ప్రపంచ సినీ చరిత్రలో
కనీవినీ ఎరుగని హైప్ సృష్టించిన ‘కబాలి’.. ప్రేక్షకులను అలరించడం మాట
అంటుంచితే.. రజనీ బ్రాండ్ లేదని అభిమానులు సైతం నిరాశకు లోనయ్యారు. ఎన్నో
అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన కబాలిపై ఎన్నో ఆశలు
పెట్టుకున్న అభిమానులు, సినీ ప్రేక్షకులు.. ఇప్పుడు ఈ సినిమాపై సెటైర్లు
మొదలు పెట్టారు. నిన్నటి వరకు ‘కబాలి.. దా’ అంటూ సోషల్ మీడియాను
హోరెత్తించిన వారంతా ఇప్పుడు.. ‘కబాలి.. బ్రదర్ ఆఫ్ లింగా’ అంటూ సెటైర్లతో
సోషల్ మీడియాను పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా కథను సరిగ్గా హ్యాండిల్
చేయలేకపోయాడని దర్శకుడు పా రంజిత్‌ను తప్పుబడుతున్నారు. నటనలో, స్టైల్‌లో
రజనీకి తిరుగులేదని నెటిజన్లంతా నొక్కి చెబుతూనే కబాలి దర్శకుడు రంజిత్‌ను
ఎండగడుతున్నారు. రజనీ కెరీర్‌లో బాబా తరువాత లింగా బిగ్గెస్ట్
డిజాస్టర్‌గా నిలిచింది. కొచ్చాడయాన్, లింగా చిత్రాల తరువాత భారీ అంచనాల
మధ్య ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో ‘డాన్’ కేరక్టర్‌తో ఎంచుకొని
మరీ చేసిన కబాలి ఆశించిన రీతిలో లేకపోవడంతో ఇక రజనీకి శంకర్ మాత్రమే
దిక్కని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రోబో సినిమాతో రజనీని ఎక్కడికోె
తీసుకెళ్లిన శంకర్ ప్రస్తుతం రోబో 2.0ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
రోబో టేకింగ్, గ్రాఫిక్స్, కథను నడిపించిన తీరుతో భారతీయ సినిమాను శంకర్
కొత్తమలుపు తిప్పాడంటున్న నెటిజన్లు ప్రస్తుతం తమ ఆశలన్నీ శంకర్‌పైనే
ఉన్నాయంటున్నారు.

No comments:
Post a Comment