Sunday, 31 July 2016

తాత కాదు...వయసు నాలుగేళ్లే..!

ఢాకా : వృద్ధాప్యం శాపం అంటారు. అయితే పుట్టకతోనే వృద్ధాప్యం ముంచుకువస్తే అది ప్రత్యక్ష నరకమే. దక్షిణ బంగ్లాదేశ్‌లోని ఓ బుడతడు ఇలాంటి వైకల్యంతోనే బాల్యంలోనే వృద్ధాప్య దశను అనుభవిస్తూ క్షణమొక యుగంలా బతుకు గడుపుతుండటం ఆతని తల్లిదండ్రులను కలిచివేస్తోంది. ఆ బాలుడి పేరు బయెజిద్ హుస్సేన్. పుట్టి నాలుగేళ్లే అయినా పది రెట్లు పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. వైద్యపరిభాషలో అతనికి ఉన్న జన్యుపరమైన లోపాన్ని 'ప్రిజేరియా' అని పిలుస్తారు. ఉబ్బిపోయిన ముఖం, అంటుకుపోయిన దవడలు, వేలాడుతున్న చర్మం, మూత్రవిసర్జన కష్టంకావడం, పళ్లు బలహీనంగా, విరిగిపోయినట్టు ఉండటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ లక్షణాలన్నీ బయెజిద్‌లో చోటుచేసుకోవడంతో ఆ ఈడు పిల్లలు కూడా అతనితో ఆడుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ పరిస్థితిని చూసి తల్లి త్రిప్తి ఖతున్ తల్లడిల్లిపోతోంది. 'బయెజిద్ మూడేళ్ల వయస్సులో నడవడం నేర్చుకున్నాడు. ఆ వయస్సులోనే అతనికి అన్ని పళ్లూ వచ్చేశాయి. అసాధారణరీతిలో శారీరక ఎదుగుదల ఉన్నప్పటికీ మానసికంగా ఎదగలేదు. అయినా ఎంతో చక్కగా మాట్లాడతాడు. వయసుకు మించిన గ్రాహ్యశక్తి ఉంది' అంటూ త్రిప్తి వెల్లడించింది. తన పిల్లవాడు ఇతర పిల్లల్లా చూడలేడని, వృద్ధాప్యంలో ఉన్న మనిషిలా ఉంటాడని వాపోయింది. తనకు కలిగిన మొదటి సంతానమే ఇలా కావడం తనను కలిచివేస్తోందంటూ కంటతడిపెట్టింది.
సహజంగా ప్రిజేరియాతో బాధపడుతున్న వారి జీవనప్రమాణం 13 ఏళ్ల వరకూ ఉంటుంది. గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తన కుమారుడు పుట్టినప్పటి నుంచి తాము కలవని డాక్టరు కానీ, సంప్రదించని వ్యక్తులు కానీ లేరని బయెజిద్ తండ్రి లవ్లు తెలిపాడు. ఇప్పటి వరకూ 4 వేల పౌండ్లకు పైగా ఖర్చు చేశామని, అయితే ఎవరికీ వైద్యం అంతుపట్టలేదని వాపోయాడు. 'ఇప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. పైగా రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతోంది' అని చెప్పుకొచ్చాడు. తన కుమారుడు అందరిలాంటి పిల్లవాడు కాదని, కన్నకొడుకు రోజురోజుకూ మృత్యువుకు చేరువవుతున్నాడని తెలిసిన ఏ తల్లిదండ్రులకైనా అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని అతను వాపోయాడు.

పారిస్‌లో వాటర్ ట్యాక్సీలు

పారిస్‌లో వాహనాల రద్దీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వినూత్న ప్రయోగం చేసింది. ప్రయాణికులు సరదాగా ప్రయాణించేలా సీన్‌ నదిలో ఫ్లైయింగ్‌ వాటర్‌ టాక్సీలను ఏర్పాటు చేశారు. ఈ వాటర్‌ టాక్సీలో పైలట్‌తోపాటు ఐదుగురు ప్రయాణించవచ్చు. వాటర్ ట్యాక్సీ నడిపేందుకు డ్రైవర్‌ సహాయం లేకుండా రోబోతో పనిచేసే దిశగా పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 5 లక్షల యూరోలను కంపెనీ సేకరించింది. ఈ వాహనాలు బ్యాటరీలతో నడిచే విధంగా రూపొందించారు. గంటకు 29 మైళ్ల వేగంతో వాటర్ ట్యాక్సీలు వెళ్లగలవు.

ఇష్టంగా పెంచుకునే కుక్క చనిపోతుందని తెలుసుకొని

పెంపుడు జంతువులను ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పెంచుకుంటారు. వాటికి కావలసినవన్నీ సమకూరుస్తారు. తిండికి, ముద్దు ముచ్చట్లకు కొదవే ఉండదు. కానీ అదే పెంపుడు జంతువు చనిపోతుందని తెలిస్తే ఏం చేస్తారు? మహా అయితే వాటికి నచ్చిన ఆహారం పెట్టి కొద్దిరోజులైనా ప్రేమగా చూసుకుంటారు. కానీ అమెరికాకు చెందిన రాబర్ట్‌ క్లగర్‌ మాత్రం అలా చేయలేదు. తన పెంపుడు కుక్క బెల్లాకు కేన్సర్‌ అనీ, ఆరునెలలు మించి బతకదని డాక్లర్లు తేల్చి చెప్పేయడంతో క్లగర్‌ భిన్నంగా ఆలోచించాడు. బెల్లాతో గడిపే ఆఖరి రోజులు ఎప్పటికీ గుర్తుండిపోవా లనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెంటనే బెల్లాతో విహారయాత్రకు బయలుదేరాడు. న్యూయార్క్‌, డెట్రాయిట్‌, కెంటకీ, ఓహియో వంటి అనేక ప్రాంతాలు తిరుగుతూ సరదాగా గడిపాడు. కానీ బెల్లా గడువు కంటే ముందే చనిపోవడంంతో రాబర్ట్‌ తట్టుకోలేకపోయాడు. ఏమైతేనేం, కుక్కని విహార యాత్రకు తీసుకెళ్ళటం మాత్రం చెప్పుకోదగ్గ విషయమే కదా!

బీబీఎల్‌లో తొలి భారత మహిళా క్రికెటర్‌

మైదానంలో తన బ్యాటింగ్‌ ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకుంటున్న భారత మహిళా క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ తరహాలో ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న మహిళల బిగ్‌బాస్‌ లీగ్‌(బీబీఎల్‌)లోని సిడ్నీ థండర్స్‌ జట్టుకు రానున్న సీజన్‌లో ప్రాతినిథ్యం వహించేందుకు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సంతకం చేసింది. ఇలా ఓ విదేశీ లీగ్‌లో భారత మహిళా క్రికెటర్‌ ఆడనుండటం ఇదే తొలిసారి. కెరీర్‌లో రెండు టెస్టులు, 55 వన్డేలతో పాటు 61 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన 27 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ప్రస్తుతం మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతోంది. ‘బిగ్‌బాస్‌ లీగ్‌లో ఆడనున్న భారత తొలి మహిళా క్రికెటర్‌ కావడం నాకు చాలా గర్వంగా ఉంది. మహిళా క్రికెటర్లకు నేర్చుకునేందుకు బీబీఎల్‌ సరైన వేదిక. సిడ్నీ థండర్స్‌ జట్టుకు ఆడేందుకు సంతకం చేయడం ఓ మధుర జ్ఞాపకం’ అంటూ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆనందం వ్యక్తం చేసింది. జూన్‌ నెలలోనే బీబీఎల్‌ కోసం కౌర్‌ సంతకం చేసినట్లు వార్తలు వచ్చినా.. అప్పట్లో సిడ్నీ థండర్స్‌ వాటిని ఖండించింది. విదేశీ లీగ్‌లో భారత మహిళా క్రికెటర్లు ఆడేందుకు ఇటీవలే అనుమతిచ్చిన బీసీసీఐ ఈ నిర్ణయానికి సంబంధించి క్రికెటర్లకు ‘నిరభ్యంతర పత్రం’ జారీ చేయకపోవడంతో కౌర్‌ ఈ ఒప్పందాన్ని అప్పట్లో నిర్ధారించలేదని వార్తలు వచ్చాయి.

కబాలి రా...అంటున్న గవర్నర్..!

'కబాలి' రజనీ ఫీవర్ ఇంకా తగ్గుముఖం పట్టినట్టు లేదు. తలైవర్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్..సినిమాకొచ్చిన నెగిటివ్ టాక్‌ను కూడా అధిగమించి బాక్సాఫీస్ కలెక్షన్లు షేక్ చేస్తూ రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఆ మాటెలా ఉన్నా 'కబాలి' రిలీజ్ తర్వాత మళ్లీ రజనీకాంత్‌కు పుదిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నుంచి బహిరంగ ఆహ్వానం వెళ్లింది. తాను చేపట్టిన 'ప్రోస్పరర్ పుదుచ్చేరి' ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవాలని ఆదివారంనాడు మరోసారి రజనీకాంత్‌కు ఆమె ప్రపోజ్ చేశారు. ఈ ఏడాది మే 29 పదవీ బాధ్యతలు చేపట్టిన కిరణ్ బేడీ...పుదుచ్చేరి అభ్యున్నతే లక్ష్యంగా చురుగ్గా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పరిసరాల్లో చెత్తాచెదారం ఏరివేతకు ఆదివారం చేపట్టిన డ్రైవ్‌లో మున్సిపల్ వర్కర్స్‌ను బేడీ ఉత్సాహపరుస్తూ అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాండిచ్చేరి అభ్యున్నతి కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు రజనీ ముందుకు రావాలంటూ ఆమె పిలుపునిచ్చారు. గతంలోనూ ట్విట్టర్‌లో బేడీ రజనీకి ఇదే రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ సమయంలో రజనీ విదేశాల్లో ఉన్నారు. ఇటీవల 'కబాలి' చిత్రం రిలీజ్ సమయంలోనూ కిరణ్ బేడీ ఆ చిత్రం టిక్కెట్లు ఉచితంగా సెల్లిపేట్ గ్రామస్థులకు పంపిణీ చేయించారు. ప్రధాని మోదీ చేపట్టిన 'స్వచ్ఛ భారత్ అభియాన్‌'లో భాగంగా తమ ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకున్న 147 మంది గ్రామస్థులకు కలెక్టర్ సారథ్యంలో రెవెన్యూ సిబ్బంది ఈ టిక్కెట్లు అందజేశారు.

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం: వాతావరణశాఖ

విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తామీదుగా ద్రోణి ఏర్పడిందని తెలిపింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొనింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ, ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ,  ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది.

వాహనదారులకు శుభవార్త.. తగ్గిన పెట్రో ధరలు!


పెట్రోధరలు భారీగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధర ఒక రూపాయి 42 పైసలు, లీటర్ డీజిల్ ధర రెండు రూపాయలా ఒక పైస తగ్గింది. సవరించిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.

భద్రాద్రిలో గోదావరి అంత్యపుష్కరాలు

ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి అంత్యపుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుష్కరాల ప్రారంభం సందర్భంగా ఆదివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పుణ్యక్షేత్రం నుంచి ప్రచారమూర్తులు, శ్రీపాదుకలు, చక్రపెరుమాళ్లను సమస్త మంగళవాయిద్యాలతో శోభాయాత్రగా గోదావరికి తీసుకెళ్లి పూజలు చేశారు. ఉదయం 6గంటల నుంచి 7.30 వరకు సంకల్పం, నదీపూజ, శ్రీరామానుజాచార్య స్వామివారికి అభిషేకం, సామూహిక పుష్కరస్నానం నిర్వహించారు. దేశంలో 13పుణ్య నదులకు పుష్కరాలు జరుగుతాయి. వీటిలో గోదావరి నది పుష్కరాలు ప్రధానమైనవి. ఈ నదికి గతేడాది జూలై 14 నుంచి 25 వరకు ఆది పుష్కరాలు జరిగాయి. ఇవాళ్టి నుంచి ఆగస్టు 11 వరకు అంత్య పుష్కరాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, జిల్లా జడ్జి విజయమోహన్‌, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఐటీడీఏ పీవో రాజీవ్‌గాంధీ, రామాలయం ఈవో రమేశ్‌ బాబు, ప్రధానర్చకులు జగన్నాథాచార్యులు పాల్గొన్నారు.

తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ‘గుండె’

బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తి గుండెను తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి చిరంజీవి (43)పది రోజులుగా జ్వరం రావడంతో తిరుపతి స్విమ్స్‌లో ఆయనకు వైద్యం చేయించారు. అప్పటికే బ్రెయిన్‌లోని నరాలు దెబ్బతినడంతో రోజులు గడుస్తున్న కొద్ది చిరంజీవి గుండె బ్రెయిన్‌డెడ్ అయిపోయింది. దీంతో ఆయన కుటుంబసభ్యులు ఆర్గానిక్ డొనేషన్‌కు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తిరుపతి నుంచి గుండెను హైదరాబాద్‌కు తరలించారు. గ్రీన్‌చానల్ ద్వారా రేణిగుంట విమానాశ్రయానికి తీసుకెళ్లారు.శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి గ్రీన్‌చానల్‌ ద్వారా స్టార్‌ ఆస్పత్రికి కేవలం 20 నిమిషాల్లో తరలించారు.

చనిపోయిన యువతి శరీరం నుంచి ఆత్మ వెళుతుండగా రికార్డయిందట !

 
దెయ్యాలున్నాయా, లేవా అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం సహజం. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని ఎక్కడైనా ఇదే పరిస్థితి. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈరోజుల్లో కూడా దెయ్యాలు, భూతాల్లాంటి మూఢనమ్మకాలను నమ్మేవారు ఉన్నారు. ఇలాంటి నమ్మకాలు కలిగిన వారిలో చైనీయులు ఉన్నారు. చైనా దేశంలోని ఓ ఆసుపత్రిలో దెయ్యం ఉందంటూ ప్రచారం జరిగింది. దెయ్యం దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. ఒక మహిళా పేషెంట్ శరీరంలో నుంచి ఆత్మ వెళ్లడం తాము వీడియోలో గమనించామని, కావాలంటే మీరూ చూడండని యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోను ఫేక్ వీడియోగా కొట్టిపారేస్తున్నారు. ఇలాంటివి యూట్యూబ్‌లో చాలానే ఉన్నాయని, దెయ్యాలనేవే లేవని కొందరు బలంగా వాదిస్తున్నారు. ఆ వీడియో మీరూ చూడండి.

ఇంటర్నెట్ లేకుండా ఫేస్‌బుక్ చూడొచ్చు

భారతదేశంలో ఫేస్‌బుక్ యూజర్లందరికీ శుభవార్త! గట్టిగా ఈల వేసి చిందులేయండి. స్టార్325హ్యాష్‌ని గుర్తుంచుకోండి. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఫేస్‌బుక్ చూడొచ్చు. దీని కోసం చేయవలసిందల్లా స్టార్325హ్యాష్‌(*325#)ని ప్రెస్ చేయడమే.
 
ఫేస్‌బుక్ ఇండియా, ఫోనెట్‌విష్ భాగస్వామ్యం వల్ల ఇది సాధ్యమైంది. ఫోనెట్‌విష్ అంటే యూఎస్ఎస్‌డీ (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ డేటా) ఆధారంగా పనిచేసే ఇంటరాక్టివ్ సర్వీస్. డేటా కనెక్షన్ లేకుండానే డివైస్‌లను కనెక్ట్ చేసుకోవడానికి యూఎస్ఎస్‌డీ అవకాశం ఇస్తుంది. మరో విశేషం ఏమిటంటే ఫేస్‌‌బుక్ స్టేటస్‌ను ఉచితంగానే చూసుకోవచ్చు. పోస్టింగ్, నోటిఫికేషన్ల చెకింగ్, ఫ్రెండ్స్‌ను యాడ్ చేసుకోవడం కోసం మాత్రం డబ్బు చెల్లించాలి. రోజుకు ఒక రూపాయి చెల్లిస్తే అపరిమితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్ నుంచి స్టార్325హ్యాష్‌ను టైప్ చేసి ఫేస్‌బుక్ యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. వెంటనే ఫేస్‌బుక్ ఫీచర్లకు యాక్సెస్ అవుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, ఐడియా, టాటా డొకొమో యూజర్లు మాత్రమే ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. త్వరలోనే మిగతా నెట్‌వర్క్‌లకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Saturday, 30 July 2016

ఆమెకు బలవంతంగా యూరిన్ తాగించారు

దర్భంగా: దేశ వ్యాస్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బీహార్‌లో ఈ సంఘటనలు మరీ ఎక్కువయ్యాయి. బీహార్‌లో ఓ మహిళ మంత్రాలు చేస్తున్నదనే నెపంతో తన యూరిన్‌ని తనకే తాగిపించారు ఓనలుగురు వ్యక్తులు. బీహార్‌లోని దర్భంగా జిల్లా పిప్రా గ్రామంలో చోటుచేసుకుంది ఈ సంఘటన. ఈ సంఘటనపై  తమ గ్రామంలోని పిల్లలు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారని, దానికి ఆ దళిత మహిళే కారణం అని వారు ఆరోపించినట్లు స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంజని కుమార్ తెలిపారు. ఆ కారణం చేతనే గురువారం ఆ దళిత మహిళకు బలవంతంగా యూరిన్‌ని తాగించారని పేర్కొన్నారు. ఈ చర్యకు కారకులైన వారపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఆయన తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఊరు విడిచి వెళ్లిపోయిందని తెలిపారు.
స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంజని కుమార్ తెలిపారు. 

దేశంలో మొట్టమొదటిసారిగా 12వేల అడుగుల ఎత్తులో పులి

దేశంలో మొట్ట మొదటిసారిగా 12వేల అడుగు ఎత్తులో సంచరిస్తున్న పులిని అధికారులు గుర్తించారు. ఉత్తరాఖండ్‌లోని ఎగువ ప్రాంతమైన పితోర్‌గఢ్‌లో అత్యంత ఎత్తులో తిరుగుతున్న పులి ఆనవాళ్లను ఓ కెమెరా రికార్డు చేసింది. సాధారణంగా ఇంత ఎత్తులో మంచు పులులు మాత్రమే సంచరిస్తుంటాయి. వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త బిలాల్ హబీబ్.. జీవవైవిధ్య పరిరక్షణ ప్రాజెక్టులో భాగంగా ఫొటోలు తీస్తుండగా ఇండియాలోని ఎత్తైన ప్రదేశంలో ఈ పులి ఆనవాళ్లు చిక్కాయి. ఎత్తైన ప్రదేశాల్లో పులులు కనిపించడం గురించి బ్రిటిష్ కాలం నాటి పుస్తకాల్లో ఉందని, అయితే ఇందుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు కానీ, ఫోటోలు కానీ లేవని బిలాల్ పేర్కొన్నారు. భూటాన్‌లో మాత్రం 13వేల అడుగుల ఎత్తుల పులులు సంచరించినట్టు ఆధారాలు ఉన్నాయని ఆయన వివరించారు.
 
ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో మూడు వేల నుంచి నాలుగు వేల అడుగుల ఎత్తులో పులుల సంచారాన్ని గుర్తించామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(వైల్డ్ లైఫ్) డీవీఎస్ ఖటి పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది మొదట్లో 12 అడుగులో పులి ఉన్న దృశ్యాలను కెమెరా బంధించినట్టు వివరించారు. ప్రస్తుతం పులిని గుర్తించిన ప్రాంతం నేపాల్‌కు అత్యంత చేరువలో ఉందని, వేటగాళ్లు ఎక్కువగా తిరుగాడే ప్రాంతం కావడంతో ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయటకు వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు. నేపాల్‌తోపాటు రాష్ట్ర పోలీసులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సీమా సురక్షా బల్ బలగాల సహకారంతో అక్కడ నివసిస్తున్న పులుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఖటి తెలిపారు.

లీటరు పెట్రోలు రూ.300, డీజిల్ రూ. 150..

అగర్తలా: ఇదేంటి ఒక్కసారిగా పెట్రో,డీజిల్ రేట్లు ఇంతలా పెరిగాయా అని ఆశ్చర్యపోతున్నారా అవును మీరు వింటున్నది నిజమే ఈ రేట్లు మరెక్కడో కాదు త్రిపురలో. భారీ వర్షాలతో గత రెండు రోజులుగా అగర్తలా అతలాకుతలమవుతోంది. దీంతో ఇదే అదనుగా తీసుకున్న వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల నుంచి పెట్రోలు, డీజీల్ వరకు అన్నింటిపైనా ఒక్కసారిగా రేటు పెంచేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోప్రాంతంలో అసలు నిత్యావసర వస్తువులు కూడా దొరకని పరిస్థితి వచ్చింది.
 
పెట్రో, డీజిల్ రేట్లు అయితే ఆకాశన్నంటాయి. లీటరు పెట్రోలు రూ.300, డీజిల్‌ రూ.150గా అమ్ముతున్నారు. దీంతో సాధారణ ప్రజానికం పరిస్థితి దారుణంగా తయారైంది. పెట్రోలు ధరలు మండుతుండటంతో ప్రజలు ఆందోళనలు చేపట్టారు. సరి-బేసి పద్ధతిలో పెట్రోలు సరఫరాకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకుల ఎదుట టైర్లకు నిప్పుపెట్టి నిరసన చేపట్టారు. ప్రజలు పడుతున్న అవస్థలను చూసిన సర్కార్ నిత్యావసర వస్తువుల కొరతను తీర్చేందుకు ఏర్పాట్లును సిద్ధం చేసింది. రేటు పెంచి నిత్యావసర వస్తువులు గానీ, పెట్రో, డీజిల్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు ప్రభుత్వం హెచ్చరిచ్చింది.

ఎంబీఏ, ఎంసీఏ కనిష్ఠ ఫీజు రూ.27వేలు

             ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ట్యూషన్‌ ఫీజులపై ఏఎ్‌ఫఆర్‌సీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రంలో 349 కాలేజీలు ఎంబీఏను, 132 కాలేజీలు ఎంసీఏ కోర్సును నిర్వహిస్తున్నాయి. మొత్తం 481 కాలేజీల్లో 2016-17 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల బ్లాక్‌ పీరియడ్‌కి సంబంధించిన ట్యూషన్‌ ఫీజులను నిర్ధారించేందుకు ఏఎ్‌ఫఆర్‌సీ సుదీర్ఘ కసరత్తు చేసింది. అనంతరం వాటిని ప్రభుత్వానికి పంపింది. ఇప్పుడు వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ట్యూషన్‌ ఫీజులు తేలాయి. ఎంబీఏ కోర్సుకు గరిష్ఠ ఫీజు రూ. 68 వేలుగా, ఎంసీఏ గరిష్ట ఫీజు రూ.60,500 వేలుగా ఖరారయ్యాయి. ఈ రెండు కోర్సులకు కనిష్ఠ ఫీజు మాత్రం రూ.27 వేలుగా నిర్ధారించారు. దీంతో పాటు 2 ఎంబీఏ కాలేజీలు, 13 ఎంసీఏ కాలేజీలు మూసివేతకు ఏఎ్‌ఫఆర్‌సీ ప్రతిపాదించగా.. వాటికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి సుమితా దావ్రా ఉత్తర్వులిచ్చారు.

