హైదరాబాద్: రేపు యాదాద్రి బాలాలయానికి ప్రతిష్టాపన కార్యక్రమం
నిర్వహించనున్నారు. చినజీయర్ స్వామి చేతుల మీదుగా బాలాలయం ఆవిష్కృతం
కానుంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బాలాలయం ప్రతిష్టాపన కార్యక్రమంలో
పాల్గొననున్నారు. రేపటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో
స్వయంభూ దర్శనాలు నిలిపివేయనున్నారు. యాదాద్రిలో ఈ రోజు అర్థరాత్రి 12గంటల
వరకే స్వయంభూ దర్శనం చేసుకునే వీలుంది. రేపు ఉదయం 9.58గంటలకు బాలాలయంలో
కవచమూర్తుల ప్రతిష్టాపన చేయనున్నారు. రేపు మధ్యాహ్నం నుంచి బాలాలయంలో దైవ
దర్శనాలు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

No comments:
Post a Comment