Wednesday, 13 April 2016

భారత్‌లో వాట్సప్ ‘బంద్’ కానుందా?

న్యూఢిల్లీ: ప్రముఖ మెసెంజర్ యాప్ అయిన వాట్పప్ భారత్‌లో బంద్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇటీవలే ‘ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్’ అనే కొత్త ఫీచర్‌తో వినియోగదారులకు మరింత దగ్గరైన వాట్సప్‌పై ట్రాయ్ నిషేధం విధించే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ కొత్త ఫీచర్ టెలికాం నిబంధనలకు అనుగుణంగా లేదట.
 
ఇండియాలో ఆన్‌లైన్ సర్వీసుల్లో 40-బిట్ ఎన్‌క్రిప్షన్‌ను మాత్రమే వాడాలనే నిబంధన ఉంది. అంతకు మించి ఎన్‌క్రిప్షన్‌ వాడాలంటే భారత టెలికాం నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాట్సప్ వాడుతున్న 256-బిట్ ఎన్‌క్రిప్షన్‌ ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది. అంతేకాకుండా ఈ ఎన్‌క్రిప్షన్‌‌కి సంబంధించిన కీ కూడా వాట్సప్ దగ్గర లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కీ ఉంటేనే భారత టెలీకాం నుంచి ప్రత్యేక అనుమతి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో వాట్సప్ మనుగడపై సందిగ్ధత నెలకొంది.
 
తాము ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ద్వారా యాప్‌లోని డేటాను ఎవరూ హ్యాక్ చేయడానికి వీలులేదని, కేవలం సెండర్, రిసీవర్‌కు మాత్రమే ఆ మెసేజ్‌లు కనిపిస్తాయని వాట్సప్ చెబుతోంది. ఈ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత డేటా పూర్తి భద్రంగా ఉంటుందని వాట్సప్ స్పష్టం చేస్తోంది.
 
భారత టెలీకాం నిబంధనలకు విరుద్ధంగ వాట్సాప్ ప్రవేశపెట్టిన 256-బిట్ ఎన్‌క్రిప్షన్‌‌పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చూద్దాం... భారత్‌లో వాట్సప్‌ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో....

No comments:

Post a Comment