కేరళలోని పుట్టింగల్ దేవాలయం వద్ద రక్షణ చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆ
రాష్ట్రంలో పుట్టింగల్ దేవి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న
సంగతి తెలిసిందే. ఈ ఆలయం వద్ద ఈ తెల్లవారు జామున సంభవించిన ఘోర
అగ్నిప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని
నరేంద్రమోడీ ఆదేశాల మేరకు పలు పలు సంస్థలు రక్షణ చర్యల్లో
పాలుపంచుకుంటున్నాయి. కేరళ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన సమాచారం
అందించేందుకు సమాచార కేంద్రాలను ఏర్పాటుచేసింది.


No comments:
Post a Comment