Sunday, 24 April 2016

క్యాన్సర్‌తో రోజూ 50మంది చిన్నారుల మృతి

న్యూదిల్లీ: భారత్‌లో నిత్యం 50 మంది చిన్నారులు క్యాన్సర్‌ కారణంగా అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. వీరంతా 14ఏళ్లలోపు వయస్సు వారే. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం బయటపడింది. వ్యాధి నిర్ధారణ కష్టం కావడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది.
           ఈ సర్వే వివరాలను ది జర్నల్‌ఆఫ్‌ గ్లోబల్‌ ఆంకాలజీలో ప్రచురించారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే భారత్‌లాంటి దేశాల్లో క్యాన్సర్‌ పై అవగాహన లేకపోవడం.. సరైన సమాచారం అందుబాటులో ఉండకపోవడం.. వీటిని ఎదుర్కొనడానికి ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో సరైన వ్యూహాలు అమలు చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ క్యాన్సర్‌ బారిన పడిన దాదాపు 80శాతం మంది చిన్నారులు చికిత్సతో ఈ మహమ్మారి నుంచి బయటపడుతున్నారు. భారత్‌లో ఒక్క ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం క్యాన్సర్‌ పేషంట్లకు ఉచిత చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించింది. యూనివర్శిటీ ఆఫ్‌ టొరంటో, ముంబయి విశ్వవిద్యాలయం, టాటా మెమోరియల్‌ సెంటర్‌ తదితర అంతర్జాతీయ సంస్థలు ఈ సర్వేను నిర్వహించాయి. దీనిని బట్టి భారత దేశంలో నిత్యం ప్రతి పదిలక్షల మందిలో 37మంది పీడియాట్రిక్‌ క్యాన్సర్‌ కారణంగా మృతి చెందుతున్నారు.

No comments:

Post a Comment