26 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, డీసీఎం స్వాధీనం
పంజాగుట్ట: బంజారాహిల్స్ రోడ్ నెం.3లో మద్యం మత్తులో వాహనం నడిపి ముగ్గురి మృతికి కారణమైన సంఘటనతో ట్రాఫిక్ పోలీసులు పగటిపూట కూడా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తు న్నారు.
పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్‌ఆర్‌నగర్, బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. రాజ్‌భవన్ రోడ్, లాల్‌బంగ్లా వద్ద 6, ఎస్‌ఆర్‌నగర్ ఆర్ అండ్ బి కార్యాలయం వద్ద 9, బంజారాహిల్స్ రోడ్డు నెం.10, ఫిలింనగర్ వద్ద 8, ఫిలిం చాంబర్ వద్ద ఒకరు, మినిస్టర్ రోడ్డులో ఆరుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. 26 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, డీసీఎంను స్వాధీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ షేక్ మసూం బాషా తెలిపారు.

No comments:
Post a Comment