Friday, 22 April 2016

నేడే ఇంటర్‌ ఫలితాలు...

11 గంటలకు విడుదల చేయనున్న మంత్రి కడియం...
           ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థుల ఫలితాలను ఒకేసారి ప్రకటించడం విశేషం. ఇంటర్మీ డియేట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి తెలంగాణలో 9,64,664 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 1,257 పరీక్షా కేంద్రాల్లో మార్చి 2 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్‌ విద్యార్థుల ఫలితాలు మార్కులు లేదా గ్రేడ్‌ల వారీగా వెబ్‌సైట్‌లలో పొందుపరుస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎ. అశోక్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రింది వెబ్‌సైట్‌లలో ఇంటర్‌ ఫలితాలు చూసుకోవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రుల, సాధారణ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

tsbie.cgg.gov.in
results.cgg.gov.in
examresults.ts.nic.in
www.indiaresults.com
www.navatelangana.com
www.manabadi.com
www.vidyavision.com
www.99results.com
www.schools9.com

పరిష్కారం కాల్‌ సెంటర్‌ (ఈసేవా) నుంచి ఫలితాలు పొందవచ్చని అశోక్‌ తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ వినియోగదారులు 1100 నెంబర్‌కు, బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు ఇతర మొబైల్‌ ఫోన్‌లు, ల్యాండ్‌లైన్‌ వినియోగదారులు 18004251110 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఉన్న ఈసేవా, మీసేవా, రాజీవ్‌ సిటిజెన్‌ సర్వీస్‌ కేంద్రాల నుంచీ ఫలితాలు పొందవచ్చని తెలిపారు. జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ ఫలితాలు చూసేందుకు http://tsbie.cgg.gov.in, http://tsbie.telangana.cgg.gov.in  వెబ్‌సైట్‌ల నుంచి ఇప్పటికే పంపించిన తమ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి తెలుసుకోవచ్చని కోరారు.


No comments:

Post a Comment