Monday, 11 April 2016

పలు దేవాలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనలు...

  1. దేశంలోని పలు దేవాలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనలను ఓసారి పరిశీలిస్తే..
  2. 2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్ రాష్ట్రం దాతియాలోని రతస్‌గర్హ్ మాతా ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 115 మంది దుర్మరణం.
  3. 2012 సెప్టెంబర్ 24న ఝార్ఖండ్‌లోని సత్సంగ్ దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతి
  4. 2011 సెప్టెంబర్ 24న కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతి చెందారు. ఇదే ఆలయంలో 1999 జనవరి 14న జరిగిన తొక్కిసలాటలో 52 మంది కన్నుమూశారు.
  5. 2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుందాలో కృపాలు మహారాజ్ ఆశ్రమంలో జరిగిన తొక్కిసలాటలో 63 మంది మృతి
  6. 2008 సెప్టెంబర్ 30న రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లోని చాముండాదేవి ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 224 మంది అగ్నికి ఆహుతి అయ్యారు.
  7. మహారాష్ట్రలోని మందిర్‌దేవీ ఆలయంలో 2005 జనవరి 25న జరిగిన తొక్కిసలాటలో 291 మంది కన్నుమూత.
  8. మహారాష్ట్రలోని నాసిక్‌లోని కుంభమేళా సందర్భంగా 2003 ఆగస్టు 27న జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి.
  9. మధ్యప్రదేశ్, హరిద్వార్, ఉత్తరాఖండ్‌లోని ఉజ్జయినీ దేవాలయాల్లో 1996 జూలై 15న జరిగిన తొక్కిసలాట ఘటనల్లో 60 మంది మృతి.
  10. తమిళనాడులోని మహామహమ్ ఆలయంలో 1992 ఫిబ్రవరి 18న జరిగిన ప్రమాదంలో 48 మంది, హిమాచల్‌ప్రదేశ్ నైనాదేవి దేవాలయంలో 1978 ఆగస్టు 3న జరిగిన ప్రమాదంలో 65 మంది మృతి.

No comments:

Post a Comment