిపించే రాళ్లపై ఓ లుక్కేయండి. ఏమో మీ అదృష్టం బాగుంటే కోటి రూపాయల రాయి మీకు దొరుకుతుందేమో!!.

No comments:

Post a Comment