రైల్వేస్టేషన్లో వైఫై యూజర్లు@ 20లక్షలు

దేశంలోని 23 రైల్వేస్టేషన్లలో హై స్పీడ్‌ వైఫై సర్వీసులను దాదాపు 20 లక్షల మంది వినియోగించు కుంటున్నారని గూగుల్‌ తెలిపింది. గూగుల్‌ తన ప్రాజెక్టులో భాగంగా భారత్‌లోని పలు రైల్వేస్టేషన్లలో వైఫై సదుపాయాన్ని అందిస్తోంది.
భారత రైల్వే, రైల్‌ టెల్‌తో కలిసి గూగుల్‌ సంస్థ రైల్వేస్టేషన్లలో హైస్పీడ్‌ వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తోందని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ప్రతి నెలా 2 మిలియన్ల ప్రజలు ఈ వైఫై సేవల కోసం లాగిన్‌ అవుతున్నారని.. వారి సొంత నెట్‌వర్క్‌ల కంటే 15 రెట్ల డేటాను వినియోగిస్తున్నారని వెల్లడించారు. ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన వస్తోందని చెప్పారు. ముంబయి సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు ప్రారంభించిన తొలి వారంలోనే లక్ష మంది యూజర్లు లాగిన్‌ అయినట్లు చెప్పారు.

ఎంసెట్‌-3 షెడ్యూల్‌పై కసరత్తు షురూ!

సర్కారు మౌఖిక ఆదేశాలు
  ఆగస్టు చివరి వారంలో పరీక్ష,
సెప్టెంబరు తొలి వారంలో ఫలితాలు?
            ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకైనట్లు సీఐడీ నిర్ధారించిన నేపథ్యంలో ఎంసెట్‌-3 నిర్వహణ షెడ్యూల్‌పై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఒకవేళ పరీక్ష నిర్వహించాల్సి వస్తే ముందస్తుగానే సిద్ధం కావాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు తాత్కాలిక షెడ్యూల్‌ను రూపొందించినట్లు సమాచారం. ఎంసెట్‌ 1, 2లు రద్దుచేస్తే...                  కేవలం ఎంసెట్‌-2ను రద్దుచేస్తే మళ్లీ ప్రకటన జారీచేసే అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎంసెట్‌-1ను కూడా రద్దుచేస్తే మాత్రం మళ్లీ తాజాగా ప్రకటన జారీచేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఫలితాల విడుదలకు దాదాపు 40 రోజుల సమయం పడుతుంది. అందువల్ల ఆగస్టు చివరి వారంలో పరీక్ష నిర్వహించి, సెప్టెంబరు మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని తాత్సాలిక షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఎంసెట్‌-3కి కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ వీసీ వేణుగోపాల్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. ఎంసెట్‌కు ఆయనే ఛైర్మన్‌గా ఉన్నందున రిజిస్ట్రార్‌ యాదయ్య పేరును ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది. ఆయన కొన్నేళ్లుగా ఈసెట్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంసెట్‌-3 పరీక్షను వేగంగా పూర్తిచేసేందుకు ఆ అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Friday, 29 July 2016

ఆదాయపన్ను దాఖలుకు గడువు పొడిగింపు

         ఆదాయపన్ను రిటర్నుల దాఖలకు గడువు పెరిగింది. ఆగస్టు 5 వరకు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.
        ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం ప్రీమియం చెల్లింపు ఆగస్టు 2వరకు పొడిగించారు.

గంటకొకరిని చొప్పున 24 మందిని అత్యంత కిరాతకంగా..

బీరుట్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరోమారు దారుణ మారణకాండకు తెగబడ్డారు. ఉత్తర సిరియాలోని ఓ గ్రామాన్ని సీజ్ చేసిన ఉగ్రవాదులు గంటకొకరిని చొప్పున 24 గంటల్లో 24 మందిని ఊచకోత కోశారు. టర్కీ బోర్డర్, ఐఎస్ డి ఫేక్టో రాజధాని రఖ్ఖా పట్టణం మధ్యలో మన్బిజ్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాన్ని దిగ్బంధించిన ఉగ్రవాదులు దొరికిని వారిని దొరికినట్టు చంపేశారు. గురువారం ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న ఉగ్రవాదులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. గత ఐదేళ్లుగా సిరియాలో జరుగుతున్న సంఘర్షణ కారణంగా ఇప్పటి వరకు 2.80 లక్షల మంది మృతి చెందగా లక్షలాది మంది తరలిపోయారు.

కబాలికి బాహుబలి చెక్!

‘కబాలి’ సినిమా విడుదల దగ్గరపడేకొద్దీ సినీ ప్రేక్షకులందరిటీ ఒకటే ఆలోచన.. ఈ సినిమా ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుందా? లేదా? చేస్తే ఏ రేంజ్‌లో బ్రేక్ చేస్తుంది? అయితే, సినిమా విడుదల తర్వాత నెగటివ్ టాక్ రావడంతో ‘బాహుబలి’ సేఫ్ అనుకున్నారంతా. కానీ, నెగటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లతో పాటు, రికార్డులను తిరగరాయడంతో ‘కబాలి’ వెనకడుగేయలేదు. బాహుబలి, సుల్తాన్, బజరంగీ భాయిజాన్ చిత్రాల పలు రికార్డులను ‘కబాలి’ బ్రేక్ చేసి రజనీ తన మేనియా ఏంటో చూపించాడు. అయితే, కబాలి వచ్చి రోజులు గడిచిందో లేదో బాహుబలి.. ఆ రికార్డులను దున్నేయడం మొదలుపెట్టాడు. రాజమౌళి చాలా వేగంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’తో కబాలి రికార్డులను బద్దలు కొట్టాలని రాజమౌళి బృందం ఆలోచిస్తోంది. అనుకున్నదే తడవుగా, ఆ రికార్డుల పరంపర లాంచనంగా ప్రారంభమైంది. ఇంకా రిలీజ్‌కు 9నెలల టైం ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభించిన బాహుబలి 2 మలయాళ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ.10.5కోట్లకు కొనుగోలు చేసింది. కబాలి హక్కులకోసం మోహన్‌లాల్ రూ.7.5కోట్లు చెల్లించారు. కేరళలో మొదలైన బాహుబలి రికార్డుల ప్రభంజనం ఎక్కడా ఆగుతుందో.. మరికొంత కాలం ఆగితే కానీ తెలియదు.

ఏ ఛానల్‌లో ఏ సినిమా!

వారాంతంలో బుల్లితెర ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తేందుకు దాదాపు 15 ఛానెళ్లు 100 సినిమాలను ప్రసారం చేయనున్నాయి. మరి మిమ్మల్ని వెండితెరపై ఎంతగానో అలరించిన ఆ సినిమాలు ఏ ఛానెల్లో ప్రసారం కానున్నాయో తెలుసుకోవాలనుందా.. 
అయితే వివరాల కోసం క్లిక్‌ చేయండి...

http://www.eenadu.net/tv-movie-listings/tv-listings.aspx?lang=Telugu&day=saturday 

హెచ్‌ఐవీ కంటే ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్‌

కలుషిత నీళ్లు, ఆహారంతో ముప్పు 

  • హెప టైటిస్‌-బీ, సీ-ఇన్‌ఫెక్షన్లూ ముప్పే.. 
ఆదిలో గుర్తిస్తేనే నియంత్రణ హెచ్‌ఐవీ కంటే ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్‌ హెపటైటిస్‌. ఆదిలో గుర్తించేకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఇది సైలెంట్‌ కిల్లర్‌. ఒకసారి శరీరంలోకి ప్రవేశించిందంటే చాలు..ఇక తన పని తాను చేసుకుంటూ పోతోంది. 5 రకాల ఇన్‌ఫెక్షన్లతో శరీరాన్ని నాశనం చేస్తోంది.
హెపటైటిస్-బీ, హెపటైటిస్ -సీ ఎక్కువగా జనంపై దాడిచేస్తున్నాయి.
 
హెపటైటిస్-బీతో 3.4 శాతం, హెపటైటిస్-సీతో 1శాతం ప్రజలు బాధపడుతున్నారు. నగరంలో గర్భిణిల్లో 1శాతం హెపటైటిస్తో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. శరీరంలో హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందనే విషయం చాలామందికి తెలియదు. తెలిసే లోపే జరగరాని నష్టంజరిగిపోతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏడాదీ జూలై 28న హెపటైటిస్‌-బీ వైర్‌సను కొనుగొన్న ప్రొఫెసర్‌ బ్లంబెర్గ్‌ జయంతి సందర్భంగా వరల్డ్‌ హెపటైటిస్‌ డేను నిర్వహిస్తున్నారు. ప్రజల్లో హెపటైటిస్‌పై మరింత అవగాహన పెంచడానికి ఈ ఏడాది ‘ప్రతి ఒక్కరూ హెపటైటిస్‌ నివారణకు’ కృషి చేయాలనే థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
 
పొంచి ఉన్న వైరస్‌ ముప్పు :-
అప్రమత్తంగా లేకుంటే ఈ హెపటైటిస్‌ వైరస్‌ దాడిచేయడానికి సిద్ధంగా ఉంటుందని వైద్యులు వివరించారు. హెపటైటిస్‌ ఏ, బీ, సీ, డీ, ఈ అనే అయిదు రకాల ఇన్‌ఫెక్షన్లు ప్రజలపై దాడిచేస్తాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఇన్‌ఫెక్షన్ల కారణంగా దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతింటుందన్నారు. హెపటైటిస్‌- ఏ, హెపటైటిస్-ఈ వైర్‌సలు కామెర్లతో బాధపడే వారిలో కనిపిస్తాయని తెలిపారు. హెపటైటిస్-డీవైరస్‌ రక్త మార్పిడి సమయంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ‘ఈ’ వైరస్‌ రక్తం మరకలపై వారం వరకు బతికే ఉంటుందని, ఈ సమయంలో ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఇన్‌ఫెక్షన్‌బ్లడ్‌, ఫ్లూయిడ్‌ ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదముందన్నారు. హెపటైటిస్‌ ‘ఈ’ వైరస్‌ అపరిశుభ్రత నీటి వల్ల కూడా వ్యాపిస్తోందని వైద్యులు వివరించారు.
 
బీ, సీ ఇన్‌ఫెక్షన్ల తో లివర్‌ సిర్రోసిస్‌ :-
హెపటైటిస్‌ బీ, సీ వైరస్‌లను నిర్లక్ష్యం చేస్తే లివర్‌ సిర్రోసిస్‌కు దారితీసే ప్రమాదముందని వైద్యులు వివరించారు. లివర్‌ సిర్రోసిస్‌ వల్ల కాలేయం పూర్తిగా చెడిపోయి రక్తం కారుతోం దన్నారు. చివరకు కేన్సర్‌కు దారితీయొచ్చని, కొన్నిసార్లు కాలేయ పనితీరు ఆగిపోయే ప్రమాదముందని డాక్టర్లు తెలిపారు.
 
ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు కనిపించవు:-
హెపటైటిస్‌ జబ్బుకాదు. ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఇది వ్యాపిస్తోంది. ఇన్‌ఫెక్షన్లతో ప్రతి ఏటా ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్ల లక్షణాలు కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాధి సోకిన నెలరోజుల వరకు కానీ లక్షణాలు బయటకు కనిపించవు. అప్పటికే ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవని తెలిసిన వెంటనే వైద్యుల సలహాప్రకారం చికిత్సలు తీసుకుంటూ పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పే. కలుషిత నీటి వల్ల ఇన్‌ఫెక్షన్లు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 - డాక్టర్‌ కిరణ్‌పెద్ది, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, గ్లోబల్‌ ఆస్పత్రి
 
ముందు జాగ్రత్తతో నియంత్రణ :-
హెపటైటిస్ను ముందుజాగ్రత్తతో నియంత్రించొచ్చు. ప్రధానంగా మూడు రకాల జాగ్రత్తలతో ఇన్‌ఫెక్షన్లను అరికట్టే అవకాశముంది. ముందుగా హెపైటిస్‌ రాకుండా నివారించడం, వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకోవడం, రోగి వైద్యుల వద్ద కౌన్సెలింగ్‌ తీసుకోవడం ప్రధానంగా చేయాలి. హెపటైటిస్పై అవగాహన పెంచుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లను ఆదిలోనే గుర్తించి చికిత్సలు తీసుకో వొచ్చు. ఈ ఇన్‌పెక్షన్లను వ్యాక్సిన్లతో నియంత్రించే అవకాశాలున్నాయి. అన్నిరకాల హెపటైటిస్‌ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.
- డాక్టర్‌ కెఎస్‌.సోమశేఖర్‌రావు, గ్యాసో్ట్ర ఎంటరాలజిస్టు, అపోలో ఆస్పత్రి
 
హెపటైటీస్‌ ఇలా:-
  •  మలవ్యర్థాలు తాగునీటిలో కలవడం వల్ల హెపటైటిస్-ఏ వచ్చే అవకాశముంది. 
  • తల్లి నుంచి బిడ్డకు, ఒకరు వినియోగించిన ఇంజెక్షన్లు మరొకరు వాడడం, సెక్స్‌ద్వారా హెపటైటిస్-బీ, డీ వస్తుంది. 
  •  సరిగ్గా స్టెరిలైజ్‌ చేయకుండా వాడే వైద్య పరికారాలు, మరొకరు వాడిన ఇంజెక్షన్ల వల్ల హెపటైటిస్-సీ రావొచ్చు. 
  •  కలుషిత నీటివల్ల హెపటైటిస్- ఈ వస్తోంది. 
  •  పెరినటల్‌ ట్రాన్స్‌మిటెడ్‌ (మాయ) ద్వారా ఈ వ్యాధి బిడ్డకు సంక్రమించే ప్రమాదముంది. 
  •  ఆస్పత్రుల్లో ప్రసవ సమయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రమాదముంది. 
  •  ఆస్పత్రుల్లో సిబ్బంది గ్లౌజులను సక్రమంగా వినియోగించకపోవడం వల్ల కూడా రావొచ్చు. 
  •  పిల్లలు ఆడుకునే సమయంలో ఒకరి నుంచి మరొరికి ఈ వ్యాధి సంక్రమించొచ్చు. 
  • శరీరంపై గాట్లు ఉన్న వ్యక్తిని తగిలితే ఇతరులకు ఈ వ్యాధి రావొచ్చు. 
  •  వినియోగించిన డ్రగ్స్‌, నీడిల్స్‌, రక్షణ లేని ఇంజెక్షన్ల ద్వారా ఈ వైరస్‌ సోకొచ్చు. 
  • ఒకరు వినియోగించిన టూత్‌ బ్రెష్‌లు, బ్లేడ్‌లను మరొకరు వాడితే వైరస్‌ రావొచ్చు.
 

జిల్లావాహనదారులతో ‘నెంబర్‌’ గేమ్‌!

హై సెక్యూరిటీ రిజిస్ర్టేషన్‌ నంబర్‌ ప్లేట్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) అంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. నెంబర్‌ప్లేట్‌ కోసం రిజిస్ర్టేషన్‌ ఫీజు చెల్లించడం మొదలుకొని దాన్ని వాహనానికి బిగించుకునే వరకు గంటలు, రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వాహనం రిజిస్ర్టేషన్‌ అయిన వారం రోజుల్లో దాని బిగించాల్సి ఉన్నా ఆ సమయానికి అవి తయారు కావడం లేదు. వాటిని బిగించుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రత్యే కంగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇలా వాహనదారులు హై సెక్యూరిటీ రిజిస్ర్టేషన్‌ నెంబర్‌ ప్లేట్‌లతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. 2013 నుంచి కేంద్ర ప్రభుత్వం హై సెక్యూరిటీ రిజిస్ర్టేషన్‌ నంబర్‌ ప్లేట్‌ విధానాన్ని అమలు చేసింది. 2013 నుంచి కొత్తగా రిజిస్ర్టేషన్‌ అయ్యే ప్రతి వాహనానికి ఈ నెంబ ర్‌ ప్లేట్‌లు ఉండాలని నిర్ణయించారు. తెలంగాణ రాషా్ట్ర నికి సంబంధించి లింక్‌ ఆటో టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ కాంట్రాక్టును పొందింది. అప్పటి నుంచి ఈ సంస్థే ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో ఒక హెచ్‌ఎస్‌ఆర్‌పీ కేంద్రా న్ని ఏర్పాటు చేసి కొత్త వాహనదారుల నుంచి వారే స్వయంగా రిజిస్ర్టేషన్‌ ఫీజులను వసూలు చేయడం, తర్వాత వాటిని తయారు చేసి బిగించడం వారి బాధ్య త. గ్రేటర్‌ పరిధిలో ఉన్న 11ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ఉన్న హెచ్‌ఎస్‌ఆర్‌పీ కేంద్రాల్లో ఇలాంటి ఇబ్బందులే నిత్యకృత్యంగా మారాయి. నంబర్‌ ప్లేట్‌ బిగించుకోవడానికి ఉన్నతాధికారులతో పైరవీ చేయిం చుకోవాల్సిన పరిస్థితి. ఎన్నో భద్రతా ప్రమాణాలతో రూపొందించిన హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లలో నాణ్య త ప్రమాణాలు ఏమాత్రమూ లేవని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. చిన్నపాటి ప్రమాదం జరిగిన ప్పుడు నంబర్‌ ప్లేట్‌ వంగిపోతోంది. దానిపై ఉన్న అక్షరాలు, నల్లని రంగు చెదిరిపోతోంది. రవాణా శాఖ చెబుతున్నట్లుగా ఇందులో ఉన్నతస్థాయి భద్రతా ప్రమాణాలు కనిపించడం లేదు. వీటిని తయారు చేసే కాంట్రాక్టర్‌కు లాభదాయకంగా ఉందని వాహన దారులు ఆరోపిస్తున్నారు.
రవాణా శాఖ అంటేనే ఏజెంట్లు. ప్రతి పనికి మామూళ్లు ఇవ్వనిదే పనిజరగదు అనే మాట అందరి నోటా వినిపిస్తూ ఉంటుంది. తాజాగా నెంబర్‌ప్లేట్‌ లను వాహనాలకు బిగించడానికి మామూళ్లు డిమాం డు చేస్తున్నారు. వాహన రిజిస్ర్టేషన్‌ సమయంలోనే ఆయా వాహన కేటగిరీ ప్రకారం ఫీజులను వసూలు చేస్తారు. వారం రోజుల తర్వాత వచ్చి హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌ను బిగించుకోవాలి. ఆ సమయంలో ఏమీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. వాహనాల రిజిస్ర్టేషన్‌ సమయంలోనే రద్దీ ఉన్నట్లుగానే నెంబర్‌ ప్లేట్‌ బిగించు కునే సమయంలోనూ రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో అక్కడి సిబ్బందికి మామూళ్లు ఇస్తామంటేనే త్వరగా బిగించేస్తున్నారు. లేదంటే ఆగండి అంటూ సమాధానం చెబుతున్నారని వాహనదారులు వాపోతు న్నారు. దీనిపై పలుమార్లు వాహనదారులు ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి.
హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లపై తరచూ ఫిర్యాదులు రావడం పరిపాటిగా మారింది. దీనిపై నిర్వాహకులను హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదు. మళ్లీ అవే ఫిర్యాదులు వస్తుండడంతో రవాణా శాఖ అధికా రులు కొత్తగా వాహనదారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ఒక దరఖాస్తు ఫారాన్ని వాహనదారులకు ఇచ్చి పలు అంశాలపై వారి నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా హెచ్‌ఎస్‌ఆర్‌పీ నెంబర్‌ ప్లేట్‌ కోసం ఫీజు ఎప్పుడు చెల్లించారు, దానికి సంబంధించిన మేసేజ్‌ మీ ఫోన్‌కు ఎప్పుడు వచ్చింది. నెంబర్‌ ప్లేట్‌ కోసం ఎన్నిమార్లు వెళ్లారు. బిగించడానికి డబ్బులు తీసుకున్నారా వంటి విషయాలను వాహనదా రుల నుంచి తీసుకుంటున్నారు. ఇలా గ్రేటర్‌ హైదరా బాద్‌ పరిధిలోని 11 ఆర్టీఏ కార్యాలయాల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ పత్రాలు తీసుకొని వాటిని రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయానికి పంపుతున్నారు. వాహనదారుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నిర్వాహ కులపై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఆరో తరగతిలో ప్రేమలో పడ్డారు.. ఆపై ఏం జరిగిందంటే

మనం ఎన్నో లవ్ స్టోరీలు విని ఉంటాం.. ఎంతోమంది లవ్ బర్డ్స్‌‌ను, వాళ్లు పడే కష్టాలను, ఆనందాలను కళ్లారా చూసి ఉంటాం. టీచర్లను స్టూడెంట్లు ప్రేమించడం చూశాం.. వయసు తారతమ్యాలు లేని ప్రేమికులు.. ఇలా చాలానే లవ్ స్టోరీ వినే ఉంటాం. బహుశా ఇప్పుడు మీరు చదవబోయే లవ్ స్టోరీ ఎప్పుడూ ఎక్కడా విని ఉండరు.. సినిమాల్లో,సీరియల్స్‌‌లో కూడా చూసి ఉండరు.
 
వాళ్లిద్దరు ప్రేమలో పడ్డారు.. వారి వయసెంతో తెలిస్తే అవాక్కవుతారు. ఇద్దరూ చదువుతోంది ఆరో తరగతే.. అప్పటికే ఇద్దరూ ప్రేమ మైకంలో మునిగితేలారు. అంతేకాదు పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి ఎక్కడైనా ఆశ్రయం పొందాలనుకున్న సమయంలో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.ఈ చిన్నారి ప్రేమ కథ గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. నగరంలోని ఓ ప్రముఖ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండు రోజుల క్రితం(బుధవారం) స్కూలుకెళ్లి అటునుంచే పారిపోయారు. పోతూ పోతూ ఇంట్లోంచి ఓ సెల్‌ఫోన్ తీసుకుని పారిపోయాడు అబ్బాయి. సాయంత్రం అయినా ఇళ్లకు రాలేదు. పైగా ఫోన్ కూడా కలవకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు.
 
అప్పటికే ఈ ప్రేమ జంట ఆశ్రయం పొందెందుకు ఇళ్లు కోసం వెతికే పనిలో పడ్డారు. ఎంత ప్రయత్నించినా అద్దెఇల్లు దొరకలేదు. పిల్లలిద్దరూ స్కూల్ యూనిఫాం, బ్యాగులతో ఉండటంతో ఎవరు గదులు ఇవ్వలేదు. అప్పటి వరకు స్విచాఫ్‌‌లో ఉన్న ఫోన్‌ను ఆన్ చేసి తన మిత్రుడికి ఫోన్ చేశాడు. ఇంతలో అప్పటి వరకు సిగ్నల్ కనుగునే పనిమీదున్న అహ్మదాబాద్ సైబర్ క్రైం పోలీసులు ట్రాక్ చేసి ఎట్టకేలకు వాళ్ల ఆచూకీ కనిపెట్టేశారు. పోలీసులు, పిల్లల తల్లిదండ్రులు వారున్న నడియార్‌కు వెళ్లి ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకు ఇంట్లోనుంచి పారిపోయారని పిల్లలను ప్రశ్నించగా లవ్ స్టోరీ మొత్తం చెప్పారు.. దీంతో మీరు ప్రేమించుకున్నారా అందుకే ఇంట్లోనుంచి వెళ్లిపోయారా అని తెగ నవ్వుకున్నారు. ఈ లవ్ స్టోరీ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు ఈ చిన్నారి ప్రేమకథ గురించి విని తెగ కామెంట్లు చేస్తున్నారు.

