మనం
ఎన్నో లవ్ స్టోరీలు విని ఉంటాం.. ఎంతోమంది లవ్ బర్డ్స్‌ను, వాళ్లు పడే
కష్టాలను, ఆనందాలను కళ్లారా చూసి ఉంటాం. టీచర్లను స్టూడెంట్లు ప్రేమించడం
చూశాం.. వయసు తారతమ్యాలు లేని ప్రేమికులు.. ఇలా చాలానే లవ్ స్టోరీ వినే
ఉంటాం. బహుశా ఇప్పుడు మీరు చదవబోయే లవ్ స్టోరీ ఎప్పుడూ ఎక్కడా విని ఉండరు..
సినిమాల్లో,సీరియల్స్‌లో కూడా చూసి ఉండరు.
వాళ్లిద్దరు
ప్రేమలో పడ్డారు.. వారి వయసెంతో తెలిస్తే అవాక్కవుతారు. ఇద్దరూ చదువుతోంది
ఆరో తరగతే.. అప్పటికే ఇద్దరూ ప్రేమ మైకంలో మునిగితేలారు. అంతేకాదు
పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి ఎక్కడైనా ఆశ్రయం పొందాలనుకున్న
సమయంలో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.ఈ చిన్నారి ప్రేమ కథ గుజరాత్‌లోని
అహ్మదాబాద్‌లో జరిగింది. నగరంలోని ఓ ప్రముఖ స్కూల్‌లో ఆరో తరగతి
చదువుతున్న పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండు రోజుల
క్రితం(బుధవారం) స్కూలుకెళ్లి అటునుంచే పారిపోయారు. పోతూ పోతూ ఇంట్లోంచి ఓ
సెల్‌ఫోన్ తీసుకుని పారిపోయాడు అబ్బాయి. సాయంత్రం అయినా ఇళ్లకు రాలేదు.
పైగా ఫోన్ కూడా కలవకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్
స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అప్పటికే
ఈ ప్రేమ జంట ఆశ్రయం పొందెందుకు ఇళ్లు కోసం వెతికే పనిలో పడ్డారు. ఎంత
ప్రయత్నించినా అద్దెఇల్లు దొరకలేదు. పిల్లలిద్దరూ స్కూల్ యూనిఫాం,
బ్యాగులతో ఉండటంతో ఎవరు గదులు ఇవ్వలేదు. అప్పటి వరకు స్విచాఫ్‌లో ఉన్న
ఫోన్‌ను ఆన్ చేసి తన మిత్రుడికి ఫోన్ చేశాడు. ఇంతలో అప్పటి వరకు సిగ్నల్
కనుగునే పనిమీదున్న అహ్మదాబాద్ సైబర్ క్రైం పోలీసులు ట్రాక్ చేసి ఎట్టకేలకు
వాళ్ల ఆచూకీ కనిపెట్టేశారు. పోలీసులు, పిల్లల తల్లిదండ్రులు వారున్న
నడియార్‌కు వెళ్లి ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకు ఇంట్లోనుంచి పారిపోయారని
పిల్లలను ప్రశ్నించగా లవ్ స్టోరీ మొత్తం చెప్పారు.. దీంతో మీరు
ప్రేమించుకున్నారా అందుకే ఇంట్లోనుంచి వెళ్లిపోయారా అని తెగ నవ్వుకున్నారు.
ఈ లవ్ స్టోరీ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు ఈ చిన్నారి
ప్రేమకథ గురించి విని తెగ కామెంట్లు చేస్తున్నారు.

No comments:
Post a Comment