డ్రింక్స్ తాగే ముందు
గ్లాసులు తాకించి ఛీర్స్ చెప్పుకోడం ఇప్పుడైతే సెలబ్రేషన్ సింబల్. కానీ
అది ఆరంభమైంది మాత్రం ఒక అనుమానపు చేష్టగా. మధ్యయుగం నాటి సముద్రపు దొంగలు ఈ
సంప్రదాయానికి ఆద్యులు. వీరు ఓడలను దోచుకున్నాక ఆ సొమ్మును పంచుకోవడానికి,
తమ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదైనా దీవిపై దిగేవారు. అయితే
కొందరు దొంగలు తమతోటివారి వాటాలను కాజేయడానికి వారి మద్యంలో విషం
కలిపేవారు. అందువల్ల పరస్పర అనుమానాలను తొలగించుకోవడానికి వారు ఒక ఒప్పందం
కుదుర్చుకున్నారు. అదేమిటంటే మద్యం తాగే ముందు తమ గ్లాసుల్లోని(చెక్క
లోటాలు) మద్యం ఒకదానిలోంచి మరోదానిలోకి చిందేలా గట్టిగా తాకించుకోవడం. అలా
చేసేప్పుడు వారు ‘ఛీర్స్ (ఛీర్ అంటే ఆనందించు, ఉత్సాహపడు, ఊరటచెందు)’
అనుకునేవారు. అంటే చావు భయం వద్దు ఈ మద్యం ఇచ్చేది ఆనందం మాత్రమే అనేది
వారి భావన. అలా గ్లాసులు తాకించుకొని ఛీర్స్ చెప్పుకునే సంప్రదాయం మొదట
బ్రిటన్‌లోకి, ఆ తరువాత అది పరిపాలించిన వలస రాజ్యాల్లోకి వ్యాపించి మనదాకా
చేరింది.

No comments:
Post a Comment