అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ లు ఉండాలనే లక్ష్యంతో రవాణాశాఖ స్పెషల్
డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా మహిళలకు ఈ నెల 8న ప్రత్యేకంగా లైసెన్స్
మేళా నిర్వహంచేందుకు శ్రీకారం చుట్టింది. వాహనాలు నడుపుతున్నా చాలా మంది
మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ లు లేవు. దీంతో ఇతరులపైనే ఆధార పడుతున్నారు.
లైసెన్స్ లు తీసుకునే విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. హైదరాబాద్ లోని
ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్ పేట్,బహదూర్ పురా, మెహదీపట్నం ఆర్టీఏ
కార్యాలయాల పరిధిలో 20 లక్షల మందికి పైగా మగవారు డ్రైవింగ్ లైసెన్స్ లు
కలిగి ఉంటే… లక్ష మంది మహిళలకే లైసెన్స్ లు ఉన్నాయట. సొంతంగా ఆర్టీఏ
కార్యాలయానికి వెళ్లేందుకు, స్లాట్ నమోదు చేసుకునేందుకు మహిళలు పెద్దగా
ఇంట్రెస్టు చూపడం లేదు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని రవాణ శాఖ ఈ
కార్యక్రమాన్ని చేపట్టింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదర్భంగ
నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో మహిళలకు లెర్నింగ్ లైసెన్స్ లు అందజేయనుంది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు హైదరాబాద్ సంయుక్త
రవాణా కమిషనర్ పాండురంగ నాయక్.
మార్చి 8న సికింద్రాబాద్,ఖైరతాబాద్, మలక్ పేట్,మెహదీపట్నం,బహదూర్ పురా
ఆర్టీఏ కార్యాలయాల్లో మహిళలు మాత్రమే లెర్నింగ్ లైసెన్స్ తీసుకునేలా
స్లాట్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. ఈ సెంటర్లలో మహిళా ఎంవీఐలు, మహిళా
అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి లెర్నింగ్ లైసెన్స్ లకు హాజరయ్యే
మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారు. మిగతా కార్యాలయాలు ఉప్పల్, అత్తాపూర్,
మేడ్చల్, కూకట్ పల్లి ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రత్యేకంగా స్లాట్స్
అందుబాటులో లేనప్పటికీ ఆ రోజు లెర్నింగ్ లైసెన్స్ తో పాటు…వివిధ రకాల
పౌరసేవల కోసం వచ్చే మహిళలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు.

No comments:
Post a Comment