బ్రస్సెల్స్:
ఆల్కహాల్ చాలా తక్కువ మోతాదులో ఉండే బీర్‌ను చాలా మంది ఇష్టడతారు. ఆడ, మగ
తేడా లేకుండా అందరూ ఈ మధ్య బీర్ పట్ల ఆకర్షితులవుతున్నారు. అందుకే రకరకాల
ఫ్లేవర్లలో బీర్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇప్పుడు అదే కోవలో మరో
బీర్ రంగ ప్రవేశం చేయనుంది. ఈ బీర్‌ను మానవ మూత్రంతో తయారు చేస్తుండడం
విశేషం. అది చాలా ఛండాలంగా ఉంటుంది అనుకుంటున్నారా? అయితే మీరు బీర్‌లో
కాలేసినట్టే. ఎందుకంటే యూరిన్‌తో తయారైన ఈ బీర్ చాలా టేస్టీగా, అత్యుత్తమ
క్వాలిటీతో ఉంటుందట.
యూరిన్‌ను రకరకాలుగా ప్రాసెస్
చేసి బీర్‌ను తయారు చేసే ప్రక్రియను కనుగొన్నారు బెల్జియంలోని ఘెంట్
యూనివర్సిటీ పరిశోధకులు. యూరిన్‌ను సోలార్ ఎనర్జీ ద్వారా నీరుగా మార్చే
యంత్రాన్ని వారు కనుగొన్నారు. ఈ ప్రక్రియలో మొదట యూరిన్‌ను ఓ పెద్ద
ట్యాంక్‌లో స్టోర్ చేస్తారు. దానిని సోలార్ పవర్‌తో పనిచేసే బాయిలర్‌లో
వేడిచేసి దానిని ఓ పొరగుండా ప్రవహింపచేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ యూరిన్..
పొటాషియం, నైట్రోజన్, పాస్ఫరస్, నీరుగా విడిపోతుది. ఆ నీరును ప్రాసెస్
చేసి మంచి టేస్టీ బీర్‌గా తయారు చేస్తారు. ఇక యూరిన్ నుంచి వేరైన
పొటాషియం, నైట్రోజన్, పాస్పరస్ వంటి ఖనిజ లవణాలను పొలంలో ఎరువులుగా కూడా
వాడుకోవచ్చు.
ఇటీవలె ఈ యూనివర్సిటీ
క్యాంపస్‌లో ఈ మెషిన్‌ను ఉంచి దాదాపు వెయ్యి లీటర్ల మూత్రాన్ని సేకరించారట.
దీనిని ప్రాసెస్ చేసి రకరకాల ఫ్లేవర్లలో మార్కెట్లోకి విడుదల
చేయనున్నట్టు తెలిపారు. ఈ బీర్ ఆరోగ్యానికి ఎటువంటి హానీ చేయదని వారు
వెల్లడించారు.

No comments:
Post a Comment