రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ తనిఖీలు
- అక్రమాల కళాశాలలకు గుర్తింపు రద్దు
- విద్యార్థులకు నష్టం లేకుండా చర్యలు: సీఎం
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు బోగస్ కాలేజీల ఖాతాల్లో చేరుతున్నాయని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాటి గుర్తింపు రద్దు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గుర్తింపు రద్దయిన కళాశాలల్లోని విద్యార్థులకు ఎలాంటి నష్టం కలుగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని, వారిని వేరే కళాశాలల్లో చేర్పిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల స్థితిగతులపై గురువారం సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణవ్యాప్తంగా కాలేజీల్లో తనిఖీలు చేయడానికి విచారణ బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఏది బోగస్... ఏది అసలు కాలేజీయో నిర్ధారించాలన్నారు. విద్యార్థులు ఇంజనీర్లు, డాక్టర్లుగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తమ ప్రభుత్వ అభిమతం అన్నారు. దీని కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితాలు విద్యార్థులకు చేరడం లేదని విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిధులను విద్యాసంస్థలు కాజేస్తున్నాయని, దీంతో ఆశించిన ప్రయోజనాలు రావడంలేదని అభిప్రాయపడ్డారు. అనేక విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు పూర్తిస్థాయి ప్రమాణాలతో విద్యను అందించడానికి వీలుగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. విద్యాసంవత్స రం ప్రారంభంలోగా ఆయా విద్యాసంస్థలను నిశితంగా పరిశీలించాలని, విజిలెన్స బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడ్డారని తేలితే గుర్తింపును రద్దు చేస్తామని ప్రకటించారు.
ఒకే విడతలో ఫీజు బకాయిల విడుదల
2014-15తోపాటు 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలను ఏకకాలంలో తీర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు రూ. 3,061 కోట్లు కావాలని అధికారులు తెలుపగా, ఆ నిధులను ఒకే విడతలో విడుదల చేయాలని ఆర్థి క శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి కడి యం శ్రీహరి, మంత్రులు ఈటల, జి.జగదీశ్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివే ది, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, పాఠశాల విద్య డైరెక్టర్ జి.కిషన్, పాల్గొన్నారు.
No comments:
Post a Comment