సిటీ
బస్సుల్లో ఉచిత వైఫై
హైదరాబాద్:
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు
తెలంగాణ ఆర్టీసీ వినూత్న పథకం
చేపట్టింది. సిటీ బస్సుల్లో
ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని
నిర్ణయించింది. ఏసీ, మెట్రో
డీలక్స్ బస్సుల్లో ఈ సదుపాయం
కల్పించనున్నట్లు ఆర్టీసీ
ఈడీ పురుషోత్తం తెలిపారు. ప్రయాణికులకు
తొలి 30 నిమిషాలు ఈ సదుపాయాన్ని
ఉచితంగా అందించనున్నారు.
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం
బస్సుల బాడీల మార్పు దశల వారీగా
చేపట్టనున్నట్లు ఈడీ తెలిపారు.
ఈ ఏడాది 300 బస్సులు, వచ్చే ఏడాది
350 బస్సుల బాడీలను మార్చనున్నట్లు
తెలిపారు. 2015-16లో గ్రేటర్ హైదరాబాద్
జోన్‌లో ఆర్టీసీకి రూ.289 కోట్ల
నష్టం వచ్చినట్లు తెలిపారు.
ప్రయాణికులకు ఆకట్టుకుని నష్టాల
వూబి నుంచి గట్టెక్కేందుకు
చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు
No comments:
Post a Comment