డీఎన్‌ఏ ద్వారా ఆ విషయాలు కూడా తెలుసుకోవచ్చట!
ఓ వ్యక్తికి
సంబంధించిన ఎన్నో విషయాలను డీఎన్‌ఏ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే
యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు ఇటీవల కొత్త
విషయాన్నికనిపెట్టారు. ఓ వ్యక్తి ఏ వయసులో తొలిసారి శృంగారంలో పాల్గొంటాడు
అనే విషయం కూడా డీఎన్‌ఏ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చట. ఒక్క శృంగారం గురించే
కాదు సిగరెట్ స్మోకింగ్, మద్యం తీసుకోవడం గురించి కూడా డీఎన్‌ఏ
చెప్పేస్తుందట.
మానవ జన్యువులో 38 ప్రత్యేకమైన
ప్రాంతాల్లో తేడాలను బట్టి ఈ విషయం కనుగొనవచ్చని వారు వెల్లడించారు.
ఇందుకోసం వారు 1.25 లక్షల మందిపై ప్రయోగాలు చేశారు. జన్యువులోని ఈ సారూప్యత
ఉన్నవారిలో దాదాపు 49 శాతం మంది 15 నుంచి 18 సంవత్సరాల మధ్య తొలిసారి
శృంగారంలో పాల్గొన్నామని తెలిపారట. అలాగే ఈ సారూప్యతలున్నవారిలో 33 శాతం
మందికి స్మోకింగ్ అలవాటు ఉందట.
No comments:
Post a Comment