పౌర్ణమి నాడు ఆరుబయట కూర్చుని.. నిండు చంద్రుడిని చూస్తుంటే..
ఆ అనుభూతే ఎంతో గొప్పగా ఉంటుంది. వెన్నెల వెలుగుల్లో ఆడుకోవాలని ఎంతమందికి
అనిపించదు చెప్పండి.. మరీ పాలమీగడలాంటి చందమామ గులాబీ రంగులో
దర్శనమిస్తే.. నిజంగా చంద్రుడు గులాబీ రంగులో కనిపిస్తాడా?
ఏప్రిల్ మాసంలో వచ్చే నిండు పూర్ణిమనాడు చంద్రుడు గులాబీ రంగులో కనిపిస్తాడని ఇటీవల సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే రేపు పౌర్ణమి. మరి చందమామ సంగతేంటీ.. నిజంగానే గులాబీ రంగులో ఉంటాడా? తెలుసుకోవాలంటే ఇది చదవండి..
ఏప్రిల్ 22 శుక్రవారం రాత్రి 7.30 నుంచి 10.30 గంటల మధ్య చంద్రుడు గులాబీ రంగులో దర్శనమిస్తాడని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇది పూర్తిగా వాస్తవం కాకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో చంద్రుడు లేత గులాబి రంగులో కనిపిస్తాడట. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా చంద్రుడి రంగు మారుతుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా మాత్రం కాదట.
అయితే నిజానికి చంద్రుడు రంగు ఏ మాత్రం మారదట. పురాతన కాలంలో సుపీరియర్ సరస్సు ప్రాంతంలో నివసించే అల్గాన్‌క్విన్ తెగకు చెందిన వారు చంద్రుడికి పేర్లు పెట్టేవారట. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడిని ఓ ప్రత్యేక పేరుతో పిలుచుకునేవారట. అందులో ఏప్రిల్‌లో వచ్చే చంద్రుడికి పింక్ మూన్ అని పెట్టారు. అలాగే ఫిబ్రవరిలో మంచు చంద్రుడు కూడా ఉంటాడట. ఇలా.. ఏప్రిల్ పౌర్ణమి నాడు గులాబి చంద్రుడనేది సంప్రదాయంగా వస్తున్న పేరు మాత్రమేనని, గులాబి రంగు ఏ మాత్రం ఉండదని మరికొందరు చెబుతున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఈ గులాబి పేరు గల చంద్రుడిని రేపు మనమూ చూసేద్దామా..!

No comments:
Post a Comment