Wednesday, 27 July 2016

హెల్మెట్‌ ధరించిన వారికి పోలీస్‌శాఖ బంపర్‌ ఆఫర్‌

చెన్నై : ఎన్నిరకాలుగా అవగాహన కల్పిస్తున్నా హెల్మెట్‌ ధరించడానికి ద్విచక్రవాహనదారులు మొండికేస్తుండడంతో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పోలీస్‌శాఖ ‘బంపర్‌ ఆఫర్‌’ ప్రకటించింది. హెల్మెట్‌దారులకు ‘ఫ్యామిలీ టూర్‌’ ఇస్తామని ప్యాకేజీ ప్రకటించింది. హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనిని అడ్డుకునేందుకు పుదుచ్చేరి పోలీస్‌శాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా ఓ పథకం రూపొందించాయి. హెల్మెట్‌ ధరించి వాహనాలు నడిపేవారి వివరాలు తెలుసుకుని డ్రా పద్దతిలో 10 మందిని ఎంపిక చేసి, వారిని కుటుంబీకులతో సహా ఉచితంగా విహారానికి పంపుతామని ప్రకటించింది. ఇందుకు గాను గురువారం నుంచి ఆదివారం వరకు ట్రాఫిక్‌ అధికారులు గస్తీ నిర్వహించి వాహన చోదకుల వద్ద పేర్లు సేకరించనున్నట్లు పుదుచ్చేరి డీజీపీ సునీల్‌కుమార్‌ తెలిపారు.

No comments:

Post a Comment