Sunday, 24 April 2016

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ...

    హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం ఓ లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేసింది ఎన్టీఆరేనని, ఎన్టీఆర్‌ అభినవ అంబేద్కర్ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్‌కు సముచిత స్థానం ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలన్నకేంద్రం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు.

No comments:

Post a Comment