అత్యాచారాలు, వేధింపులను తగ్గించేందుకేనట...!
అమ్మాయిలు స్కర్టులు వేసుకోవద్దు.. అధికారుల కొత్త రూల్

చంఢీఘడ్ :
‘మిడ్డీలు, చెడ్డీలు వేసుకుంటే రేప్‌లు చేసేస్తారా.. మగాళ్ల మైండ్‌సెట్
మారాలి’... ఇది ఓ సినిమాలోని హీరో డైలాగ్... మగాళ్ల మైండ్‌సెట్‌ను
మార్చలేమనుకున్నారో ఏమోగానీ చంఢీఘడ్ పోలీసులు ఓ కొత్త రూల్‌ను
తీసుకొచ్చారు. అమ్మాయిలు స్కర్టులు వేసుకుని డిస్కోలకు వెళ్లకూడదని ఆదేశాలు
జారీ చేశారు. మహిళా వేధింపులు, అత్యాచారాలు, కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఈ
నిబంధనను పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. మహిళలు ఇది గుర్తించి
స్కర్టులు వేసుకోవడం మానేయాలని సూచించారు. పబ్‌లు, డిస్కోలు వంటి స్టార్
హోటళ్లపై నియంత్రణ చర్యల పేరిట విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈ విధమైన
నిబంధనను పేర్కొన్నారు. పబ్స్‌లోకి స్కర్టుల వంటి కురచ దుస్తులతో
అమ్మాయిలను అనుమతిస్తే వాటి అనుమతులు రద్దు చేస్తామని అధికారులు
హెచ్చరించారు. అయితే ఈ నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, బార్
ఓనర్స్ అసోషియేషన్స్ మండిపడుతున్నాయి. తమ హక్కులకు భంగం కలిగించడమేమింటంటూ
స్త్రీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు స్కర్టులు వేసి యాడ్స్
చేయడాన్ని నిషేధించారు. అటువంటి ప్రకటనలు ప్రచారం చేస్తే చర్యలు
తీసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.
No comments:
Post a Comment