- పిల్లలకు ప్రాణాంతకం హిమోఫీలియా
- ప్రతి పది వేల మందిలో ఒకరు
- బాధితుల్లో అబ్బాయిలే ఎక్కువ
- నేడు వరల్డ్ హిమోఫీలియా డే
హైదరాబాద్ సిటీ: ఎక్కడైనా
దెబ్బ తగిలితే వెంటనే రక్తం కారుతుంది. కారుతున్న రక్తం కొద్దిసేపటికి
గడ్డ కట్టి ఆగిపోతుంది. ఈ తరహా చాలా మందిలో కనిపిస్తోంది. కానీ కొందరిలో
రక్తం నిరంతరం కారుతునేఉంటుంది. కొందరిలో రక్తనా ళాలు చిట్లి కూడా రక్త
స్రావం అవుతునే ఉంటుంది. ఎక్కడైనా రక్తం గడ్డ కట్టకపోతే ఆ గాయం మానదు. ఇది
ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టినా ! లేక గాయం
వల్ల బయటకు వచ్చినప్పుడు దారాళంగా కారుతుంటే అది మనిషి మనుగడకే ముప్పు.
ఇలాంటి వారిని హిమోఫీలియో వ్యాధిగ్రస్తులు గా వైద్యులు పరిగణిస్తారు. ఈ
వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది
ఏప్రిల్17న వరల్డ్ హిమోఫీలి యో డే నిర్వహిస్తోంది.
పదివేల మందిలో ఒకరికి
హిమోఫీలియోతో బాధపడే వారు ప్రతి పదివేల మందిలో ఒకరు ఉంటారని వైద్యులు తెలిపారు. ఇదిచిన్నప్పటి నుంచే మొదల వుతుందని, సరైన చికిత్సలేకపోతే ప్రాణాపాయంగా మారుతోంది.
హిమోఫీలియోతో బాధపడే వారు ప్రతి పదివేల మందిలో ఒకరు ఉంటారని వైద్యులు తెలిపారు. ఇదిచిన్నప్పటి నుంచే మొదల వుతుందని, సరైన చికిత్సలేకపోతే ప్రాణాపాయంగా మారుతోంది.
తల్లిదండ్రులకు ఉంటే
జబ్బు తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులుపేర్కొంటున్నారు.తండ్రికుంటే కచ్చితంగా కొడుకుకు, రక్తసంబంధీకులను పెళ్లి చేసుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.
జబ్బు తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులుపేర్కొంటున్నారు.తండ్రికుంటే కచ్చితంగా కొడుకుకు, రక్తసంబంధీకులను పెళ్లి చేసుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.
రక్త నాళాలు చిట్లితే...
కొందరిలో కొన్నిసార్లు రక్తనాళాలు చిట్లిశరీరంలో రక్తం కారుతోంది. శరీరం లోపలి భాగాల్లోని కీళ్లల్లో సన్నని రక్తనాలలు చిట్లినప్పుడు ఈ వ్యాధిగ్రస్తులకు రక్తం గడ్డకట్టదు. ఇలా ఉంటే చాలాప్రమాదం. వారికి ఆర్థరైటిస్ జబ్బొచ్చే ప్రమాదం ఉంది.

ఇలా ఉంటే...
పగిలిన పెదవులు, చిగుళ్లు, పండ్ల సందుల నుంచి నిరంతరం రక్తం కారుతుంటే అది హిమోఫీలియాగా అనుమానించాలి. శరీరంపై చిన్నగా గీరుకుపోయి గాయమైతే రక్తం ఆగకుండా కారుతోంటే అది తప్పకుండా హిమోఫీలియాగా భావించాలి. కొందరిలో నిరంతరం కండరాల నొప్పులుంటాయని, వైద్యపరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోవాలని సూచించారు.

హిమోఫీలియాకు పూర్తి
చికిత్స లేదు. అయితే సాధారణ జీవనం గడుపడానికి కొంత మేరకు వైద్యం
అందించేందుకు అవకాశముంది. జాయింట్లు, కండరాలకు ఎలాంటి నష్టం కలగకుండా
ఉండడానికి వీరికి వారానికి రెండు సార్లు ప్రొపిలాక్టిక్ ఫాక్టర్
రీప్లెస్‌మెంట్ థెరపీ చికిత్సలు అందించడానికి అవకాశముంది. హిమోఫీలియాను
చిన్నతనంలోనే గుర్తించాలి, లేని పక్షంలో అది తీవ్రమయ్యే ప్రమాదముంది.
బాధితులు ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.
వైద్యులసలహాలు, సూచనలు పాటించాలి. ఎవరికైనా రక్తం ఆగకుండా కారుతుంటే వెంటనే
వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
- డా.పద్మజా లోకిరెడ్డి, హెమటాలజిస్టు, అపోలో ఆస్పత్రి
తల్లిదండ్రుల్లో ఎవరికైనా
హిమోఫీలియా ఉంటే పుట్టబోయే పిల్లలకు ముందేపరీక్షలు చేయించడం మంచింది.
శిశువు గర్భంలో ఉన్న సమయంలోనే పరీక్షలుచేస్తే అబార్షన్ చేయించ డమే
మంచింది. యాంటినెంటల్ డయాగ్నోస్టిక్ పరీక్షలు చేసి పుట్టబోయే పిల్లలకు ఈ
జబ్బు ఉందా..! లేదా నిర్ధారించే అవకాశముంది. ఈ వ్యాధి మూడు రకాలుగా
ఉంటుంది. ఏ, బీ, సీ గ్రూపుల్లో ఈ జబ్బు పిల్లలను వేధిస్తుందన్నారు. 85 శాతం
ఏ గ్రూపు బాధితులు ఉంటారన్నారు. జన్యుసంబంధమైన ఎక్స్ లింక్ కారణంగా
అమ్మాయిలకు ఈ జబ్బు రాదని వైద్యులు తెలిపారు.
- డాక్టర్ శిరీషారాణి, చిన్నపిల్లల హెమటాజిస్టు, రెయిన్‌బో చిల్డ్రన్ ఆస్పత్రి
- డాక్టర్ శిరీషారాణి, చిన్నపిల్లల హెమటాజిస్టు, రెయిన్‌బో చిల్డ్రన్ ఆస్పత్రి

No comments:
Post a Comment