అత్యాచారానికి గురైన తర్వాత లవర్‌తో కలిసి ప్రపంచంలోనే ఎవరూ చేయని పని చేసింది..


ఫ్లోరిడా: ఫ్లోరిడాలో 21 సంవత్సరాల యువతి తన చిన్నతనంలో తీవ్రమైన లైంగిక వేధింపులకు గురైంది. యుక్త వయసు వచ్చినప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలను తనను వీడటంలేదు. మెడిటేషన్ చేసింది, కౌన్సిలింగ్, సైకోతెరపీ ట్రీట్‌మెంట్ తీసుకుంది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా ఫలితం లేకపోయింది. తనను ఆ రోజులు తరుముతూనే ఉన్నాయి. అయితే 24 సంవత్సరాల తన లవర్‌తో కలిసి ఆమె చేసిన ప్రయోగం బహుశా ప్రపంచంలోనే ఎవరూ చేసి ఉండరు. యుక్త వయసులో తన చిన్నతనాన్ని మళ్లీ గడుపుతూ ఆశ్వాదిస్తోంది. చిన్నప్పటిలా బేబీ నర్సరీలాంటి వాతావరణంలో ప్రతి రోజూ గడుపుతోంది. చిన్నపిల్లల బట్టలనే వేసుకుంటోంది, డయాఫర్స్‌ను సైతం వాడుతోంది. నోట్లో పాలపీపా పెట్టుకుని తాగుతోంది కూడా. తన ప్రవర్తన కూడా అచ్చం చిన్న పిల్లల మాదిరిగా మార్చుకుంది. తన లవర్‌తో కలిసి ఆడుకుంటోంది.
ఈ విధంగా చేయడంతో బాల్యంలో తనకు ఏమీ జరగలేదని, అంతా బాగుందనే భావనకోసం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం చేయడం వల్ల తనలో ఆత్మవిస్వాసం పెరిగిందని చెబుతోంది. గత కొన్నెళ్లుగా తాను అనుభవిస్తోన్న బాధకర జీవితానికి ఉపశమనం కలుగుతోందని చెబుతోంది. తన ఇన్నేళ్లుగా చేసిన ప్రయత్నాల వల్ల కలగని ప్రయోజనం ఈ ప్రయోగం వల్ల కలిగిందని చెబుతోంది జెస్. యుక్త వయసులో తన చిన్నపిల్ల జీవితాన్ని వీడియోలో మీరూ చూడండి...

జాగ్రత్త ! వాట్సప్‌లో డిలీట్ మెస్సెజ్‌ల రహస్యం బయటపడింది..

సన్నిహితులతో చాట్ చేసేందుకు చాలామంది వాట్సప్ తప్పకుండా వాడుతుంటారు. అయితే వాటిలో కొన్ని వ్యక్తిగత, రహస్య చాట్‌లు కూడా ఉంటాయి. వాటిని వెంటనే డిలీట్ చేసేసి హమ్మయ్య అని ఊరుకుంటారు. కానీ అవి పూర్తిగా డిలీట్ కావట. స్క్రీన్ నుంచి డిలీట్ అయినట్టు కనిపించినా అదే స్మార్ట్ ఫోన్ లో ఆప్‌ బ్యాకప్‌లో స్టోర్ చేయబడి ఉంటాయిట. ఇది వ్యక్తిగత మెస్సేజ్ అయినా లేదా గ్రూప్ చాట్ అయినా సరే.
 
ఐఓయస్ పరిశోధకుడు జొనాథన్ ఈ విషయాలను బయటపెట్టాడు. ఐపోన్‌ నుంచి వచ్చిన డిస్క్ ఇమేజెస్‌ను వాట్సప్ కొత్త వర్షన్‌తో పరిశీలిస్తున్నప్పుడు ఈ విషయాన్ని కనుగొన్నాడట. డిలీట్ చేసిన సందేశాలను ఈ ఆప్ భద్రపరుస్తుందని తెలిపాడు. దీనివల్ల తొలగించబడిన మెస్సేజ్‌లను తిరిగి పొందడానికి అవకాశముందన్నమాట. తొలగిపోయిన మెస్సేజ్‌లను రిమోట్ బ్యాకప్ ద్వారా కూడా పొందే అవకాశం కూడా ఉంటుందని జొనాథన్ వివరించాడు.
 
దీని వల్ల చింతించాల్సిన అవసరం ఉందా?
నిజానికి సున్నితమైన వ్యక్తిగత విషయాలు వాట్సప్‌లో ప్రస్తావించకపోతే చింతించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ వాట్సప్ గురించి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
 
ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి?
  • డిలీట్ చేయబడిన మెస్సేజ్‌లను కొన్ని చట్టబద్ధమైన మార్గాల ద్వారా తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది.
  • ఇతరులు వ్యక్తులు మన ఫోన్‌లో కొన్ని మార్పులు చేసి, తేలికగా బ్యాకప్ ఏర్పాటు చేయగలుగుతారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఫింగర్ ప్రింట్, పాస్ కోడ్ వంటివి ఏర్పాటు చేసుకోవాలి.
  • మన కంప్యూటర్‌ను ఎవరైనా ఉపయోగిస్తే మన రహస్య మెస్సేజ్‌లను చూడటానికి లేక డిలీట్ చేసిన వాటిని రీప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతకుముందే ఉన్న బ్యాకప్ ద్వారా కానీ లేదా ఎన్‌స్క్రిప్ట్ చేయబడని బ్యాకప్ ద్వారా గానీ తిరిగి పొందుతారు. కొన్ని పాస్‌వర్డ్ బ్రేకింగ్ టూల్స్‌ను ఉపయోగించి పాస్‌వర్డ్‌ను తిరిగి పొందేందుకు కూడా అవకాశముంది.
  • వాట్సప్ అప్‌డేటెడ్ వర్షన్ రాకముందు ఈ అవకాశం ఉండేది కాదు.

అక్కడ భర్తల్ని రాచిరంపాన పెడతారట!

కైరో: మనదేశంలోనే కాదు చాలా దేశాల్లో ఎక్కువగా భార్యను రాచిరంపాన పెట్టే భర్తలనే చూస్తుంటాం. కానీ ఈజిప్ట్‌లో మాత్రం పరిస్థితి అందుకు రివర్స్‌లో ఉంటుంది. అక్కడి ఆడవాళ్లు భర్తల్ని చితకబాదేస్తారట. ఈజిప్ట్‌లోని ఫ్యామిలీ న్యాయస్థానం తాజాగా విడుదల చేసిన నివేదికలో 28 శాతం మహిళలు భర్తల్ని ఉతికి ఆరేస్తారని వెల్లడైంది.
అదీకాకుండా ఈ ఏడాదిలోనే ఈజిప్ట్‌కి చెందిన 66 శాతం దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట. అక్కడ భార్య చేతిలో దెబ్బలు తినే భర్తలు భార్యలను తిరిగి కొట్టలేని పరిస్థితి. వారిని ఒక్కమాట అన్నా.. తిరిగి చేయిచేసుకున్నా తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అక్కడి చట్టాలు మహిళలకు ఆ రక్షణ కల్పించాయి. కాబట్టి భార్య చేతిలో దెబ్బలు తినే భర్తలు వారిపై కేసు పెట్టడం తప్ప ఇంకేం చేయడానికి లేదు. తాజాగా వెల్లడైన నివేదికలో ఇలాంటి కేసులు దాదాపు 6,000వరకు నమోదయ్యాయి.
కొందరు మహిళలు వారి భర్తల్ని ఏకంగా బెల్టులతోనూ బాదేస్తారట. ఒక్కోసారి వారు తినే తిండిలో నిద్రమాత్రలు కూడా కలుపుతుంటారట. ప్రపంచంలో భర్తల్ని హింసపెట్టే మహిళలుగా ఈజిప్ట్‌ స్త్రీలే మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో అమెరికా(23 శాతం), యూకే(17 శాతం), భారత్‌(11 శాతం)దేశాలు ఉన్నాయి.

భారత్‌ × వెస్టిండీస్‌ టీ20 అమెరికాలో..?

వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ ముగిసిన అనంతరం భారత్‌ జట్టు ఓ టీ20 సిరీస్‌ను కూడా కరీబియన్లతో ఆడనున్నట్లు సమాచారం. టెస్టు సిరీస్‌ ఆగస్టు 22న ముగియనుండగా.. అనంతరం ఇదే నెల చివరి వారంలో ఈ టీ20 సిరీస్‌ను అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించేందుకు చర్చలు జరుపుతున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు కూడా మ్యాచ్‌ల నిర్వహణపై అక్కడి స్టేడియం మేనేజర్‌తో అధికారకంగా సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టెస్టు జట్టులోని 15 మంది సభ్యుల్లో 8 మంది టీ20 ఆటగాళ్లు కూడా ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అమెరికాలో టీ20 సిరీస్‌ నిర్వహణపై ఐసీసీ అనుమతి కోసం సంప్రదింపులు జరుపుతున్న వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు అనుమతిరాగానే అధికారిక నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఐఫోన్‌ 7 ఇలా ఉంటుందట


కొత్త ఆపిల్‌ ఫోన్‌ వస్తోందంటే చాలు... స్టార్‌ హీరో సినిమాల రేంజులో దాని మీద అంచనాలు ఉంటాయి. ఆప్షన్స్‌ ఏంటి, ధర ఎంత? అంటూ వూసులు మొదలైపోతాయి. సెప్టెంబరులో ఐఫోన్‌ 7 విడుదలవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐఫోన్‌ 7 స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉంటాయంటూ ప్రపంచ మొబైల్‌ మార్కెట్‌లో కథనాలు మొదలయ్యాయి. కొత్త ఆపిల్‌ ఫోన్‌ కనీస స్టోరేజీ సామర్థ్యం 32 జీబీ ఉంటుందంటున్నారు. సరికొత్త త్రీడీ టెక్నాలజీ టచ్‌తో యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కొత్తగా ఉండబోతోందట. ఆపిల్‌ ఫోన్‌లు ఎక్కువగా తెలుపు, బంగారం, గ్రాఫైట్‌ రంగుల్లోనే ఉంటాయి. ఐఫోన్‌ 5సి మాత్రమే రంగుల్లో వచ్చింది. ఇప్పుడు ఐఫోన్‌ 7 రంగులతో వస్తుందని భోగట్టా. అప్‌డేటడ్‌ కెమెరా, మెరుగైన ఆడియో జాక్‌ ఉండబోతున్నాయి. ఆపిల్‌ నుంచి ఆఖరిగా వచ్చిన ఐఫోన్‌ 6ఎస్‌ 7.1 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్‌7 దాని కంటే పలుచగా ఉంటుందని సమాచారం.

‘రజనీకాంత్‌కు ‘భారతరత్న’ ఇవ్వండి’

భారత అత్యుత్తమ పురస్కారమైన ‘భారతరత్న’ను దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఇవ్వాలట. ఈ డిమాండ్‌ చేసింది ఆయనంటే పడిచచ్చే ఓ వీరాభిమాని కాదు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అనిల్‌ గోటే. ఆయన కేవలం ఈ డిమండ్‌ చేసి ఊరుకోలేదు. రజనీకాంత్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రతిపాదించారు. పనిలోపనిగా ‘మహారాష్ట్ర భూషణ్‌’ అవార్డు కూడా రజనీకి ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరారు.
 
