సౌదీలో భారీ అగ్ని ప్రమాదం..9మంది భారతీయులు మృతి
సౌదీ అరేబియా : సౌదీలో
భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తం 12 మంది చనిపోగా అందులో 9 మంది
భారతీయులు ఉన్నారు. మిగతా ముగ్గురు ఫిలిప్పేన్స్ దేశస్థులు. మరణించిన
ఇండియన్స్‌లో 7గురు కర్ణాటక, ఇద్దరు కేరళ రాష్ట్రాలకు చెందినవారు. తూర్పు
సౌదీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో కొన్ని పరికరాలు మార్చుతుండగా ఈ ప్రమాదం
జరిగింది. ఈ ఘటనలో 11మందికి పైగా గాయపగా, చికిత్స పొందుతున్నవారిలో ఆరుగిరి
పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో దట్టంగా పొగలు రావడంతో చాలా మందికి
అక్కడికక్కడే ప్రాణం పోయినంత పనైంది. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే
ఉందని సౌదీ దేశ అధికార ప్రతినిధి ప్రకటించారు.
No comments:
Post a Comment