Friday, 22 April 2016

ఆ సీసా 108 ఏళ్లు సముద్రంలో ప్రయాణించింది..!

శివమణి సినిమా బాటిల్‌కు... ఈ బాటిల్‌కు ఆ ఒక్కటే తేడా !
లండన్‌: మీరు శివమణి సినిమా చూశారా? అందులో ఓ బాటిల్‌లో సందేశాన్ని ఉంచి హీరోయిన్‌ సముద్రంలోకి వదులుతుంది. ఇక్కడ కూడా అదే స్టోరీ. కాకపోతే ఆ సందేశాన్ని రాసింది మెరైన్‌ బయోలాజికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు.
 
దాన్ని 108 ఏళ్ల క్రితం అంటే 1906లో బ్రిటన్‌కు చెందిన మెరైన్‌ బయోలాజియల్‌ అసోసియేషన్‌ (ఎమ్‌బీఏ) ప్రతినిధులు సముద్రంలో వదిలారు. అది అలా 108 ఏళ్ల పాటు సముద్రంపై ప్రయాణించి 2015లో జర్మన్‌ తీరానికి చేరింది. దాన్ని మురియన్నే వింక్లర్‌ అనే మహిళ గుర్తించింది. ఆ బాటిల్‌ తెరిచి చూసిన ఆమెకు ఓ పోస్ట్‌ కార్డు కనిపించింది. ఆ పోస్ట్‌ కార్డుపై ‘బాటిల్‌ దొరికిన ప్రాంతం తదితర వివరాలు నింపి ఎమ్‌బీఏ అడ్రస్‌కు పంపండి’ అనే సూచన ఉంది. ఆ మహిళ ఆ సూచనను పాటించి అలాగే చేసింది. ఈ విషయం తెలుసుకున్న గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు దీనికి ‘బాటిల్‌లో ఎక్కువ కాలం ప్రయాణించిన సందేశం’గా గుర్తింపునిచ్చారు.

No comments:

Post a Comment