రజనీకాంత్‌ మహారాష్ట్ర ‘భూమిపుత్రుడ’ని, ఆయనకు అన్ని అవార్డులూ అందుకునే అర్హత ఉందని అనిల్‌ అన్నారు. అభిమానులకు రజనీ దేవుడితో సమానమని, తాజా సినిమా విజయమే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. రజనీకాంత్‌ను గౌరవించుకోవాల్సిన అవసరం మహారాష్ట్రకు, అలాగే కేంద్రానికీ ఉందని ఆయన వెల్లడించారు. రజనీకాంత్‌ పుట్టింది మహారాష్ట్రలో అనే విషయం తెలిసిందే. అక్కడ నుంచి కర్ణాటకకు మారి, ఆపై మద్రాస్‌ వచ్చి సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా వెలుగొందారు.

Thursday, 28 July 2016

వాట్సాప్‌లో కొత్త మెరుపులు..!

అంతా వాట్సాప్‌మయం... ఇప్పుడు మెసేజ్‌లూ అందులోనే... మాటలు అందులోనే... త్వరలో వీడియో కాల్స్‌ కూడా! కొత్త సొబగులతో వాట్సాప్‌ కాంతులీనుతోంది.
వాట్సాప్‌ వచ్చిన ముందు... వాట్సాప్‌ వచ్చిన తర్వాత! మెసేజింగ్‌, కాల్స్‌ గురించి మాట్లాడినప్పుడు ఇలానే చెప్పాలి. వాట్సాప్‌ అంతగా ప్రభావం చూపిస్తోంది. ‘మెసేజ్‌ పంపించు’ స్థానంలో ‘వాట్సాప్‌ చేయ్‌’ వచ్చేసింది. అంతగా వాట్సాప్‌లో ఏముంది అనుకుంటూ దాన్ని వాడిన వారు... ఇందులో చాలా ఉంది అంటూ దాన్ని వదులుకోలేకపోతున్నారు. వాట్సాప్‌లో ఇటీవల కొన్ని కొత్త ఆప్షన్లు కలిశాయి. త్వరలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు కలవబోతున్నాయి. 
ఎన్‌క్రిప్ట్‌ చేద్దాం  

వాట్సాప్‌లో మీ ఉన్నతాధికారితో ఆఫీసు విషయాలు మాట్లాడు తున్నారు...  మీ శ్రీమతితో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటు న్నారు. అయితే మీ ఫోన్‌లో వాడే థర్డ్‌ పార్టీ ఆప్‌లు మీ ఛాట్‌ హిస్టరీని యాక్సెస్‌ చేస్తే. ఈ ఇబ్బందిని ‘ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌’ ద్వారా వాట్సాప్‌ దూరం చేసింది. మీ వాట్సాప్‌ అకౌంట్‌ను ఒక్కసారి ఎన్‌క్రిప్ట్‌ చేసుకున్నాక ఇక మీ సమాచారం సేఫ్‌ అంటోంది వాట్సాప్‌. అంటే మీరు, మీరు చాట్‌ చేసిన వ్యక్తి మాత్రమే ఆ సమాచారం చూడగలరు. థర్డ్‌ పార్టీ ఆప్‌లు ఆ సమాచారాన్ని యాక్సెస్‌ చేయలేవు. దీని కోసం మీరు ప్రత్యేకంగా ఎన్‌క్రిప్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌ ఆప్‌ అప్‌డేటడ్‌ వెర్షన్‌ వాడుతుంటే చాలు.


ఎవరు చూశారు

వాట్సాప్‌ గ్రూపులో ఓ విషయాన్ని సభ్యులతో పంచుకున్నారు. అందులో ఎంతమందికి ఆ మెసేజ్‌ చేరింది, ఆ మెసేజ్‌ ఎవరెవరు చూశారు అనేది గతంలో తెలిసేది కాదు. వ్యక్తిగత ఛాటింగ్‌లో రీడ్‌ రిసిప్ట్స్‌ ఆప్షన్‌ ఉన్నా గ్రూపులో ఈ సౌకర్యం ఉండేది కాదు. ఇటీవల ఆ అవకాశమూ వచ్చింది. గ్రూపులో మీరు పంపిన మెసేజ్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేస్తే పైన ‘ఇన్ఫర్మేషన్‌’ ఐకాన్‌ వస్తుంది. దాన్ని ఒత్తితే ఆ మెసేజ్‌ ఎవరికి చేరింది, ఎవరు ఎప్పుడు చూశారనే విషయాలు తెలుసుకోవచ్చు.
సమాధానం కొత్తగా
వాట్సాప్‌ గ్రూపులో స్నేహితులతో చాట్‌ చేస్తున్నారు. ఓ అంశంపై ఐదుగురు స్నేహితులు సమాధానం ఇచ్చారు. అయితే అందరికీ ఒకే సమాధానం ఇవ్వడం కుదరదు. అలాగని మీరనుకున్న సమాధానాన్ని గ్రూపులో పోస్టు చేస్తే అది ఎవరికో తెలియక వాళ్లు తికమకపడతారు. వాళ్ల పేరు రాసి... ఆ తర్వాత మీ సమాధానం చెప్పాలి అంటే అసలు వాళ్లు ఏమన్నారో... మీరు దేనికి సమాధానమిస్తున్నారో తెలియాలి. ఈ ఇబ్బందంతా లేకుండా వాట్సాప్‌ గ్రూప్‌ ఛాట్‌లో రిప్లై ఆప్షన్‌ వచ్చింది. మీరు ఏ మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలో ఆ మెసేజ్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేస్తే పైన పేరు పక్కన రిప్లై గుర్తు కనిపిస్తుంది. దాన్ని ఒత్తితే మీరు మెసేజ్‌ చేసే ఆప్షన్‌ వస్తుంది. మెసేజ్‌ రాసి ఎంటర్‌ బటన్‌ ఒత్తితే... ఆ ప్రశ్న, మీ సమాధానం ఒకదాని దిగువ ఇంకొకటి కనిపిస్తాయి.

అన్నీ పంచుకో
వాట్సాప్‌లో తొలుత కేవలం మెసేజ్‌లు, ఫొటోలు మాత్రమే పంపించుకునే వీలుండేది. ఆ తర్వాత లొకేషన్‌ షేరింగ్‌, కాంటాక్ట్‌ షేరింగ్‌ లాంటి ఆప్షన్లు వచ్చాయి. ఇటీవల ఫైల్స్‌ షేరింగ్‌ సదుపాయం కూడా వచ్చింది. దీని ద్వారా పీడీఎఫ్‌లు, వర్డ్‌ డాక్యుమెంట్లు లాంటివి పంపించుకోవచ్చు. దీని కోసం మీరు ఎవరికి డాక్యుమెంట్లు పంపాలనుకుంటున్నారో ఆ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే పైన క్లిప్‌ గుర్తు కనిపిస్తుంది. దాన్ని ఒత్తితే అక్కడ డాక్యుమెంట్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. దాన్ని ఒత్తి మీకు కావాల్సిన డాక్యుమెంట్లు పంపించుకోవచ్చు.
ఇవి రానున్నాయి
కాల్‌ అందుకోకపోతే 
నం కాల్‌ చేసిన వ్యక్తి నెట్‌వర్క్‌కు అందుబాటులో లేనప్పుడు లేదంటే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినప్పుడు ఆ ఫోన్‌కు వాయిస్‌ మెయిల్‌కు పంపించుకునే సౌలభ్యం ఉంది. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ఆడియో సందేశంగా పంపించొచ్చు. ఇప్పుడు ఈ ఆప్షన్‌ వాట్సాప్‌కు వస్తోంది. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్‌లో డేటా ఆఫ్‌ చేసినప్పుడు ఎవరైనా వాట్సాప్‌ కాల్‌ చేస్తే రింగ్‌ అయినట్లు వినిపిస్తుంది కానీ మీరు కాల్‌ చేసిన వ్యక్తికి రింగ్‌ రాదు. మళ్లీ నెట్‌ కనెక్ట్‌ చేసుకున్నాక మిస్డ్‌ కాల్‌ చూపిస్తుంది. ‘వాయిస్‌మెయిల్‌’ ఆప్షన్‌తో ఇకపై మిస్డ్‌ కాల్‌ మాత్రమే కాదు... వాయిస్‌ మెయిల్‌ రూపంలో సందేశం కూడా వస్తుంది. దీని కోసం కాల్‌ బటన్‌ పక్కనే మైక్‌ బటన్‌ ఉంటుంది. దాన్ని ఒత్తిపట్టుకొని మీరు చెప్పాల్సిన విషయం చెప్పాక సెండ్‌ చేయాలి. అది వాయిస్‌మెయిల్‌ రూపంలో అవతలి వ్యక్తికి వెళ్తుంది. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో ఇలాంటి సదుపాయం ఉంది.


బృందంలో చేరుతారా?
మీకు సంబంధం లేని వాట్సాప్‌ గ్రూపుల్లో, మీకు తెలియని వ్యక్తులు మిమ్మల్ని చేర్చేస్తుంటారు. దీంతో ప్రతిసారి ఆయా గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ అవుతూ ఉండాలి. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా చూస్తోంది వాట్సాప్‌. మిమ్మల్ని ఏదైనా గ్రూపులో సభ్యునిగా చేర్చేముందు మీకు ఆ గ్రూపు లింక్‌ మెసేజ్‌ రూపంలో వస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి అంగీకరిస్తేనే మీరు ఆ గ్రూపులో సభ్యులవుతారు. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ ప్రయోగ దశలో ఉంది.


పేరు చెబుదాం
  ఫేస్‌బుక్‌లో ఏదైనా పోస్ట్‌కింద కామెంట్‌ పెట్టినప్పుడు, లేదంటే మీ స్నేహితుడితో ఓ ఫొటో పెట్టి షేర్‌ చేసినప్పుడు వాళ్ల పేర్లు రాస్తే అవి బోల్డ్‌గా కనిపిస్తాయి. దీని వల్ల మనం ఎవరికి ఆ విషయం చెప్పాలనుకుంటున్నామో స్పష్టత ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆప్షన్‌ వాట్సాప్‌కు కూడా వస్తోంది. గ్రూప్‌లో ఛాట్‌ చేస్తున్నప్పుడు ఆ గ్రూపులో సభ్యుడి పేరుని @ తో కలిపి రాసి పంపిస్తే ఛాట్‌ బోర్డ్‌లో బోల్డ్‌గా కనిపిస్తుంది.
రీ డయల్‌  


సాధారణ మొబైల్‌ కాల్స్‌ మాదిరిగా వాట్సాప్‌ కాల్స్‌ వాడుతున్నాం. త్రీజీ డేటా, వై-ఫై ఉన్నప్పుడు వాట్సాప్‌ కాల్స్‌ కూడా సాధారణ కాల్స్‌లా స్పష్టంగా వినిపిస్తాయి. అయితే ఎక్కడో చిన్న వెలితి. రీడయల్‌, కాల్‌ బ్యాక్‌ ఆప్షన్లు లేవు అని. త్వరలో వాట్సాప్‌ ఈ ఆప్షన్లను ప్రవేశ పెట్టనుంది. అంటే ఇకపై మీకు వాట్సాప్‌ కాల్‌ వచ్చినప్పుడు సాధారణ కాల్‌లా రీ డయల్‌ చేసుకోవచ్చు. మిస్డ్‌ కాల్‌ వస్తే నోటిఫికేషన్‌ బార్‌ నుంచే కాల్‌ బ్యాక్‌ చేసుకునే సదుపాయమూ వస్తోంది. ఇప్పటికే కొందరు ఆండ్రాయిడ్‌ వినియోగదారులు ప్రయోగాత్మకంగా ఈ ఆప్షన్‌ను వాడుతున్నారు.

