అందం
మెరుగు పరుచుకోవడానికైనా, ఉన్న ప్రదేశానికి ఆకర్షణ తెచ్చిపెట్టడానికైనా
గులాబీలు పెట్టింది పేరు. వాటితో పాటు ఆ పూలల్లో ఇమిడి ఉండే సుగుణాలు
ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయట. అవేంటంటే...
గులాబీ రేకల్లో ఉండే ప్రత్యేక గుణాలు మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. ఫలితంగా అధిక బరువు అదుపులో ఉంటుంది. రసాయనాలు ఉపయోగించకుండా పూయించిన గులాబీపూల రేకల్ని గుప్పెడు తీసుకుని శుభ్రంగా కడిగి తినాలి. లేదంటే ఐదారు గులాబీ పూల రేకల్ని విడదీసి గ్లాసు వేడినీళ్లలో వేయాలి. అవి రంగు మారాక చెంచా తేనె, కొంచెం దాల్చినచెక్కపొడి కలిపి పరగడుపున తాగాలి. ఇలా రోజూ చేస్తే నాజూగ్గా మారడం ఎంతో సులువు.
* అలసట, ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు గులాబీ రేకలు చక్కని పరిష్కారం చూపిస్తాయి. ఒత్తిడిగా ఉన్నప్పుడు స్నానం చేసే వేణ్నీళ్లలో గుప్పెడు గులాబీరేకల్ని కలపండి. ఆ వేడికి రేకలు సువాసనలు వెదజల్లుతాయి. అవి మెదడుకి, శరీరానికి కూడా ఎంతో హాయినందిస్తాయి.
* ఈ గులాబీ రేకలతో టీ కూడా చేసుకుని తాగొచ్చు. వాటిల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని చురుగ్గా మారుస్తాయి. సహజంగా శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి గులాబీరేకలు. వీటితో చేసిన గుల్‌ఖంద్‌ని ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు తీసుకోవచ్చు. జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది.

No comments:
Post a Comment