సంసారం
మహా సాగరం అని పెద్దలు అంటూ ఉంటారు. పెళ్ళిళ్ళ గురించి ఎన్ని సెటైర్లయినా
వేసుకోవచ్చు. క్షణానికో జోక్ సృష్టించవచ్చు. ఐఐటీ మద్రాస్ విద్యార్థినులు
‘కాబోయే పెళ్ళి కూతుళ్ళకు హెచ్చరిక’ అంటూ ఓ వీడియోను రూపొందించారు. అది
ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. వేలాది లైక్‌లు
వస్తూండటంతో దాని రూపకర్తలు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
సాహిత్య
2016లో సర్ మిక్స్ ఏ లాట్ సాంగ్ పేరడీ పోటీల కోసం ఐఐటీ మద్రాస్‌కు చెందిన
కృప వర్ఘీస్, అనుకృప ఇలాంగో అస్మిత ఘోష్ ఓ వీడియోను రూపొందించారు. దాన్ని
సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ‘కాల్ మీ మేబి’ అనే పాప్ సాంగ్‌కు పేరడీగా
దీనిని అస్మిత ఘోష్ రాసి, పాడారు. వీడియోలో కృప వర్ఘీస్ నటించారు. దీన్ని
భారతీయ వివాహ ప్రకటనల తీరులో మలచినట్లు వారు పేర్కొన్నారు. కొడుకుకు
పెళ్ళి చేయాలనుకుంటున్న తల్లి మంచి అమ్మాయి కోసం ప్రకటన ఇస్తున్నట్లుగా ఈ
పాటను రూపొందించారు. మూడు నిమిషాల పాటు సాగే ఈ పాటలో పెళ్ళి కొడుకు తల్లి
ఏం చెప్పిందంటే....
‘‘నా
కొడుకు ఎంబీఏ చదివాడు. చూడటానికి అందంగా ఉంటాడు, అతనికి మంచి భార్య
కావాలి. అమ్మాయి సంప్రదాయబద్ధంగా ఉండాలి. షార్ట్స్ ధరించకూడదు. చపాతీలు
గుండ్రంగా చేయగలగాలి. గుండ్రంగా చేసిన చపాతీల శాంపిల్స్‌ను పంపించండి.
పెళ్ళి కాగానే పిల్లల్ని కనవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన అర్హతలన్నీ ఉన్న
అమ్మాయిలు కాల్ చేయండి. ఇదిగో ఫోన్ నెంబర్’’.
No comments:
Post a Comment