వీడియో కాల్స్‌
వాట్సాప్‌లో వీడియో కాల్‌ కూడా రాబోతోంది. ఇప్పటికే ఒకసారి మేలో వాట్సాప్‌ ఈ ఆప్షన్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అయితే కొద్ది రోజులకే వచ్చిన అప్‌డేట్‌లో ఆ ఆప్షన్‌ను తొలగించింది. మళ్లీ ఇప్పుడు వీడియో కాల్‌ ఆప్షన్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
కదిలే బొమ్మలు
వాట్సాప్‌ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అంశం జిఫ్‌లు. ఈ చిన్న యానిమేటడ్‌ ఇమేజ్‌లు ఛాటింగ్‌లో కొత్త అనుభూతిని తీసుకొస్తాయి. వంద పదాల్లో చెప్పాలనుకున్న విషయాన్ని ఒక్క జిఫ్‌తో చెప్పొచ్చు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, ‘విచాట్‌’లో ఉన్న ఆప్షన్‌ వాట్సాప్‌లోకి వస్తుందని కొన్నాళ్లుగా అంటున్నారు. తాజాగా ఐఫోన్‌లో ఈ ఆప్షన్‌ ప్రారంభమైంది. త్వరలో ఆండ్రాయిడ్‌ వినియోగదారులూ ఈ సదుపాయాన్ని వినియోగించు కోవచ్చు.
పెద్ద ఎమోజీలు
సమాచారం బట్వాడాలో ఎమోజీలది ముఖ్య స్థానమే. అందుకే వాట్సాప్‌లో వందల కొద్దీ ఎమోజీలు ఉన్నాయి. ప్రతి అప్‌డేట్‌కు కొత్త ఎమోజీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఆ ఎమోజీ పరిమాణం కూడా పెరగబోతోంది. త్వరలో పెద్ద ఎమోజీలు పంపొచ్చు. త్వరలో రానున్న ఐఓఎస్‌ 10 ఆధారిత ఫోన్లలో పెద్ద ఎమోజీలు చూడొచ్చు. ఆ తర్వాత ఈ ఆప్షన్‌ ఆండ్రాయిడ్‌ వినియోగదారులకూ అందుబాటులోకి వస్తుంది.

మైనర్ విద్యార్థితో 24 ఏళ్ల టీచర్ శృంగార కార్యకలాపాలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

యూకే: విద్యార్థితో శృంగార కార్యకలాపాలు సాగించిన 24 ఏళ్ల టీచర్ ఒకరు ఇప్పుడు కోర్టులో ముద్దాయిగా నిలబడింది. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడినట్టు ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మేరీ బెత్ హగ్లీన్(24) తాను టీచర్‌గా పనిచేస్తున్న స్కూల్లోని ఓ విద్యార్థితో అక్రమంగా సంబంధం ఏర్పరుచుకుంది. విషయం ఎలాగోలా బయటపడడంతో పోలీసుల వరకు వెళ్లింది. వారు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ విషయంలో తాను పనిచేస్తున్న స్కూలు యాజమాన్యం కావాలనే ఇబ్బందులు పెడుతోందని, తనకు, విద్యార్థికి మధ్య సంబంధం ఉన్న విషయం యాజమాన్యానికి తెలుసని ఆమె కోర్టుకు తెలిపింది. తాను దీని నుంచి తప్పించుకోవాలని చూడడం లేదని, ఈ పనికి తాను సిగ్గుపడడం లేదని పేర్కొంది. దీనిని తాను ఎదుర్కొంటాను తప్ప పారిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
 
మునుపటి సంబంధాలు తనను ఇందుకు ప్రేరేపించాయని, ఇందుకు స్కూలు వాతావరణం కూడా సహకరించిందని పేర్కొంది. అయితే విద్యార్థి, టీచర్ విషయం తెలిసిన స్కూలు యాజమాన్యం ఆమెపై దర్యాప్తు ప్రారంభిస్తూ కెడార్ ర్యాపిడ్ స్కూల్స్‌కు సబ్‌స్టిట్యూట్‌గా పంపించింది. తనను వాషింగ్టన్ హైస్కూల్ నుంచి రిలీజ్ చేసినా మరో ప్రాంతంలోని స్కూలుకు పంపించినట్టు మేరీ పేర్కొంది. స్కూలు యాజమాన్యానికి తమ ‘రిలేషన్’ గురించి ఫిబ్రవరిలోనే తెలిసినా స్కూలుకున్న మంచి పేరును రక్షించుకునేందుకు నోరెత్తలేదని, ఇప్పుడు విషయం బయటపడడంతో తనను ఇరికించాలని చూస్తోందని కోర్టులో ఆవేదన వ్యక్తం చేసింది. మేరీ కనుక దోషిగా తేలితో రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

మానవ మూత్రంతో బీర్ తయారు చేస్తారట!

బ్రస్సెల్స్‌: ఆల్కహాల్‌ చాలా తక్కువ మోతాదులో ఉండే బీర్‌ను చాలా మంది ఇష్టడతారు. ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఈ మధ్య బీర్‌ పట్ల ఆకర్షితులవుతున్నారు. అందుకే రకరకాల ఫ్లేవర్లలో బీర్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇప్పుడు అదే కోవలో మరో బీర్‌ రంగ ప్రవేశం చేయనుంది. ఈ బీర్‌ను మానవ మూత్రంతో తయారు చేస్తుండడం విశేషం. అది చాలా ఛండాలంగా ఉంటుంది అనుకుంటున్నారా? అయితే మీరు బీర్‌లో కాలేసినట్టే. ఎందుకంటే యూరిన్‌తో తయారైన ఈ బీర్‌ చాలా టేస్టీగా, అత్యుత్తమ క్వాలిటీతో ఉంటుందట.
 
యూరిన్‌ను రకరకాలుగా ప్రాసెస్‌ చేసి బీర్‌ను తయారు చేసే ప్రక్రియను కనుగొన్నారు బెల్జియంలోని ఘెంట్‌ యూనివర్సిటీ పరిశోధకులు. యూరిన్‌ను సోలార్‌ ఎనర్జీ ద్వారా నీరుగా మార్చే యంత్రాన్ని వారు కనుగొన్నారు. ఈ ప్రక్రియలో మొదట యూరిన్‌ను ఓ పెద్ద ట్యాంక్‌లో స్టోర్‌ చేస్తారు. దానిని సోలార్‌ పవర్‌తో పనిచేసే బాయిలర్‌లో వేడిచేసి దానిని ఓ పొరగుండా ప్రవహింపచేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ యూరిన్‌.. పొటాషియం, నైట్రోజన్‌, పాస్ఫరస్‌, నీరుగా విడిపోతుది. ఆ నీరును ప్రాసెస్‌ చేసి మంచి టేస్టీ బీర్‌గా తయారు చేస్తారు. ఇక యూరిన్‌ నుంచి వేరైన పొటాషియం, నైట్రోజన్‌, పాస్పరస్‌ వంటి ఖనిజ లవణాలను పొలంలో ఎరువులుగా కూడా వాడుకోవచ్చు.
  
ఇటీవలె ఈ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ మెషిన్‌ను ఉంచి దాదాపు వెయ్యి లీటర్ల మూత్రాన్ని సేకరించారట. దీనిని ప్రాసెస్‌ చేసి రకరకాల ఫ్లేవర్లలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ బీర్‌ ఆరోగ్యానికి ఎటువంటి హానీ చేయదని వారు వెల్లడించారు.

పదే పదే వేడి చేయొద్దు!

చాలామంది రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను మరుసటి రోజు వేడి చేసి తీసుకుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వాటిని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే లేని రోగాలు కొనితెచ్చుకున్నట్టే. అవేమిటంటే..
చికెన్‌ :- దీనిని చాలా మంది మళ్లీ వేడి చేసి తింటారు. అలా చేయడం వల్ల దానిలోని ప్రొటీన్లు పూర్తిగా నశించిపోతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కడుపులో తిప్పడం, అరగకపోవడం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.
బచ్చలికూర:- ఈ ఆకులో ఐరన్‌, నైట్రేట్లూ పుష్కలంగా లభిస్తాయి. ఎప్పుడైతే ఈ కూరను వేడి చేస్తామో అప్పుడు ఇందులోని నైట్రేట్లు.. నైట్రిట్స్‌లా మారతాయి. వీటి ప్రతికూల ప్రభావం శరీరంలోని అవయ వాల మీద పడుతుంది. అందుకే.. బచ్చలి కూరను మళ్లీ వేడి చేసి ఆహారంలో తినకూడదు. ఒకవేళ వేడి కావాలనుకుంటే బాగా మరిగిన నీటిలో ఈ కూర గిన్నెను కొద్దిసేపు ఉంచి తీస్తే సరిపోతుంది.
గుడ్లు:- కోడిగుడ్లతో చేసిన వంటకాలనూ ఒకసారికి మించి వేడి చేయకూడదు. అలా చేస్తే దానిలోని పోషకాలు టాక్సిన్లుగా మారతాయి. జీర్ణవ్యవస్థ మీద చెడు ప్రభావం చూపిస్తాయి.
మష్రూమ్స్‌ :- ప్రొటీన్లు బాగా దొరికే ఆహారం మష్రూమ్స్‌. వీటినీ వండిన తర్వాత పదే పదే వేడి చేయటం మంచిది కాదు. అలా చేస్తే ప్రొటీన్లు విషపూరితంగా మారతాయి. అనారోగ్యాలు ఆవరిస్తాయి.
ఆలుగడ్డ :- ఆలుగడ్డ కూరను వేడి చేయడం వల్ల దానిలోని పోషక విలువ లన్నీ పోతాయి. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.ప

2 నుంచి ఆన్‌లైన్‌లోనే ఆర్టీఏ సేవలు

ఈ-సేవా కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణా తరగతులు 

ఒకేసారి 59 రకాల సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందించేందుకు రవా ణా శాఖ సిద్ధమవుతోంది. ఆగస్టు 2 నుంచి పూర్తి స్థా యిలో ఆన్‌లైన్‌ విధానాన్ని అవలంబించాలనే లక్ష్యంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో 11 ఆర్టీఏ కార్యాలయాల్లో ఎలాంటి సేవకైనా మొదట ఆన్‌ లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న తర్వాతే ఆర్టీఏ కార్యాల యానికి వెళ్లాలి. ఇంద కోసం రవాణా శాఖ వెబ్‌సైట్‌, ఈ-సేవా, మీ-సేవా కేంద్రాల్లో సాఫ్ట్‌వేర్‌లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. మంగళవారం నుంచి నగరంలోని ఈ- సేవా కేంద్రాల్లో సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణా తరగ తులు నిర్వహిస్తున్నామని హైదరాబాద్‌ జిల్లా సంయు క్త రవాణా కమిషనర్‌ టి.రఘునాథ్‌ తెలిపారు. గ్రేటర్‌ పరిధిలో సుమారు 800 ఈ-సేవా కేంద్రాలున్నాయి. అన్ని చోట్లా రవాణా శాఖ సేవలు సులభంగా, వేగంగా అందిం చేందుకు వారం రోజుల ముందు నుంచే ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు. జూలై 15న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రవాణా శాఖ ఆటోమేటెడ్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌(ఏఓఎస్‌)ను ప్రారంభిం చిన విషయం తెలిసిందే.

కరపత్రాలతో ప్రచారం..
ఆర్టీఏ కార్యాలయాల్లో పనులు అంటేనే ఏజెంట్లను సంప్రదించాలా అనే ఆలోచనకు ఆటోమేటెడ్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ విధానం పుల్‌స్టాప్‌ పెట్టనుంది. విద్యా వంతు లతో పాటు నిరక్ష్యరాస్యులు సైతం ఆన్‌లైన్‌ ద్వారా సేవలు సులభంగా పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా శాఖ అందించే 59 రకాల సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలను, పోస్టర్లను ముద్రిస్తోంది.

