మెక్సికన్ సిటీ:
ఓ మహిళా పోలీస్ అధికారిణి అత్యుత్సాహంతో చేసిన పని ఆమె ఉద్యోగానికి ఎసరు
పెట్టింది. పెట్రోలింగ్ చేస్తూ టాప్‌లెస్‌గా ఇచ్చిన ఓ ఫోజు ఆమెను ఇంటికి
పంపించింది.
మెక్సికోలోని ఎస్కొబెడో అనే
ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న నిదియా గార్సియా అనే పోలీస్
అధికారిణి.. పెట్రోలింగ్ జీపులోనే టాప్‌లెస్‌గా ఫోటో దిగింది. యూనిఫామ్
షర్టును కిందకు జరిపి వక్షోజాలు కనిపించేటట్టు ఆమె ఫోటో దిగింది. అక్కడితో
ఊరుకోకుండా ఆ ఫోటోను తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఓ పోలీస్
అధికారిణి ఇలా టాప్‌లెస్‌గా ఫోజివ్వడంతో అది సోషల్ మీడియాలో హాట్
టాపిక్‌గా మారింది.
ఈ విషయం అలా ఉన్నతాధికారుల వరకూ
వెళ్లింది. యూనిఫామ్‌లో ఉండడమే కాకుండా, పక్కనే ఆయుధాన్ని ఉంచుకుని ఇలాంటి
ఫోటో దిగిన నిదియాపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. అప్పటి వరకు
విధులకు దూరంగా ఉండాలని ఆమెకు సూచించారు. కాగా, నిదియా ఇప్పటికే ఇద్దరు
పిల్లల తల్లి.

No comments:
Post a Comment