భర్త ఎస్‌ఐ... అయినా ఎందుకో ఆమెకీ పాడుబుద్ధి !
చిట్టీల పేరుతో లక్షలాది
రూపాయలకు మేరకు మోసగించిన ఎస్‌ఐ భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఎగ్మూరు
నరియంగాడు పోలీసుక్వార్టర్స్‌లో రాజశేఖర్ అనే ఎస్‌ఐ నివసిస్తున్నాడు. ఆయన
భార్య రాజేశ్వరి క్వార్టర్స్‌లోని పోలీసు కుటుంబ సభ్యులను చందా దారులుగా
చేర్చుకుని వేలం చిట్టీలు నడుపుతున్నారు. కొద్ది నెలల పాటు రాజేశ్వరి చిటీ
పాడినవారికి సక్రమంగా డబ్బులు చెల్లించడంతో ఆమెపై నమ్మకం ఏర్పడింది. తర్వాత
పుదు పేట, విల్లుపురం, చిదంబరం, కుండ్ర, గుమ్మిడిపూండి, తిరు ముల్లైవాయల్
తదితర ప్రాంతాలకు చెందిన 300 మంది ఆమె వద్ద చందాదారులుగా చేరారు. కొద్ది
నెలల తర్వాత రాజేశ్వరి చిట్టీ పాడుకున్నవారికి డబ్బులు చెల్లించలేదు. దీంతో
సుమారు 20 మంది పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సెంట్రల్ క్రైం
పోలీసులు కేసు నమోదు చేసుకుని రాజేశ్వరిని అరెస్టు చేశారు.
No comments:
Post a Comment