రేపిస్టుకు ఆమె వేసిన శిక్షేంటో తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది !
మహిళలపై
లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వావివరసలను మరిచి
కన్నకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడుతున్న కీచక ఘటనలు సాధారణమైపోయాయి. ఈ
ఘటనల్లో చాలా మంది అబలలు కొవ్వొత్తుల్లా కరిగిపోతున్నారు. ప్రతిఘటించిన
సందర్భాలు చాలా తక్కువ. అయితే అస్సాంలో ఓ వివాహిత తనపై మృగంలా విచక్షణ
మరిచి అత్యాచారం చేయబోయిన దుర్మార్గుడికి వేసిన శిక్ష తెలిస్తే రోమాలు
నిక్కపొడుచుకోవాల్సిందే. అస్సాంలోని బిస్వనాథ్ చారిలాలి పోలీస్ స్టేషన్
పరిధిలోని భారజులి గ్రామంలో ఏప్రిల్ 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి
వచ్చింది.
కృష్ణా అనే యువకుడు రిటా అనే వివాహితపై,
ఆమె కూతురిపై ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. రిటా
అతనిపై దాడి చేసి... అతని ప్రైవేట్ భాగాలను కత్తితో కోసి అత్యంత కిరాతకంగా
హత్య చేసింది. అతని శవాన్ని రిటా స్నేహితురాళ్ల సహాయంతో శ్మశానానికి
తీసుకెళ్లి ఖననం చేసింది. కృష్ణ కుటుంబ సభ్యులు అతను కనిపించకపోవడంతో
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం
తెలిసింది. పోలీసులు రిటాను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై రిటా
స్పందిస్తూ ఏ ఒక్క అమ్మాయికి ఇలా జరగకూడదనే అంత కిరాతకంగా హత్య చేశానని
తెలిపింది. కృష్ణపై గతంలో కూడా రెండు కేసులు ఉన్నట్లు తెలిసింది.
No comments:
Post a Comment