Sunday, 24 July 2016

విడిపోనున్న అమలాపాల్ దంపతులు?

తన సినీ ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకున్న అమలాపాల్, ప్రస్తుతం భర్త నుంచి విడిపోనుందా? అంటే అవుననే అంటున్నాయి తమిళ సీనీ వర్గాలు. రెండేళ్ల క్రీతమే ఓ యువదర్శకున్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ దర్శకత్వం వహించిన దీవ తిరుమగల్ చిత్రంలో నటించేప్పుడే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చింది. అయితే ఇద్దరి మధ్యా తలెత్తుతున్న భేదాభిప్రాయాల కారణంగా వారు విడిపోవాలనుకుంటున్నట్లు వినికిడి. దీనిపై అమలాపాల్ కూడా త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వనుందని సినీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

No comments:

Post a Comment