జలుబు
చేసినప్పుడు తుమ్ములు రావడం సహజం. కొంతమందికి డస్ట్ అలర్జీ వల్ల కూడా
తుమ్ములొస్తుంటాయి. కొంతమంది ఈ అలర్జీ ప్రభావంతో ఆ ప్రదేశంలో ఉన్నంతసేపు
తుమ్ముతూనే ఉంటారు. ఎవరికైనా మహా అయితే ఎన్నిసార్లు తుమ్ముతారు ? రోజుకు
100 తుమ్ములు తుమ్ముతారనుకుందాం. కానీ ఇంగ్లండ్‌లో సెటిలైన ప్రియ కూతురు
ఇరా సక్సేనా అనే 9 ఏళ్ల బాలిక ఏకంగా రోజుకు 8వేల సార్లు తుమ్ముతుంది.
వినడానికి కొంచెం నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇది నిజం. మూడువారాల క్రితం
సక్సేనా తల్లి ప్రియ నిద్రలేపేందుకు ఆమె గదికి వెళ్లింది. నిద్ర లేపగానే
సక్సేనా విపరీతంగా తుమ్మడం మొదలుపెట్టింది. ఏం చేసినా తుమ్ములాగడం లేదు.
దీంతో హుటాహుటిన సక్సేనాను తల్లి ప్రియ ఆసుపత్రికి తీసుకెళ్లింది.
సక్సేనాను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఎటువంటి అలర్జీ లేదని తేల్చేశారు.
జలుబు వల్ల తుమ్ముతుందా అంటే అదీ కాదు.
ఆమె ఎందుకలా
తుమ్ముతుందో డాక్టర్లకు కూడా అంతుపట్టడం లేదు. మెదడుకు తప్పుడు సంకేతాలు
వెళ్లడం వల్లే ఆమెకు అలా తుమ్ములొస్తున్నాయేమోనన్న సందేహాన్ని డాక్టర్లు
వ్యక్తం చేశారు. అది కూడా కచ్చితంగ చెప్పలేమన్నారు. స్టెరాయిడ్స్, నాసల్
స్ప్రే ఏవీ కూడా ఆమె తుమ్ములను ఆపలేకపోతున్నాయి. నిద్ర మేల్కొన్న
దగ్గర్నుంచి ఆమె ఈ సమస్యతో బాధపడుతోంది. ఆమె ఇలా బాధపడుతుండటంతో స్కూల్‌కు
పంపించడం కూడా మానేశారు. హోమియోథెరపీని నమ్ముకున్నామని సక్సేనా తల్లి ప్రియ
చెబుతోంది. ఏదేమైనా ఇలాంటి వింత పరిస్థితి ఏ చిన్నారికి రాకూడదు.

No comments:
Post a Comment