మనం
పెద్దగా దృష్టి పెట్టిచూడంగాని.. ఖమ్మంలో ఆసుపత్రుల ఏరియాల్లోని
చెత్తకుప్పల్లో, పెద్ద డ్రైనేజీల్లో హృదయవిదారక దృశ్యాలెన్నో కనిపిస్తాయి.
విగతజీవులుగా మారిన మృతశిశువుల మాంసపు ముద్దలు పడి ఉంటాయి. వాటిపై
స్థానికంగా ఎన్నో ఏళ్లుగా పత్రికల్లో కథనాలూ వస్తున్నాయి. అయినా వాటిని
అక్కడ వేసిపోయింది ఎవరో తెలియదుకనుక చర్యలూ ఉండవు. అధికంగా ఉన్న గిరిజన
ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, చిన్న వయసులోనే వివాహాలు, అనైతిక సంబంధాలు..
వెరసి ఖమ్మం జిల్లాలో గర్భస్రావాలు కాసింత ఎక్కువగానే జరుగుతాయి. కఠిన
చట్టాలున్నా డబ్బుకు కక్కుర్తిపడే డాక్టర్లు ఎటువంటి అడ్డూ చెప్పరు. మూడు
నెలల లోపు అబార్షన్ పర్వాలేదు, కొందరు ఐదు నెలలు దాటినా అబార్షన్
చేయించుకొంటుండటం, చేస్తుండటంపై ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతోంది.ఇప్పుడు
ఇదంతా ఎందుకంటే ఓ ప్రముఖ విదేశీ వైద్యుడు డాక్టర్ ఆంథోని లెవాటినో అబార్షన్
జరిగే క్రమాన్ని ఓ యానిమేషన్ ద్వారా వివరించారు. అది ఇప్పుడు సోషల్
మీడియాలో చర్చకు తెరతీసింది. అయితే అందులో
శిశువు శరీర భాగాలను ముక్కలుగా కత్తిరిస్తున్న తీరు హృదయం ఉన్నవారిని
కదిలించకమానదు. గైనకాలజిస్టు ముందుగా ఓ సోఫర్ క్లాంప్ ద్వారా గర్భాశయంలోకి
సులభంగా వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తాడు. అనంతరం ఆ మార్గం ద్వారా ఓ
క్లాంప్‌ను గర్భాశయం లోపలికి జొప్పిస్తారు. అప్పుడు అక్కడ ఉండే శిశువు శరీర
బాగాలైన తల,చేతులు, కాళ్లను ఆ క్లాంప్ సహాయంతో తొలగిస్తారు. ఇలా పార్టు
పార్టులుగా కత్తిరించడం దారుణ, అమానవీయ చర్యగా అనిపించకమానదు.

No comments:
Post a Comment