Wednesday, 27 July 2016

ఇది తెలిస్తే బొద్దింకల్ని అసహ్యించుకోరు !

బొద్దింకేంటి... పాలివ్వడమేంటి... అని ఆశ్చర్యపోతున్నారా? అవును... ఇది నిజం. కొన్ని రకాల బొద్దింకలు పాలిస్తాయని మన భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. భవిష్యత్‌లో ఈ పాలను ప్రొటీన్లకు ప్రత్యామ్నాయంగా వినియోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బొద్దింకల పాలు ఆవు పాల కంటే నాలుగు రెట్లు ఎక్కువ పోషకాలు, ప్రత్యేక ప్రొటీన్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పాలల్లో క్రిస్టల్ అనే ప్రొటీన్ ఉంటుందని గుర్తించారు. అయితే అన్ని బొద్దింకల్లో ఈ పాలు లభించవని, ప్రత్యేకమైన పసిఫిక్ బీటిల్ బొద్దింకల పాలల్లో మాత్రమే ఈ ప్రొటీన్లు ఉంటాయని తెలియజేస్తున్నారు. కేవలం ఈ రకమైన బొద్దింకలు మాత్రమే క్షీరదాల్లా పిల్లల్ని కంటాయని వారు చెబుతున్నారు. ఈ బొద్దింకల పిల్లలు పిండ దశలో ఉన్నప్పుడు, ఈ క్రిస్టల్ ప్రొటీన్లనే ఆహారంగా తీసుకుంటాయని, ఈ క్రిస్టల్‌లో ప్రొటీన్లు, కొవ్వులు, చక్కెర, అన్ని రకాల అమినో యాసిడ్లు ఉంటాయని పేర్కొన్నారు. మనలో చాలా మంది బొద్దింకలంటే భయపడుతుంటారు. ఇప్పుడు ఈ విషయం తెలిశాక బొద్దింకలు కూడా వారికి ముద్దొచ్చి, ముద్దింకలు అని పిలుచుకుంటారేమో..!

No comments:

Post a Comment