కృష్ణా పుష్కరాలకు 358 రైళ్లు... వాటి వివరాలివే...

- వివిధ ప్రాంతాల నుంచి 358 రైళ్లు
- రాయనపాడు, కృష్ణాకెనాల్ తదితర శాటిలైట్ల స్టేషన్లలో హాల్ట్
కృష్ణా
పుష్కర యాత్రీకుల కోసం దక్షిణ- మధ్య రైల్వే పుష్కలంగా రైళ్ళను
నడుపుతున్నది. విజయవాడకు అనుబంధంగా ఉన్న శాటిలైట్ స్టేషన్లలో రైళ్ళు ఆగే
విధంగా షెడ్యూలు నిర్ణయించారు. ఈమేరకు 359 రైళ్ళ వివరాలను దక్షిణ మధ్య
రైల్వే అధికారులు గురువారం షెడ్యూలు ప్రకటించారు.
- సికింద్రాబాద్-
కృష్ణాకెనాల్- సికింద్రాబాద్ మధ్య వచ్చేనెల 14 నుంచి 21 వతేదీ వరకు
నాలుగు సర్వీసులు నడుస్తాయి. రెండు ఏసీ టు టైర్ కోచ్‌లు, మూడు ఏసీ త్రీ
టైర్ కోచ్‌లు, 11 స్లీపర్ క్లాస్‌కోచ్‌లు, మూడు జనరల్ కోచ్‌లు, రెండు
సెకండ్ క్లాస్ లగేజి కమ్ బ్రేక్‌వ్యాన్లు.
-
గుంతకల్-కృష్ణ- గుంతకల్ మధ్య వచ్చేనెల 13వతేదీ నుంచి 23వతేదీ వరకు 12
సర్వీసులు నడుస్తాయి. ఎనిమిది జనరల్ సెకండ్‌క్లాస్ బోగీలు, రెండు
సెకండ్‌క్లాస్ గుంతకల్-కృష్ణాకెనాల్ మధ్య మరో 12 సర్వీసులు నడుస్తాయి.
- తిరుపతి-కృష్ణ-తిరుపతి మధ్య వచ్చేనెల 11వతేదీ నుంచి 24 వతేదీ వరకు 22 సర్వీసులు నడుస్తాయి.
-
నర్సాపూర్- కృష్ణాకెనాల్ మధ్య వచ్చేనెల 12 నుంచి 23 వతేదీ వరకు 24
సర్వీసులు నడుస్తాయి. ఈ రైళ్ళలో రెండు ఏసీ టు టైర్ , రెండు ఏసీ త్రీ
టైర్, పది స్లీపర్ క్లాస్ , ఆరు జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు,
వచ్చేనెల 14-21 తేదీల మధ్య విజయవాడ -సికింద్రా బాద్‌లకు నాలుగు సర్వీసులను
నడపనున్నారు.
- సికింద్రాబాద్-కృష్ణ- సికింద్రాబాద్
మధ్య వచ్చేనెల 12 నుంచి 23 వతేదీ వరకు 24 సర్వీసులను నడుపుతారు. ఈరైళ్ళలో
టు టైర్, త్రీటైర్ కోచ్‌లతో పాటు నాలుగు జనరల్ కోచ్‌లు ఉంటాయి.
- వచ్చేనెల 11 నుంచి 24 వతేదీ వరకు నర్సాపూర్- విజయవాడ మధ్య 24 సర్వీసులు నడుస్తాయి.
- విజయవాడ- నర్సాపూర్ మధ్య 12 నుంచి 23 వతేదీ వరకు 24 డెము స్పెషల్ రైళ్ళను నడపనున్నారు.
- విజయవాడ-మచిలీపట్నం మధ్య కూడా 12 నుంచి 23 వతేదీ వరకు 24 డెము ప్రత్యేక రైళ్ళను నడపనున్నారు.
-
11వతేదీ నుంచి 24 వతేదీ వరకు భద్రాచలంరోడ్డు- విజయవాడ మధ్య 26 రైళ్ళను
నడుపుతారు. 12 నుంచి 23 వరకు ఇదే మార్గంలో 24 డెము రైళ్ళను నడపనున్నారు.
రాజమండ్రి - రాయనపాడు మధ్య 12 నుంచి 23 వతేదీ వరకు 22 రైళ్ళను నడపనున్నారు.
ఈరైళ్ళు మార్గంమధ్యలో జిల్లాలోని నూజివీడు, తేలప్రోలు, గన్నవరం,
ముస్తాబాద్, గుణదల స్టేషన్లలో కూడా ఆగుతాయి.
- వచ్చేనెల 12
నుంచి 17వతేదీ వరకు, 19 నుంచి 23 వతేదీ వరకు రాయనపాడు- రాజమండ్రి మధ్య 22
డెము ప్రత్యేక రైళ్ళునడుస్తాయి. కృష్ణాకెనాల్- ఒంగోలు మధ్య 12 నుంచి 18
వరకు, 20 నుంచి 23 వతేదీ వరకు మొత్లం 24 డెము ప్రత్యేక రైళ్ళను
నడపనున్నారు. రైళ్ల సమయాలను రైల్వే సమాచార కేంద్రాలకు ఫోన్లు చేసి
తెలుసుకోవచ్చు. రైళ్ళలో జనరల్ బోగీల సంఖ్యను కూడా పెంచారు.
No comments:
Post a Comment