బ్యాంకు లావాదేవీలపై సేవా రుసుం
విధించాలని ఎస్‌బీఐతో పాటు దేశంలోని ప్రధాన బ్యాంకులైన ఐసీఐసీఐ,
హెచ్‌డీఎఫ్‌సీ,యాక్సిస్ బ్యాంకులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ
దారిలోనే మరికొన్ని బ్యాంకులు సర్వీస్ ఛార్జీల పేరుతో కస్టమర్‌పై భారం
మోపేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. లావాదేవీలు నేరుగా బ్యాంకులనుంచి
కాకుండా ఆన్‌లైన్‌లోనే జరపాలన్న ఉద్దేశంతోనే ఈ నిబంధనలు
తీసుకొస్తున్నట్లు ఆయా బ్యాంకులు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ కింద ఉన్న
బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉంటే మీ లావాదేవీలపై ఎంత సేవా రుసుము విధిస్తారో
తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో నేరుగా డబ్బును మూడుసార్లు ఎలాంటి ఛార్జీలు లేకుండా డిపాజిట్ చేసుకోవచ్చు. మూడు సార్లు డిపాజిట్ చేసిన తర్వాత అంటే నాలుగో సారినుంచి ప్రతి లావాదేవీలపై రూ.50 సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు
మీది కరెంట్ అకౌంట్ అయితే రూ.10వేల వరకు సర్వీస్ ఛార్జీలు విధించబడుతాయి
ఎస్‌బీఐ ఖాతాదారులు మీ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి లేదంటే జరిమానా తప్పదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఖాతాదారులకు ఆ జరిమానా కాస్త తక్కువగా ఉంటుంది.

మెట్రో పాలిటన్ ప్రాంతాల్లో మినిమమ్
బ్యాలెన్స్ రూ.5000 ఉండాలి. అయితే రూ.5వేలకు 75 శాతానికి తక్కువగా
బ్యాలెన్స్ ఉన్నట్లయితే రూ.100 జరిమానా విధిస్తారు. అదే 50 శాతానికి
మించి తక్కువగా ఉంటే రూ.50 వరకు పెనాల్టీ ఉంటుంది.
ఇక ఏటీఎంల విషయానికొస్తే ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి ఉపసంహరణ మూడు సార్లు దాటితే రూ.20 ఛార్జీ విధిస్తారు.ఎస్‌బీఐ ఏటీఎంలలో నగదు ఉపసంహరణ ఐదు సార్లు దాటితో రూ.10 చొప్పును ఛార్జీ ఉంటుంది.
మీ అకౌంట్‌లో రూ.25వేలకు మించి ఉంటే ఎస్బీఐ ఏటీఎం నుంచి ఎన్నిసార్లైనా సరే ఎలాంటి రుసుం లేకుండా ఎస్బీఐ డెబిట్ కార్డుతో డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఒక వేళ మీ అకౌంట్‌లో రూ.1 లక్ష అంతకుమించి ఉంటే ఇతర బ్యాంకు ఏటీఎంలనుంచి కూడా ఎస్బీఐ డెబిట్ కార్డుతో ఎన్నిసార్లు అయినా డబ్బును డ్రా చేసుకోవచ్చు
ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లపై మూడునెలకు రూ.15 ఛార్జీలు వసూలు చేస్తారు.రూ.1000 వరకు యూపీఐ, యూఎస్‌ఎస్‌డీ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు.
యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులు నెలకు 5 లావాదేవీలు ఎలాంటి రుసుము లేకుండా జరపొచ్చు. ఆపైన ట్రాన్సాక్షన్స్ జరిపితే ఒక్క లావాదేవీకి రూ.95 వసూలు చేస్తారు
నాన్ హోమ్ బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ ఐదు సార్లు జరిపితే ఎలాంటి ఛార్జలు ఉండవు అయితే కనీస లావాదేవీలు రోజుకు రూ.50వేలకు తక్కువగా ఉండకూడదు. ఆరో ట్రాన్సాక్షన్ నుంచి ప్రతి రూ.1000కి రూ.2.50 ఛార్జ్ చేస్తారు లేదా రూ.95 ఛార్జ్ చేస్తారు. రెండిట్లో ఏది ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి ఛార్జీలు విధిస్తారు.
HDFC బ్యాంక్
HDFC ఖాతాదారులు నెలకు డిపాజిట్స్ కానీ విత్‌డ్రాయల్స్ కానీ నాలుగు సార్లు మాత్రమే చేసుకోవచ్చు. ఆపైన ట్రాన్సాక్షన్స్‌కు రూ.150 వసూలు చేస్తారు. ఈ కొత్త ఛార్జీలు సేవింగ్స్‌తో పాటు శాలరీ అకౌంట్లకు కూడా వర్తిస్తాయి.
హోమ్ బ్రాంచ్ లో అయితే రోజుకు రూ. 2 లక్షలు డిపాజిట్ లేదా విత్‌డ్రాయల్‌కు ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే రూ.2 లక్షలు ట్రాన్సాక్షన్ ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఆపైన ప్రతి రూ.1000కి రూ.5 వసూలు చేస్తారు లేదా రూ.150 వసూలు చేస్తారు.
నాన్-హోమ్ బ్రాంచ్‌లలో రూ.25వేలకు మించి డిపాజిట్ చేసినా విత్‌డ్రాచేసిన ప్రతి రూ.1000కి రూ.5 లేదా రూ.150 వసూలు చేస్తారు
ICICI బ్యాంక్
హోం బ్రాంచ్‌లో నెలలో జరిపే మొదటి నాలుగు లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. ఆపై ప్రతి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీలు విధిస్తారు
థర్డ్ పార్టీ ద్వారా జరిపే డిపాజిట్స్ రోజుకు రూ.50వేలు
నాన్ హోమ్ బ్రాంచ్‌లలో నెలలో తొలిసారిగా జరిపే క్యాష్ విత్‌డ్రాయల్స్‌పై ఎలాంటి రుసుము ఉండదు. ఆ తర్వాత జరిపే లావాదేవీలపై ప్రతి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీలు విధిస్తారు.
క్యాష్ డిపాజిట్ మెషీన్లలో నగదు డిపాజిట్ చేస్తే మొదటిసారి ఎలాంటి రుసుము విధించరు. ఆ తర్వాత డిపాజిట్ చేస్తే ప్రతి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీలు విధిస్తారు