Friday, 22 July 2016

సోమవారానికి వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ : రాజ్యసభ సోమవారం నాటికి వాయిడా పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరుగుతుండగా బీజేపీ ఎంపీలు ఆప్‌ ఎంపీ భగవంత్ మాన్ సింగ్‌ అంశంపై చర్చకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ చైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఒక వైపు బీజేపీ సభ్యులు నినాదాలు, మరోవైపు కేవీపీ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. బీజేపీ సభ్యులు ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని కురియన్ ఎంత సర్దిచెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను సోమవారం నాటికి వాయిదా వేశారు. దీంతో బిల్లుపై చర్చ మద్యలోనే ఆగిపోయింది.

No comments:

Post a Comment