Friday, 22 July 2016

కొన్ని వందల రోగాలు నయం చేసే మునగాకు.. 4 వేల సంవత్సరాల కంటే ముందు నుంచే మునగాకు మెడిసిన్స్ లో..

మునక్కాడలు అందరూ ఉపయోగిస్తూ ఉంటారు కదూ. అయితే.. ఈ మునక్కాడలే కాదు.. మునగ ఆకులోనూ పవర్ ఫుల్ హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయి. 4 వేల సంవత్సరాల కంటే ముందు నుంచే మునగాకు మెడిసిన్స్ లో ఉపయోగిస్తున్నారంటే.. ఇందులోని గొప్పదనం ఏంటో తెలుస్తోంది. ఆయుర్వేదంలో మునగాకును 300 లకు పైగా వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారు. అందుకే దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్ గా పిలుస్తారు. మ‌రి మున‌గ ఆకులో దాగున్న ఔష‌ధ‌ గుణాలేంటో ఇప్పుడు చూద్దాం..
1. మునగ ఆకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ ఉంటాయి. ఎండిన మునగ ఆకు నుంచి క్యారట్ల ద్వారా పొందే విటమిన్ ఏ ని 10 రెట్లు ఎక్కువగా పొంద‌వ‌చ్చు.

2. పాల నుంచి పొందే క్యాల్షియం కంటే 17 రెట్లు ఎక్కువగా మునగ ఆకు నుంచి పొంద‌వ‌చ్చు

3. పెరుగు నుంచి పొందే ప్రొటీన్స్ కంటే 9 రెట్లు ఎక్కువగా మునగ ఆకు నుంచి పొంద‌వ‌చ్చు.

4. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కంటే 15 రెట్లు ఎక్కువగా ఎండిన మునగ ఆకు నుంచి పొంద‌వ‌చ్చు.

5. ఆరంజ్ ల నుంచి పొందే విటమిన్ " సి" ని 12 రెట్లు ఎక్కువగా పొందవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

6. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుందట.

7. మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చని సైంటిస్ట్ లు సూచిస్తున్నారు.

8. థైరాయిడ్ ని కూడా రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునక ఆకు.

9. మునగాకులలో పవర్ ఫుల్ నియాంజిమినైన్ అనే యాంటీ క్యాన్సర్, యాంటీ ట్యూమర్ గుణాలు ఉంటాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి.

10. అలాగే ఐదు రకాల క్యాన్సర్ లను నిరోధించే సత్తా ఈ మునగాకులో ఉందని తాజా అధ్యయనం తేల్చింది.

11. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి ఐదు రకాల క్యాన్సర్లు రాకుండా ఈ మునగాకు పొడి అరికట్టగలదట.

No comments:

Post a Comment