చారిత్రక భువనగిరి ఖిల్లా
సమీపంలోని మట్టిదిబ్బల కింద పురాతన అమ్మవారి ఆలయం బయటపడింది. ఆదివారం
ఖిల్లా సమీపంలోని వ్యవసాయ పొలాల్లో రైతులు మట్టిదిబ్బలను తవ్వుతుండగా తలపై
కిరీటం.. కంఠాభరణాలు.. చేతుల్లో ఆయుధాలతో.. దివ్యమైన ముఖవర్చస్సుతో సుమారు
ఎనిమిది అడుగుల ఎత్తుగల రాతి విగ్రహం బయట పడింది. దీంతో పాటు రాతి
స్తంభాలు, ఆంజనేయస్వామి విగ్రహాలు లభ్యమయ్యాయి. మట్టిదిబ్బల కింద సుమారు
500 చదరపు గజాల విస్తీర్ణంలో శిథిలమైన పురాతన కాళీకాదేవి ఆలయం ఉండి
ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. రైతులు పురావస్తుశాఖ అధికారులకు
సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానికులు విగ్రహాలకు పూజలు
చేస్తున్నారు. భువనగిరి ఖిల్లా సమీపంలో రాజుల కాలంలో నిర్మించిన కాళీమాత
ఆలయంగా భక్తులు భావిస్తున్నారు.

No comments:
Post a Comment