ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
శ్రీదుర్మిఖి నామ సంవత్సరం శుక్రవారం
ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం రాజభవన్ లో ఉగాది వేడుకలు
ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఏపీ ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్
ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలను చిగురింపజేసే ఈ పండుగను ఆనందంగా
జరుపుకోవాలని ఆకాంక్షించారు. దుర్ముఖి నామ సంవత్సరంలో ప్రజలు శాంతి,
సౌభ్రాతృత్వం, సామరస్యంతో జీవనం సాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వేడుకల్లో భాగంగా గవర్నర్ నరసింహన్ తేనేటి విందు ఇచ్చారు.ఈ విందుకు తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరయ్యారు.
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉగాది శుభాకాంక్షలు
తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం
ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు అందాలని,
వాటితో రాష్ట్రం సుభిక్షం కావాలని పేర్కొన్నారు. అలాగే కేంద్రమంత్రి బండారు
దత్తాత్రేయ, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, మంత్రులు, చిరంజీవి
దంపతులు, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల మండలి
చైర్మన్లు, అలాగే డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment