Friday, 22 July 2016

చిరు చేతికి మెసేజ్... షూటింగ్‌కు ప్యాకప్!

మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవిని ఆ పార్టీ నేతలు అత్యవసరంగా ఢిల్లీకి రప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రయివేట్ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ బిల్లుపై నేడు పార్లమెంటులో ఓటింగ్ జరిగే అకాశం ఉంది. ఆ బిల్లును ఎలాగైనా నెగ్గించాలన్న లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచించింది. అందులో భాగంగానే పార్టీ ఎంపీలంతా నేడు పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాలని విప్ జారీ చేసింది.
 
ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరంజీవి విప్‌కు సంబంధించిన మెసేజ్ రాగానే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. నేటి పార్లమెంట్ సమావేశాల్లో కేవీపీ ప్రయివేట్ బిల్లుకు అనుకూలంగా చిరంజీవి ఓటు వేస్తారని తెలుస్తోంది.

No comments:

Post a Comment