ఈ
వార్త చదివిన తరువాత మీరు షాకవ్వడం ఖాయం. ఓరి బాబూ వీడెవడు అని
కంగుతింటారు. రికార్డు సృష్టించాలన్నదే అతని లక్ష్యమేమో గానీ ఒకరిద్దరితో
కాదు ఏకంగా 140మంది మహిళలతో శృంగార సంబంధాలు సాగించాడు. అతను చేసే ప్రతి
పాడు పని ఎప్పుడు, ఎక్కడ, ఎన్నిసార్లు, ఎవరితో లైంగిక కార్యకలాపాల్లో
పాల్గొన్నాడన్నది రహస్యంగా ఓ డైరిలో రాసుకునే వాడట. ఆఖరికి అతని సొంత
కూతురే తండ్రిని కటకటాలపాలు చేసేంత పనైంది.
అసలు
విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఒకరిద్దరు కాదు ఏకంగా
140మంది మహిళలకు ఇతనికి బలయ్యారు. ఇతని జాబితాలో ఎవరెవరున్నారో తెలిస్తే
మైండ్ బ్లాంక్ అవుతుంది. సామాన్యులు మొదలుకుని పెద్ద పెద్ద బడా లేడీ
ఆఫీసర్లు సైతం ఇతని ఖాతాలో ఉన్నారు. ఈ తతంగం చూసి విస్తుపోయిన అతని కూతురు
బరేలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన లేడీ పోలీస్
అధికారి సైతం ఇతని జాబితాలో ఉండటం నివ్వెరపోయే విషయం. డైరీ గురించి స్వయాన
అతని కూతురు రోషిణి మీడియాకు వివరాలు వెల్లడించింది. బయటికెళ్లొచ్చి
వచ్చినప్పుడల్లా డైరీ తెరిచి రాయడం ట్రంక్ పెట్టెలో దాచడం ఓసారి చూసింది.
తండ్రి వాలకంపై అనుమానం పెంచుకున్న ఆమె కొన్ని రోజులకు పోలీసులకు ఫిర్యాదు
చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కీచకుడిని పట్టుకునే పనిలో
నిమగ్నమయ్యారు.

No comments:
Post a Comment