Saturday, 23 July 2016

పెరుగు పోషకాలు తెలుసా!


పెరుగూ, పాలూ తీసుకోవడానికి ఆసక్తి చూపించరు కొందరు. దానివల్ల బరువు పెరుగుతామనే అభిప్రాయంలో ఉంటారు. కానీ పిల్లలకు పెరుగు ఎలా అవసరం అవుతుందో మనకూ అంతే. దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది మరి. అదెలాగంటే...

జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలంటే ప్రతిరోజూ పెరుగు తీసుకోవాలి. పైగా మనం తీసుకునే ఇతర పదార్థాల నుంచి పోషకాలనూ శరీరం స్వీకరిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల పొట్టలో ఇన్‌ఫెక్షన్లు కూడా అదుపులో ఉంటాయి.
* పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచి, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్‌ ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.
* ఇతర పాల పదార్థాల్లానే పెరుగులోనూ క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకూ, పళ్లకూ మేలుచేస్తుంది. పెరుగులో ఫాస్పరస్‌ కూడా ఉంటుంది. ఇది క్యాల్షియంతో కలవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ పెరుగు తినడం వల్ల భవిష్యత్తులో కీళ్లనొప్పులూ, ఆస్టియోపోరోసిస్‌ లాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి.
* కొన్ని సందర్భాల్లో చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కప్పు పెరుగు తిని చూడండి. అది ఒత్తిడిని చాలా సులువుగా తగ్గిస్తుంది. మానసిక సాంత్వననూ అందిస్తుంది. అలాగే అధికబరువునూ తగ్గిస్తుంది పెరుగు.
* ప్రతిరోజూ పెరుగు తీసుకునేవారిలో గుండె సంబంధ సమస్యలు చాలామటుకూ అదుపులో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అధికరక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది.

No comments:

Post a Comment