Wednesday, 20 April 2016

సముద్రంలోనూ బుల్లెట్‌ రైలు.. చుక్‌ చుక్‌

న్యూదిల్లీ : మన దేశంలో ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య తొలి బుల్లెట్‌ రైలు రానుందంటే ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ రైలు ఇప్పుడు మరో ఆసక్తికర అంశానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ రైల్వే కారిడార్‌లో 21 కిలోమీటర్ల మేర బుల్లెట్‌ రైలు సముద్రంలోపలి నుంచి ఓ టన్నెల్‌ గుండా ప్రయాణిస్తుందట. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ముంబయి.. థానే వద్ద ఉన్న ఓ క్రీక్‌లో ఈ టన్నెల్‌ నిర్మితమవుతుందని చెప్పారు. ముంబయి-అహ్మదాబాద్‌ రైల్వే కారిడార్‌ మొత్తం 508 కిలోమీటర్ల పొడవుంది. దానిలో భాగంగానే సముద్రంలో 21 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.97,636 కోట్లుగా ఉందని చెప్పారు. దీనిలో 81 శాతం జపాన్‌ నుంచి రుణంగా పొందుతున్నామని తెలిపారు.

No comments:

Post a Comment