రెండు సేవలు మాత్రమే ఆఫ్‌లైన్‌లో... రవాణా శాఖలో ఆన్‌లైన్‌ ద్వారా ప్రజలకు 59 రకాల సేవలందిస్తుండగా, రెండు సేవలు మాత్రమే ఆఫ్‌లై న్‌లో అందిస్తామని అధికారులు తెలిపారు. వీటిలో ఫ్యాన్సీ నంబర్ల రిజస్ర్టేషన్‌, వాటికి టెండర్‌ చేసే విధా నం ఒకటి కాగా, రెండోది టూరిస్టు బస్సుల అనుమతి. ఈ రెండింటిని ప్రస్తుతానికి ఆఫ్‌లైన్‌ ద్వారానే అందిం చనున్నారు. ప్రజల నుంచి వచ్చిన డిమాండును బట్టి వాటిని కూడా ఆన్‌లైన్‌లోనే ప్రవేశపెడతామని అధికా రులు పేర్కొంటున్నారు.

సీరియల్ చూసే లేడీస్‌ ఈ సీన్ చూస్తే మానేస్తారేమో !

ఇండియాలో మగాళ్లందరికీ ప్రధాన శత్రువు డైలీ సీరియల్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదేమో. పల్లెల నుంచి మహానగరాల దాకా సాయంత్రం 6 దాటితే చాలు ఏడుపులు, పెడబొబ్బలే. రాత్రి 10 గంటల దాకా ఆ కన్నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. ఆడోళ్లకు ఫేవరెట్‌గా, మగాళ్లకు చేరుకోలేని టార్గెట్‌గా మారిన ఈ సీరియల్స్ జాడ్యం రోజురోజుకూ శ్రుతిమించుతోంది. సీరియల్స్ అంటే ఒక సీన్‌ను సాగతీసితీసి మధ్యమధ్యలో ఒకటికి నాలుగుసార్లు యాడ్స్ వేయడం అందరూ చూసి ఉంటారు. అయితే సీరియల్ నిజంగా రియల్ కాదు. ఎంత రియల్ కాకపోయినా జనాన్ని మరీ ఇంత మోసం చేయడం అవసరమా అని ఈ సీన్ చూస్తే మీకనిపిస్తోంది. తమిళంలో ప్రసారమయ్యే చంద్రకళ అనే ధారావాహిక చూస్తే కన్నీరు ధారలా ప్రవహిస్తుంది. ప్రేక్షకులను వీలైనంతగా ఏడిపించాలనే ఈ సీరియల్ తీసినట్టున్నారు నిర్మాతలు.
 
అయితే ఇటీవల జూలై 23న ప్రసారమయిన చంద్రకళ ఎపిసోడ్ హాట్ న్యూస్ అయింది. దీనికి కారణం ఆ సీన్ సాగిన విధానమే. హీరోయిన్‌ను పాయింట్ బ్లాంక్‌లో ఓ వ్యక్తి గన్‌తో కాలుస్తాడు. సాధారణంగా పాయింట్ బ్లాంక్‌లో బుల్లెట్ తగిలితే ఎవరైనా క్షణాల్లో నేలకొరుగుతారు. కానీ సీరియల్ హీరోయిన్ మాత్రం దీనికి పూర్తి భిన్నం. అలా పడిపోతే వెరైటీ ఏముందనుకున్నాడో ఏమో బుల్లెట్ తగిలిన తర్వాత దాదాపు రెండు నిమిషాల పాటు ఆమె మాట్లాడుతూనే ఉంటుంది. తన భర్త చేత మల్లెపూలు పెట్టించుకుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అరాచకాలు అన్నీఇన్నీ కావు. మేం చెప్పడం కంటే మీరు చూస్తూనే ఆ కామెడీ ఏంటో తెలుస్తుంది. సోషల్ మీడియాలో నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఆ సీరియల్ క్లిప్పింగ్‌ను మీరూ ఓసారి చూడండి.

డెంగీ గురించి అపోహలు.. అనుమానాలు..

డెంగీ గురించి గమనించవలసిన క్రింది లక్షణాలు :
దోమకాటు ద్వారా డెంగీ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించిన 4-6 రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి.
హఠాత్తుగా తీవ్ర జ్వరం..
తీవ్రమైన తలనొప్పి..
కంటి గుడ్లలో నొప్పి..
ఒళ్ళు, కీళ్ళ నొప్పులు..
ఏ లక్షణాలతో జ్వరం వచ్చినా ఒకసారి వైద్యుని సంప్రదించి డెంగీ జ్వరమో కాదో తెలుసుకొనేందుకు ప్రయత్నించాలి. అంతే కాని మామూలు జ్వరం అని సొంత వైద్యం పనికిరాదు.


జ్వరంలో కాదు తగ్గేప్పుడు జాగ్రత్త :
డెంగీ వస్తే జ్వరం చాలా తీవ్రంగా 105 డిగ్రీల వరకు ఉండి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండవచ్చు. అయినా డెంగీలో ఇదేమంత ప్రమాదకర దశ కాదు. కాని జ్వరం రెండు మూడు రోజులలో తగ్గుతుంది. ఈ తగ్గిపోయే దశ చాలా కీలకం. ఒంటి మీద మచ్చలు రావటం, ప్లేటులేట్లు తగ్గిపోవటం, బి.పి. తగ్గటం వంటివి ఆరంభమయ్యేది ఇప్పడే, డెంగీలో ఇది ప్రమాదకరమైన దశ . కాబట్టి జ్వరంలో ఉన్నప్పుడు కాదు జ్వరం తగ్గినప్పుడే మరింత శ్రద్ధగా అప్రమత్తంగా ఉండాలి.
ప్లేటులేట్ల కంటే ”ప్లాస్మా” ముఖ్యం :
డెంగీజ్వరం అనగానే ప్లేటులేట్లు పడిపోతాయని భయపడు తుంటారు. కాని దీని కంటే ప్రమాదకరమైనది రక్తనాళాల్లో నుంచి ప్లాస్మాలీక్‌ అవుతుండటం. మన రక్తంలో ఎర్ర కణాలు, ప్లేటులేట్లు అన్ని కలిపి 45 శాతమే ఉంటాయి. మిగిలిన 55 శాతం ద్రవ పదార్థం ప్లాస్మానే. రక్త నాళాల్లోంచి ప్లాస్మా కడుపు, ఊపిరితిత్తులు, కణ జాలాల్లోకి లీక్‌ అయిపోయి, దీంతో రక్తం చిక్కబడిపోయి రక్తం పరిమాణం తగ్గి బి.పి. పడిపోతుంది. ఈ స్థితిలో శరీరభాగాలకు తగినంత రక్తం, ఆక్సీజన్‌ అందక అన్ని అవయవాలు దెబ్బతిని రోగి షాక్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. డెంగీ జ్వరంతో ఎక్కువగా రోగులు చనిపోయేది ఈ స్థితిలోనే కాబట్టి ప్లేటులేట్లు పట్టించుకోవటం కాకుండా, వీరికి ”హిమా టో క్రిట్ ” (HCT) పరీక్ష చేసి రక్తం చిక్కబడుతుందా? బిపి తగ్గిపోతుందా? అన్నది ముఖ్యం.
20 వేల వరకు తగ్గినా:
డెంగీ జ్వరం వచ్చినపుడు రక్తంలో ప్లేటులేటు కణాలు కొంత తగ్గటం సహజం. అయతే ఈ కొద్దిపాటి తగ్గుదలకే ప్రమాద సంకేతంగా భావిస్తూ ప్లేటులేట్లు ఎక్కించాల్సిన పనిలేదు. సాధారణ ఆరోగ్యవంతుల్లో ప్లేటులేట్లు 1.5 నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. వీటి సంఖ్య 1 లక్షకంటే తక్కువగా పడిపోతుంటే అప్రమత్తం కావాలి. ఈ స్థితిలో వైద్యుల పర్యవేక్షణ అవసరం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్లేటులేట్ల సంఖ్య 20వేల కన్నా తక్కువ ఉండి రక్తస్రావం లక్షణాలు కనబడుతుంటే వెంటనే ప్లేటులేట్లు ఎక్కించాలి. లేదా ఎలాంటి రక్తస్రావం లక్షణాలు లేకున్నా వీటి సంఖ్య 10 వేల కంటే తక్కువకు పడిపోతే ప్లేటులేట్లు ఎక్కించాలి. కాబట్టి లక్ష కంటే తగ్గగానే ప్లేటులేట్లు తగ్గుతున్నాయంటూ ఆందోళనలో వైద్యులపై ఒత్తిడి పెంచాల్సిన పనిలేదని గుర్తించాలి.
నొప్పలు తగ్గించే మందులు వాడవద్దు:
సాధారణంగా తీవ్రమైన ఒళ్ళు నొప్పి లాంటి బాధలు తగ్గేందుకు ఐబూప్రోఫెన్‌ వంటి మందులు వాడు తుంటారు . కాని డెంగీజ్వరంలో వీటిని వాడకుండా ఈ సీజన్లో జ్వరం వస్తే పారాసిటమాల్‌ తప్పించి క్రింది మందులు వాడకూడదు.
ఉదా: ఆస్ప్రిన్‌, ఐబూప్రోఫెన్‌, నిముస్‌లైడ్‌, డైక్లోఫినాక్‌, అసైక్లోఫినాక్‌,
పరీక్షలు అనవసరం అనుకోవద్దు:
డెంగీ జ్వరమైతే డాక్టర్ల పర్యవేక్షణలో సమస్యను నిర్ధారించి రోగికి పూర్తి విశ్రాంతి కల్పిస్తూ సాధారణ చికిత్స చేస్తే తగ్గిపోతుంది. డెంగీ జ్వరంలో ఒకరకమైన డెంగీ హేమరేజిక్‌ జ్వరంలోనే ప్రమాదకరమైన సమస్యలు మొదలవుతాయి. మొది మూడు రోజుల్లో సాధారణ డెంగీకి ఈ ప్రమాదకరమైన రకానికి తేడా కనిపెట్టడం కష్టం. కాబట్టి ఈ సీజన్లో జ్వరం వస్తే వైద్యులకు చూపించుకొని వారి సలహా ప్రకారం రక్త పరీక్షలు చేయించుకొని రోగి పరిస్థితిని ప్రతి రోజు వైద్యులకు తెలుపుతుండాలి. దీని పరిస్థితి తెలుసుకోవటం కోసం రక్త పరీక్ష పలుమార్లు చేసే అవసరం ఉందని గమనించాలి.
ప్రమాద సంకేతాలు కీలకం :
డెంగీ జ్వర పీడితులు సమస్యల్లోకి వెళుతున్నపుడు దాన్ని ఖచ్చితంగా నిర్ధారించి, దీనికోసం రక్తపరీక్షలు కచ్చితంగా చేస్తుండాలి. సాధారణంగా ప్లాస్మా లీకేజి ఎక్కువై ఉంటే ఫ్యాక్ట్‌సెల్‌ వాల్యూమ్‌ ఉండాల్సిన దానికంటే 20% పెరిగినా, రక్తస్రావం ఎక్కువ అవుతున్నా ఏదైనా అవయవం దెబ్బతిన్నా దాన్ని ”డెంగీ హెమిరేజిక్‌ ఫీవర్‌” అంారు. ఇది డెంగీలో చాలా తీవ్రమైన స్థితి జ్వరం. జ్వరం వచ్చిన 3,4 రోజుల్లో హిమోగ్లోబిన్‌ శాతం అసాధారణంగా పెరిగితే వెంటనే వేగంగా సెలైన్‌ ఎక్కించాలి. అందుకే డెంగీ జ్వరంలో ప్లేటులేట్ల సంఖ్య చూడడం కంటే కూడా హెమో టో క్రిట్, ఫ్యాక్ట్‌ సెల్‌ వాల్యూమ్‌ ప్రధానమైనదని గుర్తించాలి. రక్తంలో హెమోగ్లోబిన్‌ శాతం ఎంత ఉందో చెప్పే చిన్న రక్త పరీక్ష చేసుకోక శ్రద్ధ పెట్టకపోటం వల్ల ప్రాణాపాయాలు సంభవిస్తున్నాయి.